రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌రిగిన ఈనాడు సిరి మ‌దుపరుల స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌రిగిన ఈనాడు సిరి మ‌దుపరుల స‌ద‌స్సు విశేషాలు
  • మీ డ‌బ్బును క‌ష్ట‌పెట్టండి
  • దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌తోనే లాభం
  • ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు
    భ‌విష్యత్తు ఆర్థిక అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని త‌గిన ప్ర‌ణాళిక‌లు ర‌చించుకోవాలిని, అప్పుడే ఎలాంటి ఇబ్బందులూ లేని జీవ‌నం సాధ్య‌మ‌వుతుంద‌ని నిపుణులు సూచించారు. త‌క్కువ మొత్తంతో పెట్టుబ‌డి పెట్టినా…దీర్ఘ‌కాలం వేచి చూస్తే మంచి ఫ‌లితాలు అందుకునే వీల‌వుతుంద‌ని తెలిపారు. ఆదివారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ’ సంయుక్తంగా నిర్వ‌హించిన స‌ద‌స్సుకు మంచి స్పంద‌న ల‌భించింది.
IMG-3.png

కార్య‌క్ర‌మంలో ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ రీజ‌న‌ల్ మేనేజ‌ర్ బి.రాజేంద్ర మాట్లాడుతూ… ‘ఖ‌ర్చులు పెరిగిపోతున్నాయి. వాటికి త‌గ్గ‌ట్టు ఆదాయం పొంద‌డం క‌ష్ట‌త‌రంగా మారింది. ఉన్న ఆదాయాన్ని ఇప్పుడున్న వ్య‌యాల‌కు స‌ర్దుబాటు చేసుకుంటూ…రాబోయే రోజు కోసం కొంత దాచుకోవాలి. చాలామంది ముందు ఖ‌ర్చు చేసి, మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తుంటారు. దీనికి భిన్నంగా తొలుత పెట్టుబ‌డి, త‌ర్వాతే ఖ‌ర్చు అనే సూత్రాన్ని పాటించాలి. సంపాద‌న ప్రారంభ‌మైన వెంట‌నే మ‌దుపు ప్రారంభించాలి. 20 ఏళ్ల క్రితం ఒక కుటుంబ నిర్వ‌హ‌ణ‌కు రూ.10 వేలు స‌రిపోతే ఇప్పుడు రూ.30 వేలు అవ‌స‌రం అవుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మ‌న‌ ప్ర‌ణాళిక‌లు ఉండాలి’ అని సూచించారు.

IMG-2.png

జెన్ మ‌నీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ జె.వేణుగోపాల్ మాట్లాడుతూ…‘చాలామంది ఈరోజు పెట్టుబ‌డి పెట్టి, రేపు రెట్టింపు కావాల‌ని చూస్తుంటారు. ఇది స‌రైన ఆలోచ‌న కాదు. స‌రైన విధానం, ప‌థ‌కంలో మ‌దుపు చేసి, కాస్త ఓపిక‌తో వేచి చూడాలి. అప్పుడే ఆశించిన ల‌క్ష్యాలు నేర‌వేరేలా రాబ‌డి అందుతుంది. పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా మ‌న కోసం డ‌బ్బును క‌ష్ట‌పెట్టాలి. డ‌బ్బుల‌న్నీ ఒకే చోటపెడితే న‌ష్ట‌భ‌యం అధికంగా ఉంటుంది. సుర‌క్షిత ప‌థ‌కాలు, వృద్ధికి దోహ‌దం చేసే వాటిల్లో వైవిధ్యంగా మ‌దుపు చేయ‌డం ఉత్తమం. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో రూ.100 తోపూ పెట్టుబ‌డి ప్రారంభించే అవ‌కాశం ఉంది. ఒక సంస్థ షేర్ల‌లో మ‌దుపు చేయాల‌నుకుంటే…దాని గురించి పూర్తిగా వివ‌రాలు తెలుసుకోవాలి. రుణ భారం అధికంగా ఉన్న కంపెనీల జోలికి వెళ్ల‌కూడ‌దు’ అని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ‘ఈనాడు’ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం యూనిట్ ఇన్‌ఛార్జి టి.వి చంద్ర‌శేఖ‌ర ప్ర‌సాద్ పాల్గొన్నారు

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly