కోవిడ్-19 కోసం ప్రత్యేకంగా బీమా పాలసీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?

ఈ పాలసీలలో ఎక్కువ భాగం ఆకర్షణీయమైన ప్రీమియంతో పాటు స్థిర ప్రయోజన ఉత్పత్తులను అందిస్తున్నాయి

కోవిడ్-19 కోసం ప్రత్యేకంగా బీమా పాలసీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడంతో, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లోంబార్డ్, భారతీ ఆక్సా హెల్త్, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి ఆరోగ్య బీమా సంస్థలు కోవిడ్-స్పెసిఫిక్ పాలసీలను రూపొందించాయి. డిజిట్ ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ శాండ్‌ బాక్స్ రెగ్యులేషన్ కి లోబడి ఇలాంటి ప్రోడక్ట్ ని అందించింది.

ఈ పాలసీలలో ఎక్కువ భాగం ఆకర్షణీయమైన ప్రీమియంతో పాటు స్థిర ప్రయోజన ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఈ పాలసీలు రూ. 25,000 నుంచి రూ. లక్ష మధ్య బీమా మొత్తంతో లభిస్తాయి. అయితే, ఇప్పటి వరకు బీమా సంస్థలు అందుకున్న కోవిడ్ -19 క్లెయిమ్‌ల విలువ రూ. 7 లక్షలకు చేరుకుంది. అటువంటి కోవిడ్-స్పెసిఫిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మీకు కూడా కొనాలని అనుకున్నట్లైతే, కింద తెలిపిన విషయాలను గుర్తుంచుకోండి.

బీమా మొత్తం :

ఒకవేళ మీకు కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లైతే, చికిత్సకు అయ్యే ఖర్చు మీ పరిస్థితి తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ రోగి పరిస్థితి క్లిష్టంగా ఉండి ఐసీయూ లేదా వెంటిలేటర్ సౌకర్యాలు అవసరమైతే, అప్పుడు చికిత్స ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కోవిడ్-స్పెసిఫిక్ ఇన్సూరెన్స్ పాలసీలు రూ. 25,000 నుంచి రూ. 1,00,000 మధ్య కవరేజ్ ను అందిస్తాయి. ఒకవేళ మీరు ఆసుపత్రిలో చేరితే ఈ మొత్తం మీకు సరిపోకపోవచ్చు. అయినప్పటికీ, వీటిలో ఎక్కువ భాగం డిఫైన్డ్ -బెనిఫిట్ పాలసీలు కావున, మీరు పూర్తి బీమా మొత్తాన్ని పొందుతారు. క్లెయిమ్ విధానం ఒక్కో సంస్థకు ఒక్కోలా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, డిజిట్ ఇన్సూరెన్స్ కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్ వచ్చి, రోగ నిర్ధారణ కోసం నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పూణే లేదా దాని అనుబంధ కేంద్రాలకు పంపినప్పుడు పాలసీదారులను క్లెయిమ్ దాఖలుకు అనుమతిస్తుంది, అయితే స్టార్ హెల్త్ మాత్రం పాలసీదారులు ఆసుపత్రిలో చేరి, ప్రభుత్వ అధీకృత కేంద్రాల నుంచి పాజిటివ్ నిర్ధారణ నివేదిక వచ్చిన్నప్పుడు మాత్రమే చెల్లింపు చేస్తుంది .

మినహాయింపులు :

వ్యాధి-నిర్దిష్ట పాలసీని కొనుగోలు చేయడానికి ముందు పాలసీ డాక్యుమెంట్ ను నిశితంగా పరిశీలించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇటువంటి పాలసీలు చాలా మినహాయింపులతో వస్తాయి, అటువంటి సందర్భంలో పాలసీదారునికి క్లెయిమ్ దాఖలు చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఈ పాలసీలు చాలా వరకు ఒక సంవత్సరం కాలపరిమితితో లభిస్తాయి, కానీ 1 డిసెంబర్, 2019 తర్వాత జాబితాలో తెలిపిన దేశాలలో ప్రయాణించిన వారికి ఈ పాలసీని అందించకపోవచ్చు. దగ్గు, జలుబు లేదా నాసల్ బ్లాక్, జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్న వారికి కూడా ఈ పాలసీని అందించకపోవచ్చు. కొన్ని పాలసీలు 24 గంటల హాస్పటలైజెషన్ లేకుండా క్లెయిమ్ చేయడానికి పాలసీదారులను అనుమతించకపోవచ్చు.

దీనిని ఎవరు ఎంచుకోవాలి?

ప్రతి ఒక్కరూ రెగ్యులర్ హెల్త్ కవర్ ను కలిగి ఉండటం చాలా మంచిది. ఏదేమైనా, ఆరోగ్య బీమా పాలసీ లేని ఎవరైనా అటువంటి పాలసీని కొనుగోలు చేయడాన్ని పరిగణించవచ్చు, కానీ పాలసీ తీసుకునే ముందు మినహాయింపులను అర్థం చేసుకోవడం మంచిది. కొనుగోలు చేసే ముందు ఉత్పత్తిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమీ లేని దాని కంటే ఎంతో కొంత బీమా కలిగి ఉండటం ఉత్తమం. ఒకవేళ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లయితే, కనీసం చికిత్సకు కొంత అయినా కవరేజ్ లభిస్తుంది. ఒకవేళ, చికిత్స ఖర్చు ఎక్కువగా ఉన్నట్లయితే, చాలా ఖర్చులను పాలసీ కవర్ చేస్తుంది. అలాగే, అనేక సాధారణ ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులను కూడా భరిస్తాయి. ఇప్పటికే ఉన్న బీమా మొత్తం మీకు సరిపోదని భావిస్తే, టాప్ అప్ కొనడాన్ని మీరు పరిగణించవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly