గుంటూరులో జ‌రిగిన సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

గుంటూరులో జ‌రిగిన సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు
 • మదుపుతోనే ఆర్థిక భ‌రోసా
 • ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక ఉండాలి
  -సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌ స‌ద‌స్సులో నిపుణులు సూచ‌న‌లు
IMG-2.png

‘స్వ‌ల్ప‌కాలంలో మార్కెట్ సూచీల హెచ్చుత‌గ్గులు స‌హ‌జ‌మే. ఈ విష‌యంపై ఆందోళ‌న అవ‌స‌రం లేదు. చిన్న చిన్న స‌మ‌స్య‌లు వ‌చ్చినా…చివ‌ర‌కు ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌నితీరు ఆధారంగానే దీర్ఘ‌కాలంలో మార్కెట్ గ‌మ‌నం ఆధార‌ప‌డుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు పెట్టుబ‌డులను స‌మీక్షించుకుంటూ…త‌గిన నిర్ణ‌యాలు తీసుకోవాలి. సంపాదించే ప్ర‌తి వ్యక్తి జీవిత‌, ఆరోగ్య బీమా పాల‌సీల‌ను తీసుకోవాలి’ అని నిపుణులు సూచించారు. శ‌నివారం గుంటూరులో ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ’ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు మంచి స్పంద‌న ల‌భించింది. నిపుణులు స్టాక్ మార్కెట్, ఆర్థిక ప్ర‌ణాళిక‌లు త‌దిత‌ర అంశాల‌ను వివ‌రించారు. మ‌దుప‌రుల సందేహాల‌ను నివృత్తి చేశారు. స‌ద‌స్సులో ‘ఈనాడు’ గుంటూరు ఇన్‌ఛార్జి పి.రామాంజ‌నేయులు పాల్గొన్నారు.

పెట్టుబ‌డికి మంచి స‌మ‌యం
-జె.వేణుగోపాల్, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, జెన్ మ‌నీ

IMG-3 (1).png

నిరాశావాదం అధికంగా ఉన్న‌ప్పుడే మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు స‌రైన స‌మ‌యం. అంద‌రూ ఆశ‌తో ఉన్న‌ప్పుడు మ‌నం లాభాల‌ను స్వీక‌రించాలి. ఒకే రంగం, కంపెనీల కాకుండా వైవిధ్యంగా ఉండేలా మ‌దుపు చేయాలి. పేరున్న 10-12 కంపెనీల్లో మ‌దుపు చేయ‌డం శ్రేయ‌స్క‌రం.

 • ఏ సంస్థ షేర్లు కొన్నా…దాని వ‌స్తూత్ప‌త్తులు, అమ్మ‌కాలు, లాభాలు ఎలా ఉన్నాయో గ‌మ‌నించాలి. అధిక రుణ‌భారం ఉన్న కంపెనీల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి
 • మార్కెట్లో విలువ ఆధారిత పెట్టుబ‌డి, వృద్ధి ఆధారిత పెట్టుబ‌డి విధానాలుంటాయి. విలువ‌, వృద్ధి రెండింటి మేళ‌వింపుగా పెట్టుబ‌డులు ఉంటే ఆశాజ‌న‌క‌మైన పెట్టుబ‌డులు పొంద‌వ‌చ్చు.
 • క‌రోనా ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ…అంత‌ర్జాతీయంగా త‌గ్గ‌నున్న ముడిచ‌మురు ధ‌ర‌లు, చైనా అనిశ్చితి నుంచి వ‌చ్చే అవ‌కాశాలు, మ‌రికొన్ని దేశీయ అంశాలు స్టాక్ మార్కెట్‌కు కొంత అండ‌గా నిలుస్తాయి.
 • కొత్త‌గా మార్కెట్లోకి వ‌చ్చేవారు…మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోని ఇండెక్స్ ఫండ్లు లేదా డైవ‌ర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ల‌లో క్ర‌మానుగ‌త పెట్టుబ‌డి విధానం (సిప్) ద్వారా మ‌దుపు చేయాలి.
 • నేరుగా షేర్ల‌లో మ‌దుపు చేసేవారు…మ‌ర్కెట్ త‌గ్గిన‌ప్పుడ‌ల్లా పెట్టుబ‌డులు పెడుతూ…క‌నీసం 3-5 ఏళ్ల‌పాటు ఓపిక ప‌ట్టాలి.

అందుబాటులో అత్య‌వ‌స‌ర నిధి
-బి.రాజేంద్ర‌, రీజ‌న‌ల్ మేనేజ‌ర్, ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్
IMG-4 (1).png 7f8f5fd0-0349-58bb-930c-8909068bbe13)

ఉద్యోగుల‌కు త‌ప్ప‌నిస‌రిగా ప‌ద‌వీ వ‌ర‌మ‌ణ ప్ర‌ణాళిక ఉండాలి. అప్పుడే వారు మ‌లి వ‌య‌సులోనూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండ‌గ‌ల‌రు. ఉద్యోగం ప్రారంభించిన వేంట‌నే ఈ దిశ‌గా పొదుపు, మ‌దుపులు చేయాలి. చిన్న వ‌య‌సులోనే ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవ‌డం వ‌ల్ల త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

 • చిన్న వ‌య‌సు నుంచే పెట్టుబ‌డులు ప్రారంభిస్తేనే…దీర్ఘ‌కాలంలో అవి మంచి రాబ‌డిని అందించి, పెద్ద మొత్తంలో సంప‌ద‌ను సృష్టించేందుకు వీలుంటుంది.
 • పెట్టుబ‌డుల‌కు సంబంధించి సొంత నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ఇబ్బంది ఉంటే…నిపుణుల‌ను సంప్ర‌దించాలి.
 • ప్ర‌తి ఒక్క‌రూ క‌నీసం 3-6 నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌రిప‌డా మొత్తాన్ని అత్య‌వ‌స‌ర నిధిగా అందుబాటులో ఉంచుకోవాలి.
 • ల‌క్ష్యం ఏమిటి? ఎంత వ్య‌వ‌ధి ఉంది అనే అంశాల ఆధారంగా పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ప్ర‌తి అవ‌స‌రానికీ అనువైన ప‌థ‌కాలున్నాయి. స్వ‌ల్ప‌కాలానికి లిక్విడ్ లేదా డెట్, దీర్ఘ‌కాలానికి ఈక్విటీ ఆధారిత ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌చ్చు. నెల‌కు రూ.1000తోనూ వీటిలో మ‌దుపు చేయ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly