దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌తోనే లాభాలు.. నంద్యాల‌లో మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌తోనే లాభాలు..  నంద్యాల‌లో మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు
  • అవ‌గాహ‌న‌తో మ‌దుపు చేయాలి
  • భావోద్వేగాల‌తో నిర్ణ‌యాలు ర‌ద్దు
    -సిరి ఇన్వెస్ట‌ర్స్‌ క్ల‌బ్ స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు

‘ఆర్థిక వ్య‌వ‌స్థ బాగుంటే మార్కెట్లు దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని అందిస్తాయి. ఇందులో మ‌దుపు చేసి, వీలైనంతో కాలం వేచి చూస్తే అధిక లాభాలు రావ‌డానికి అవ‌కాశం ఉంటుంది’ అని నిపుణులు సూచించారు. శ‌నివారం నంద్యాల‌లో ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్ క్ల‌బ్, ఆదిత్య బిర్లా సన్ లైప్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ’ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు మంచి స్పంద‌న ల‌భించింది.

Nandyal-Post-4.png

కార్య‌క్ర‌మంలో జెన్ మ‌నీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ జె.వేణుగోపాల్ మాట్లాడుతూ… గ‌త 30 ఏళ్లుగా జీడీపీ సూమారు 9 రెట్లు పెరిగితే, సెన్సెక్స్ 39 రెట్ల‌కు పైగా పెరిగింద‌న్నారు. ‘ప్ర‌స్తుత త‌రుణంలో ఆర్థిక వ్య‌వ‌స్థ ముందుకు వెళ్లాలంటే ప్ర‌భుత్వం పెట్టుబ‌డుల‌కు తోడు ప్రైవేటు భాగ‌స్వామ్యం, ఎగుమ‌తులు, వినిమ‌యం పెరిగేలా అడుగులు వేయాలి. ద్ర‌వ్య ల‌భ్య‌త‌, రుణ విత‌ర‌ణ‌, ఉద్యోగ క‌ల్ప‌న‌పై మ‌రింత దృష్టిపెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. మార్కెట్లో మ‌నం పెట్టిన పెట్టుబ‌డుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తూ అవ‌స‌ర‌మైన మార్పులు చేసుకోవాలి. నిరాశావాదం ఎక్కువ ఉన్న‌ప్పుడు ఈక్విటీల్లో మ‌దుపు చేసేందుకు మంచి స‌మ‌యం. ఆశావాదం ఉంటే లాభాల‌ను స్వీక‌రించాలి. నాలుగైదు రంగాల్లో ప‌ది…పన్నెండు కంపెనీల్లో పెట్టుబ‌డులు ఉండేలా చూసుకోవాలి. అధిక రుణ‌ భారం ఉన్న కంపెనీలు, యాజ‌మాన్యం స‌రిగాలేని సంస్థ‌ల షేర్ల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ట్రేడింగ్ చేస్తున్న‌ప్పుడు స్టాప్‌లాస్ సూత్రాన్ని పాటించాలి’ అని తెలిపారు.

Nandyal-POST-2.png

ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ ఛాన‌ల్ హెడ్ జీవీవీ గంగాధ‌ర్ మాట్లాడుతూ…‘ఎవ‌రో చెప్పార‌ని కాకుండా అవ‌గాహ‌న‌న‌తో పెట్టుబ‌డి పెట్టాల‌ని సూచించారు. ఉద్యోగంలో చేరిన‌ప్పుడు ప‌దివీ విర‌మ‌ణ అవ‌స‌రాల కోసం మ‌దుపు చేసుకోవాల‌న్నారు. జీవిత బీమా క‌ష్ట‌కాలంలో కుటుంబానికి భ‌రోసా ఇస్తుంద‌ని, ప్ర‌తి కుటుంబ పెద్ద ట‌ర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల‌ని తెలిపారు. 2000 సంవ‌త్స‌రంలో కుటుంబ ఖ‌ర్చు రూ.10 వేలుగా ఉంటే ప్ర‌స్తుతం రూ.28 వేల‌కు చేరింద‌ని, రాబోయే 30 ఏళ్ల‌లో ఇది రూ.1.72 లోల‌కు చేరుకునే ఆస్కారం ఉంద‌న్నారు. అందుకే వ్యూహాత్మ‌కంగా చిన్న మొత్తంతోనే కాల‌గ‌మ‌నంలో పెద్ద నిధిని సృష్టించాల‌ని తెలిపారు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి విధానం (సిప్) ద్వారా మదుపు చేసిన‌ప్పుడు మార్కెట్ హెచ్చుతగ్గుల్లో స‌గ‌టు ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంద‌ని’ తెలిపారు. క‌ర్నూలు ‘ఈనాడు’ యూనిట్ ఇన్‌ఛార్జి జి.రాజేంద్ర స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly