న‌ల్గొండ‌లో జ‌రిగిన‌ ఈనాడు సిరి మ‌దుప‌రుల స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా అవ‌గాహ‌న స‌ద‌స్సును నిర్వ‌హించాయి

న‌ల్గొండ‌లో జ‌రిగిన‌ ఈనాడు సిరి మ‌దుప‌రుల స‌ద‌స్సు విశేషాలు
  • ప్ర‌ణాళిక‌తోనే ఆర్థిక విజ‌యం
  • ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అంచ‌నా వేసుకోవాలి
    -ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ స‌ద‌స్సులో నిపుణులు

స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక‌, దీర్ఘ‌కాలిక వ్యూహాల‌తో పెట్టుబ‌డులు పెడితేనే జీవితంలోని అన్ని ద‌శ‌ల్లో ఆర్థికంగా హాయిగా ఉంటామ‌ని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ , ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ’ సంయుక్తంగా న‌ల్గొండ‌లో ఆదివారం మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సును నిర్వ‌హించాయి. ఈ సంద‌ర్భంగా జెన్‌మ‌నీ జీఎం జె.వేణుగోపాల్ మాట్లాడుతూ…‘మ‌న ల‌క్ష్యాలేమిట‌న్న‌ది నిర్ణ‌యించుకొని , వాటిని సాధించేందుకు ఉప‌క‌రించే ప‌థ‌కాల్లో మ‌దుపు చేయాల‌ని సూచించారు. మ్యూచువ‌ల్ ఫండ్లు, షేర్ల‌ను ఎంచుకున్న‌ప్పుడు న‌ష్ట‌భ‌యం ఉంటుంది. స‌రైన పెట్టుబ‌డి వ్యూహాల‌ను పాటిస్తే మంచి లాభాల‌ను సొంతం చేసుకునే అవ‌కాశాన్ని ఇస్తాయి. వ‌య‌సు, కుటుంబ నేప‌థ్యం , ఆర్థిక స్థితిగ‌తులు, దీర్ఘ‌కాంలో వ‌చ్చే రాబ‌డిలాంటివ‌న్నీ బేరీజు వేసుకొని మ‌దుపు ప్రారంభించాలి. ఎవ‌రో చెప్పార‌ని మ‌న‌కు అర్థం కాని ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌ద్దు. నెల‌కు వ‌చ్చే ఆదాయంలో క‌నీసం 20 నుంచి 25 శాతం పొదుపు చేసేలా ప్ర‌ణాళిక ఉండాలి. పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు ఒకే ప‌థ‌కాన్ని నమ్ముద్దు. వీలైనంత వ‌ర‌కూ వైవిధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. గ‌త కొంత‌కాలంగా స్టాక్ మార్కెట్‌లో హెచ్చుత‌గ్గులు క‌నిపిస్తున్నాయి. దీర్ఘ‌కాలిక మ‌దుప‌రులు వీటిని చూసి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు’ అని తెలిపారు.
IMG_20190908_115931.png

చిన్న మొత్తాల‌తోనే…కాల‌గ‌మ‌నంలో పెద్ద నిధిని సృష్టించ‌డం సాధ్యం అవుతుంద‌ని ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ ప్రాంతీయ అధిప‌తి బి.రాజేంద్ర అన్నారు. ఉద్యోగంలో చేరిన‌ప్పుడే…ప‌ద‌వీ విర‌మ‌ణ ల‌క్ష్యంగా పెట్టుబ‌డులు కొన‌సాగాల‌ని చెప్పారు. ‘న‌ష్ట‌భ‌యం ప్ర‌తి చోటా ఉంటుంది. అధిక న‌ష్ట‌భ‌యం ఉన్న చోటే రాబ‌డి ఎక్కువ‌గా ఉంటుంద‌న్న‌ది గుర్తుంచుకోవాలి. ప్ర‌స్తుతం ఒక నెల‌కు రూ.30 వేలు ఖ‌ర్చ‌వుతుంది అనుకుంటే ఇప్పుడున్న ద్ర‌వ్యోల్మ‌ణంతో వ‌చ్చే 30 ఏళ్ల‌లో ఆ మొత్తం రూ.1.72 ల‌క్ష‌లు అవుతుంది. ఈ ఖ‌ర్చుల‌ను త‌ట్టుకునేలా కాస్త మంచి రాబ‌డినిచ్చే ఈక్విటీలు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడితే భ‌విష్య‌త్తులో ఆర్థిక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కావు. తొలుత చిన్న మొత్తాల‌తో ప్రారంభించి మార్కెట్‌ను అధ్య‌యనం చేసిన త‌ర్వాత క్ర‌మంగా మ‌దుపును పెంచుకుంటూ పోవాలి. అవ‌స‌ర‌మైన‌ప్పుడు నిపుణుల స‌ల‌హాలు తీసుకోవాలి’ అని సూచించారు. వీటితోపాటు నిపుణులు బీమా, ఆర్థిక ప్ర‌ణాళిక అవ‌స‌రంలాంటి అంశాల‌ను సోదాహ‌ర‌ణంగా వివ‌రించారు.‘ఈనాడు’ సూర్యాపేట ఇన్‌ఛార్జి వెంక‌ట‌ప‌తిరావు హాజ‌ర‌య్యారు.
IMG_20190908_110905.png

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly