క్రెడిట్ స్కోర్ ను తరచుగా తనిఖీ చేసుకుంటున్నారా?

భారతదేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్లు, నివేదికలను అందిస్తాయి. అవి ఈక్విఫాక్స్, సిబిల్, ఎక్స్పెరియన్, క్రిఫ్ హైమార్క్

క్రెడిట్ స్కోర్ ను తరచుగా తనిఖీ చేసుకుంటున్నారా?

ప్ర‌తీ ఒక్క‌రూ మంచి క్రెడిట్ స్కోరు క‌లిగి ఉండ‌టం చాలా అవ‌స‌రం. ముఖ్యంగా రుణం తీసుకునే స‌మ‌యంలో ఇది చాలా కీల‌కం.క్రెడిట్ స్కోర్ అనేది సంఖ్యా పరంగా ఉంటూ,ఆ వ్య‌క్తి రుణ చెల్లింపు సామ‌ర్థ్యం, విశ్వసనీయతను కొలిచే ఒక సూచికగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 ల మధ్య ఉంటుంది. అధిక క్రెడిట్ స్కోరు క‌లిగిన వ్య‌క్తికి రుణాలు త‌క్కువ వ‌డ్డీకే వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. మ‌న‌దేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ నివేదికలను అందిస్తున్నాయి. అవి ఈక్విఫాక్స్, సిబిల్, ఎక్స్పెరియన్, క్రిఫ్ హైమార్క్. క్రెడిట్ స్కోర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవ‌డం మంచిది. రుణ అంచనాకు సంబంధించి ఐదు ప్రయోజనాలను మీ కోసం కింద తెలియ చేశాము.

  1. మీ క్రెడిట్ స్టాండింగ్ గురించి తెలుసుకోండి

రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్పుడు బ్యాంకులు లేదా రుణ‌సంస్థ‌లు మీ క్రెడిట్ స్కోర్‌ను ప‌రిశీలిస్తాయి. ఫిన్‌టెక్ కంపెనీల సేవ‌లు అందుబాటులోకి రావ‌డంతో మీ క్రెడిట్ స్కోర్ వివ‌రాలు సుల‌భంగా ల‌భిస్తున్నాయి. ఈ కంపెనీలు మీ క్రెడిట్ స్కోర్ ను తరచుగా తనిఖీ చేసుకోవడానికి అనుమతిస్తాయి. ఒక వేళ తక్కువ క్రెడిట్ స్కోర్ కలిగి ఉంటే త‌గిన చర్యలను తీసుకోవడం సులభం. దీనికి అనేక ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. క్రెడిట్ హెల్త్ రిపోర్ట్ మీ స్కోర్ ను మెరుగుపరుచుకోడానికి సమర్ధవంతమైన సిఫార్సులను అందిస్తుంది.

  1. క్రెడిట్ స్కోరు లో లోపాలను గుర్తించి, సరిదిద్దుకోండి

మీరు తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపుల సమాచారాన్ని మీ రుణదాతలు క్రెడిట్ బ్యూరోలకు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటారు. ఇందులో రుణ మొత్తాన్ని ముందుగా చెల్లించడం, ఆల‌స్యంగా చెల్లించడం త‌దిత‌ర నివేదికలు ఉంటాయి. ఒకవేళ మీ స‌మాచారాన్ని రుణదాతలు క్రెడిట్ బ్యూరోలకు తప్పుగా పంపినట్లైతే, ఆ తప్పులను నివేదించి, వాటిని మార్చుకునే బాధ్యత మీపైనే ఉంటుంది. మీ క్రెడిట్ స్కోరును అప్పుడ‌ప్పుడూ తనిఖీ చేస్తున్నపుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.

  1. ఎక్కువ సార్లు ద‌ర‌ఖాస్తు చేస్తే

మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ, రుణదాత మీ క్రెడిట్ స్కోరును పరిశీలించడానికి క్రెడిట్ బ్యూరోని సంప్రదిస్తారు. రుణదాతలు చేసిన ఈ విచారణలను హార్డ్ ఎంక్వెయిరీగా పిలుస్తారు. ప్రతి హార్డ్ విచారణను లెక్కలోకి తీసుకుంటారు.అది మీ క్రెడిట్ స్కోరు పై ప్రభావం చూపుతుంది. తరచుగా రుణం లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్నట్లైతే, అది మీ రుణ అవసరాన్ని తెలియ చేస్తుంది. దీని వలన మీ క్రెడిట్ స్కోర్ దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది.

  1. తక్కువ వడ్డీ రేట్లతో రుణాన్ని పొందండి

ప్రతి రుణగ్రహీత అతి తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందాలని భావిస్తుంటారు. మంచి క్రెడిట్ స్కోర్ ను కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ఇప్పటికే కొన్ని బ్యాంకులు 760 పాయింట్ల పైన క్రెడిట్ స్కోరు ఉన్న రుణ గ్రహీతలకు గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు అందించే విధానాన్ని ప్రారంభించాయి. మంచి క్రెడిట్ స్కోరు క‌లిగిన వారికి రుణమిచ్చే సంస్థ‌తో త‌క్కువ వడ్డీ రేటుకే రుణం ఇవ్వ‌మ‌ని అడిగేందుకు అవ‌కాశం ఉంటుంది.

  1. ఆఫ‌ర్ల‌ను పొందండి

ఫిన్‌టెక్ కంపెనీలు ఉచితంగా క్రెడిట్ స్కోర్‌ను అందించ‌డ‌మే కాకుండా, రుణ దాత‌ల‌తో ఒప్పందం కుదుర్చుకొని క్రెడిట్ స్కోర్, క్రెడిట్ ఉత్ప‌త్తుల‌ను బ‌ట్టి త‌గిన ఆఫ‌ర్స్ కూడా అందిస్తాయి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇత‌ర ఆఫ‌ర్ల‌తో పోల్చుకొని ఏది మేలైన‌దో దానిని ఎంచుకోవ‌డం మంచిది. రాకుండా చూసుకోవ‌డం అనేది నివారణ కంటే ఉత్తమం అనే సామెత మన అందరికి తెలిసిందే. అదే క్రెడిట్ హెల్త్ కి కూడా వర్తిస్తుంది. సమయానికల్లా క్రెడిట్ కార్డు చెల్లింపులను చేసి క్రెడిట్ స్కోర్ తనిఖీ చేసుకుంటూ ఉండండి. తద్వారా మీరు మంచి క్రెడిట్ స్కోరు క‌లిగి ఉంటారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly