గృహ బీమా పాల‌సీల‌ను ఎలా ఎంచుకోవాలి?

గృహ‌బీమాను కూడా కొనుగోలు చేసేందుకు ఇత‌ర బీమా పాల‌సీల మాదిరిగానే ప్ర‌పోజ‌ల్ ఫార‌మ్ నింపాల్సి ఉంటుంది

గృహ బీమా పాల‌సీల‌ను ఎలా ఎంచుకోవాలి?

బీమా కొనుగోలు చేసే వారు జీవిత‌, ఆరోగ్య‌, వాహ‌న బీమాల‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తుంటారు. అయితే వీటితో పాటు ఇంటికి కూడా బీమా క‌లిగి ఉండ‌డం అవ‌స‌రం. భార‌త‌దేశంలో 1 శాతం కంటే త‌క్కువ గృహాల‌కు మాత్ర‌మే బీమా సౌక‌ర్యం ఉంద‌ని సెక్యూర్‌నౌ.ఇన్ వ్య‌వ‌స్థాప‌కుడు క‌పిల్ మెహ‌తా తెలిపారు. మొబిక్విక్ ఇటీవ‌లే ఐసీఐసీఐ లాంబార్డ్ జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ కంపెనీతో క‌లిసి గృహ బీమాను ఆఫ‌ర్ చేస్తుంది. ఏదైనా ప్ర‌కృతి వైప‌రీత్యాలు ఏర్ప‌డిన‌ప్పుడు ఇది క‌వ‌ర్ చేస్తుంది. ప్రీమియం నెల‌కు రూ.25. హామీ మొత్తం రూ.2ల‌క్ష‌లు. ఇది మీ ఇంటినే కాకుండా, టీవీ, ఫ్రిడ్జ్‌, ఫ‌ర్నేచ‌ర్ వంటి వ‌స్తువుల‌ను సార్ట్ స‌ర్క్యూట్, గ్యాస్ లీకేజ్ వంటి కార‌ణాల వ‌ల్ల అగ్ని ప్ర‌మాదం సంభ‌వించిన‌ప్పుడు క‌వ‌ర్ చేస్తుంది

గృహ బీమా పాల‌సీ:
జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ కంపెనీలు గృహ బీమాను అందిస్తాయి. మార్కెట్లో 30 నుంచి 35 ర‌కాల ప్రాడ‌క్ట్‌లు అందుబాటులో ఉన్నాయ‌ని రాయ‌ల్ సుంద‌రం జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ కంపెనీ చీఫ్ ప్రాడెక్ట్ ఆఫీస‌ర్ నికిల్ ఆప్టే తెలిపారు. సాధార‌ణంగా గృహ బీమా పాల‌సీలు, బిల్డింగ్‌, అందులో ఉన్న సంబంధిత వ‌స్తువులను క‌వ‌ర్ చేస్తాయి. అయితే ఇది ప్ర‌తీ బీమా సంస్థ‌కు వేరు వేరుగా ఉంటుంది. చాలా వ‌ర‌కు ప్లాన్లు అగ్నిప్ర‌మాదం, తుఫాను, దొంగ‌త‌నం వంటివి జ‌రిగిన‌ప్పుడు క‌లిగిన న‌ష్టానికి కూడా హామినిస్తాయి. రూ.1 కోటి హామీ మొత్తం కోసం రూ. 5 వేల నుంచి రూ.10 వేల లోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

కేవ‌లం అగ్ని ప్ర‌మాదాల నుంచి మాత్ర‌మే ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందా?
గృహ బీమా ప‌థ‌కాలు అగ్ని ప్ర‌మాదాల‌ను మాత్ర‌మే కాకుండా దోపిడీలు, దొంగ‌త‌నాలు, స్నాచింగ్ (ఆభరణాల), ప్ర‌మాద‌వ‌శాత్తు జరిగే న‌ష్టం(స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, డిజిటల్ / వీడియో కెమెరాలు), వ్య‌క్తిగ‌త ప్ర‌మాదాలు(ఉద్యోగుల‌కు) వంటివి క‌వ‌ర్ అవుతాయి. ఇత‌ర బీమా పాల‌సీల మాదిరిగానే గృహ‌బీమాను కూడా కొనుగోలు చేసేందుకు ప్ర‌పోజ‌ల్ ఫార‌మ్ నింపాలి. ఇల్లు, ఇంటిలో ఉన్న వ‌స్తువుల వివ‌రాలు తెలియ‌జేయాలి. ఇంటి నిర్మానం విలువ‌, బిల్డింగ్ ఉన్న ప్ర‌దేశం ఆధారంగా హామీ మొత్తం నిర్ణ‌యిస్తారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly