క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన సిరి మదుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్, ఆదిత్య బిర్లా మ్యూచువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన సిరి మదుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

ఆర్థికంగా ఉన్న‌తంగా ఉండాలంటే సంపాద‌న ఒక్క‌టే స‌రిపోదు. అందులో నుంచి పెట్టుబ‌డిగా ఎంత మొత్తం పెడుతున్నామ‌న్న‌దే ముఖ్యం. సంపాద‌న ప్రారంభం కాగానే పెట్టుబ‌డులూ మొద‌లుపెట్టాలి. వాయిదా వేస్తే…దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతాం. అవ‌గాహ‌న‌తో మ‌న‌కు అనువైన ప‌థ‌కాల‌ను ఎంచుకోవాలి. ఇత‌రుల‌ను అనుక‌రిస్తే న‌ష్ట‌పోతాం అని ఆర్థిక నిపుణులు సూచించారు. ఆదివారం క‌రీంన‌గ‌ర్‌లో ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్, ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ’ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు మంచి స్పంద‌న ల‌భించింది. జీవిత బీమా, ఆర్థిక ప్ర‌ణాళిక‌, స్టాక్ మార్కెట్ తదిత‌ర అంశాల‌పై నిపుణులు ప‌లు సూచ‌న‌లు చేశారు. తొలుత ఈనాడు క‌రీంన‌గ‌ర్ యూనిట్ ఇన్‌ఛార్జి టి.వెంక‌టేశ్వ‌ర్లు సిరి ఇన్వెస్ట‌ర్స్ క‌ల్బ్ గురించి మ‌దుప‌రుల‌కు వివ‌రించారు.
IMG-1.jpg

ఖ‌ర్చుల‌ను త‌ట్టుకునేలా రాబ‌డి
-జీవీవీ గంగాధ‌ర్‌, ఛాన‌ల్ మేనేజ‌ర్, ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్

IMG-4.png

రోజురోజుకూ ఖ‌ర్చులు పెరుగుతున్నాయి. భ‌విష్య‌త్తులో ఇంకా అధికం అవుతాయి. పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌ట్టుకునే
వ్యూహం త‌ప్ప‌నిస‌రి. సంపాద‌న మొద‌లైన వెంట‌నే పొదుపు, పెట్టుబ‌డులూ ప్రారంభించాలి. దీర్ఘ‌కాలిక దృష్టితో వాటిని కొన‌సాగించాలి. అప్పుడే సంప‌ద‌ను సృష్టించ‌డం సాధ్యం అవుతుంది. న‌ష్ట‌భ‌యం ఎక్క‌డైనా ఉంటుంది. స్వ‌ల్ప‌కాలంతో ఇది మ‌రీ అధికం. పెట్టుబ‌డి పెట్టేముందు ఆయా ప‌థ‌కాల‌పై సంపూర్ణ అవ‌గాహ‌న పెంచుకోవాలి. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో రూ.1000 తోపూ మ‌దుపు ప్రారంభించ‌వ‌చ్చు. వీటిల్లో క‌నీసం ఐదారేళ్ల‌కు మించి కొన‌సాగాలి. తాత్కాలిక ప్ర‌యోజ‌నాలు ఆశించ‌కూడ‌దు. వ్య‌క్తుల‌ను బ‌ట్టి ఆర్థిక అవ‌స‌రాలు మారుతుంటాయి. ఒక‌రికి న‌ప్పిన ప్ర‌ణాళిక వేరొక‌రికి స‌రిపోదు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ప్ర‌తి ల‌క్ష్యానికీ ఉప‌యోగ‌ప‌డే ప‌థ‌కాలు ఉన్నాయి. మీ ల‌క్ష్యం, కాల వ్య‌వ‌ధి, న‌ష్ట‌భ‌యం భ‌రించే సామ‌ర్థ్యం ఆధారంగా వీటిని ఎంపిక చేసుకోవాలి. అవ‌స‌ర‌మైతే ఆర్థిక నిపుణుల స‌ల‌హాలు తీసుకోవాలి.

వైవిధ్యానికి ప్రాధాన్యం
-జె.వేణుగోపాల్, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్, జెన్ మ‌నీ
IMG-3.png

కొంద‌రు బంగారంపై పెట్టుబ‌డి పెడ‌తారు. మ‌రికొంద‌రు స్థిరాస్తిపై దృష్టి సారిస్తారు. షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎంపిక చేసుకునే వారూ ఉంటారు. ఈ పెట్టుబ‌డుల‌న్నీ మంచివే. కానీ, ఒక్క‌చోటే మొత్తం డ‌బ్బును పెడితే ఇబ్బందులు రావ‌చ్చు. షేర్లు కొనుగోలు చేసినా…4-5 రంగాల్లోని 10-12 షేర్ల‌ను ఎంపిక చేసుకోవాలి. మార్కెట్లో హెచ్చుత‌గ్గులు స‌ర్వ‌సాధార‌ణం. వాటిని చూసి ఆందోళ‌న చెంద‌కూడ‌దు. అనేక కార‌ణాల వ‌ల్ల మార్కెట్లు ప‌త‌నం అవుతుంటాయి. త‌గ్గిన ప్ర‌తిసారీ కొత్త పెట్టుబ‌డులకు మంచి అవ‌కాశ‌మ‌ని భావించాలి. భావోద్వేగాల‌తో క్ర‌య‌, విక్ర‌యాలు మంచిది కాదు. ఉద‌యం పెట్టుబ‌డి పెట్టి, సాయంత్రానికి రెట్టింపు కావాల‌నుకుంటే…న‌ష్టాలు వ‌చ్చే ఆస్కార‌మే ఎక్కువ‌. నిర్మాణాత్మ‌క పెట్టుబ‌డితోనే, దీర్ఘ‌కాలంలో సంప‌ద వృద్ధి చెందుతుంది. ఇంట్లో సంపాదించే వ్య‌క్తికి ట‌ర్మ్ పాల‌సీ , వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా పాల‌సీలు ఉండాలి. కుటుంబ‌మంత‌టికి వ‌ర్తించేలా ఆరోగ్య బీమా తీసుకోవ‌డం మ‌ర్చిపోవ‌ద్దు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly