విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మ‌దుపరుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మ‌దుపరుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు
  • ఆర్థిక ప్ర‌ణాళిక‌తోనే… బంగారు భ‌విష్య‌త్తు
  • దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులే మేలు
    -సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు

‘భ‌విష్య‌త్తులో డ‌బ్బు ప‌ర‌మైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే… ఉద్యోగంలో చేరిన వెంట‌నే ఆర్థిక ప్ర‌ణాళిక మొద‌లు పెట్టాలి. సంపాదించే మొత్తంలో వీలైనంత పెట్టుబ‌డుల వైపు మ‌ళ్లించాలి’ అని నిపుణులు పేర్కొన్నారు. పెట్టుబ‌డుల విష‌యంలో రాబ‌డిని ఖ‌చ్చితంగా అంచ‌నా వేయ‌డం సాధ్యం కాదు. ఆర్థిక విజ‌యం సాధించాలంటే సంప్ర‌దాయ‌, వృద్ధికి తోడ్ప‌డే ప‌థ‌కాల మేళ‌వింపుతో స‌రైన వైవిధ్యాన్ని పాటించాల‌న్నారు. శ‌నివారం విజ‌య‌వాడ‌లో ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్’ సంయుక్తంగా నిర్వహించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌దస్సుకు విశేష‌ స్పంద‌న ల‌భించింది.

స‌ర్టిఫైడ్ ఫైనాన్షియ‌ల్ ప్లానర్ సాయి కృష్ణ ప‌త్రి మాట్లాడుతూ…

IMG-2.png

‘చాలా మంది 50 ఏళ్లు దాటాక ఆర్థిక ప్ర‌ణాళిక గురించి ఆలోచిస్తారు. ఈ స‌మ‌యంలో భాద్య‌త‌లు అధికమ‌వుతాయి. అప్పుడు మ‌న‌కోసం డ‌బ్బును కేటాయించుకోవ‌డం క‌ష్టం అవుతుంది. కాబ‌ట్టి, విశ్రాంత జీవితాన్ని ప్ర‌శాతంగా గ‌డిపేందుకు ఎంత మొత్తం అవ‌స‌ర‌మో ప‌క్క‌గా లెక్క‌లు వేసుకోవాలి. ప్ర‌స్తుతం ఎంత ఖర్చు అవుతోంది…భ‌విష్య‌త్తులో ఎంత అవ‌స‌రం అనేది ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. జీవ‌న శైలి ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకుని, వీలైనంత పొదుపు చేయాలి. ద్ర‌వ్యోల్భ‌ణాన్ని మించి రాబ‌డి వ‌చ్చే పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను ఎంచుకోవాలి’ అని సూచించారు. మంచి కంపెనీల షేర్ల‌ను స‌రైన ధ‌ర‌కు కొని దీర్ఘ‌కాలం వేచి ఉంటే ఆశించిన లాభాలు అందుతాయ‌ని చెప్పారు. పెట్టుబ‌డులు త‌మ‌ త‌ర్వాత ఎవ‌రికి చెందాల‌నే విష‌య‌మై వీలునామా సిద్ధం చేయాల‌ని తెలిపారు.

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ క్లస్ట‌ర్ హెడ్ పి.వంశీ మాట్లాడుతూ…
IMG-3.png

చిన్న మొత్తాల‌తో మ‌దుపు చేయాల‌నుకునే వారికి క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి విధానం మంచి మార్గ‌మ‌న్నారు. మ‌దుప‌రులు ఎంత మొత్త‌మైనా సిప్ చేసేందుకు అవ‌కాశం ఉంద‌ని చెప్పారు. దీర్థ‌కాలిక ఆర్థిక ల‌క్ష్యాలను ముడిపెట్టి, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఫండ్ల‌లో మ‌దుపు చేస్తే… మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు. ఒకేచోట మొత్తం పెట్టుబ‌డుల‌ను పెట్టిన‌ప్పుడు న‌ష్ట‌భ‌యం కాస్త ఎక్కువ‌గా ఉంటుంద‌ని పేర్కొన్నారు. వీలైనంత వ‌ర‌కు మ‌న పెట్టుబ‌డుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవాల‌ని, అప్పుడే ఆటుపోట్లున్నా, పెట్టుబ‌డుల‌కు మాత్రం ఇబ్బంది రాద‌న్నారు. వ్య‌క్తులు ఆర్థిక అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ప‌లు ర‌కాలు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు. స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాల కోసం లిక్విడ్‌, డెట్ ఫండ్లు, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల సాధ‌న‌కు ఈక్వీటీ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చ‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ‘ఈనాడు’ విజ‌య‌వాడ యూనిట్ ఇంఛార్జ్ జీఆర్‌సీ శేఖ‌ర్ పాల్గొన్నారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly