హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డును వినియోగిస్తున్నారా?

లేట్ పేమెంట్ చార్జీలను నివారించడానికి, కనీసం గడువు తేదీకి ముందే కనీస చెల్లింపు మొత్తాన్ని చెల్లించడం మంచిది

హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డును వినియోగిస్తున్నారా?

క్రెడిట్ కార్డులపై లేట్ పేమెంట్ చార్జీలను సవరిస్తున్నట్లు తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించింది. కొత్త చార్జీలు ఏప్రిల్ 1, 2019 నుంచి వర్తించనున్నాయని బ్యాంకు తెలిపింది. దీనిలో భాగంగా రూ. 500 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ బ్యాలన్స్ చెల్లింపులలో ఆలస్యం జరిగినట్లైతే, ప్రస్తుతం విధిస్తున్న చార్జీల కంటే ఎక్కువ చార్జీలను విధించనుంది. అందువలన హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు గడువు తేదీకి ముందే అవుట్ స్టాండింగ్ బ్యాలన్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా గడువు తేదీలోగా కనీస చెల్లింపు మొత్తాన్ని చెల్లించడంలో కూడా విఫలమైనట్లైతే, లేట్ పేమెంట్ చార్జీలను వసూలు చేస్తారు. ప్రతి క్రెడిట్ కార్డుపై, మొత్తం అవుట్ స్టాండింగ్ బ్యాలన్స్ లో కనీస చెల్లింపు మొత్తం అనేది 5 శాతంగా ఉంటుంది. లేట్ పేమెంట్ చార్జీలను నివారించడానికి, కనీసం గడువు తేదీకి ముందే కనీస చెల్లింపు మొత్తాన్ని చెల్లించడం మంచిది. ఇలా చేయడం వలన, హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్ కి కాల్ చేసి లేట్ పేమెంట్ చార్జీలను తీసివేయాలని కోరడం లేదా ఆలస్య చెల్లింపులకు గల కారణాలను వివరించాల్సిన అవసరం ఉండదు. ఇన్ఫినియా క్రెడిట్ కార్డులు మినహా, మిగిలిన హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులపై సవరించిన చార్జీల వివరాలను కింద తెలియచేశాము :

  1. స్టేట్మెంట్ బ్యాలెన్స్: రూ. 100

మార్చి 31, 2019 వరకు లేట్ పేమెంట్ చార్జీలు: సున్నా

ఏప్రిల్ 1, 2019 నుంచి లేట్ పేమెంట్ చార్జీలు: సున్నా

  1. స్టేట్మెంట్ బ్యాలెన్స్: రూ. 100 నుంచి రూ. 500

మార్చి 31, 2019 వరకు లేట్ పేమెంట్ చార్జీలు: రూ. 100

ఏప్రిల్ 1, 2019 నుంచి లేట్ పేమెంట్ చార్జీలు: రూ. 100

  1. స్టేట్మెంట్ బ్యాలెన్స్: రూ. 501 నుంచి రూ. 5000

మార్చి 31, 2019 వరకు లేట్ పేమెంట్ చార్జీలు: రూ. 400

ఏప్రిల్ 1, 2019 నుంచి లేట్ పేమెంట్ చార్జీలు: రూ. 500

  1. స్టేట్మెంట్ బ్యాలెన్స్: రూ. 5001 నుంచి రూ. 10000

మార్చి 31, 2019 వరకు లేట్ పేమెంట్ చార్జీలు: రూ. 500

ఏప్రిల్ 1, 2019 నుండి లేట్ పేమెంట్ చార్జీలు: రూ. 600

  1. స్టేట్మెంట్ బ్యాలెన్స్: రూ. 10000 నుంచి రూ. 25000

మార్చి 31, 2019 వరకు లేట్ పేమెంట్ చార్జీలు: రూ. 750

ఏప్రిల్ 1, 2019 నుంచి లేట్ పేమెంట్ చార్జీలు: రూ. 800

  1. స్టేట్మెంట్ బ్యాలెన్స్: రూ. 25000 కంటే ఎక్కువ

మార్చి 31, 2019 వరకు లేట్ పేమెంట్ చార్జీలు: రూ. 750

ఏప్రిల్ 1, 2019 నుంచి లేట్ పేమెంట్ చార్జీలు: రూ. 950

గడువు తేదీ నాటికి కార్డు వినియోగదారుడు మూడు ఆప్షన్లను కలిగి ఉంటాడు. వాటిలో మొదటిది మొత్తం అవుట్ స్టాండింగ్ బ్యాలన్స్ లో కనీసం 5 శాతం మొత్తాన్ని చెల్లించాలి, రెండవది పాక్షిక మొత్తాన్ని చెల్లించాలి, ఇక మూడవది మొత్తం క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ బ్యాలన్స్ ను పూర్తిగా చెల్లించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, కార్డు అవుట్ స్టాండింగ్ బ్యాలన్స్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించినప్పుడు మాత్రమే వడ్డీ చార్జీలు వర్తించవు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly