బీమా పాలసీపై రుణం ఎలా తీసుకోవాలి?

బీమా పాలసీలపై రుణాలు సాధారణంగా సరెండర్ విలువను కలిగి ఉన్న సాంప్రదాయ లేదా ఎండోమెంట్ జీవిత బీమా పాలసీలపై మాత్రమే అందిస్తారు

బీమా పాలసీపై రుణం ఎలా తీసుకోవాలి?

బీమా పాలసీలపై రుణం తీసుకోవడం అత్యవసర పరిస్థితులలో మీకు సహాయపడుతుంది. రుణాలు అనేవి దీర్ఘకాలిక బీమా పెట్టుబడులకు కొంత ద్రవ్యతను జోడిస్తాయి. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ కాస్పరస్ క్రోమ్‌హౌట్ మాట్లాడుతూ, వ్యక్తిగత రుణాలతో పోల్చినప్పుడు, ప్రజలు బీమా పాలసీలపై రుణాలను తీసుకోవడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్లు వ్యక్తిగత రుణాల కంటే తక్కువగా ఉంటాయి.

బీమా పాలసీలపై రుణాలు త్వరగా లభిస్తాయి, ఎందుకంటే సాధారణంగా ప్రజలు ఈ రకమైన రుణాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు. పాలసీ కోసం ఇప్పటికే సంపాదించిన సరెండర్ విలువలో కొంత మొత్తాన్ని రుణంగా అందిస్తారు. అందువలన రుణ ప్రాసెసింగ్ చాలా సులభంగా, వేగంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో, పాలసీదారుడు పాలసీకి రెగ్యులర్ ప్రీమియంతో పాటు రుణంపై వడ్డీని మాత్రమే చెల్లించాలి.

బీమా పాలసీలపై రుణాలు సాధారణంగా సరెండర్ విలువను కలిగి ఉన్న సాంప్రదాయ లేదా ఎండోమెంట్ జీవిత బీమా పాలసీలపై మాత్రమే అందిస్తారు. పాలసీలపై రుణం పొందడానికి 3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని గమనించండి. ఏదేమైనా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలపై రుణాలను మంజూరు చేయరు. అలాగే, యూలిప్ ప్లాన్‌లపై రుణాలు అందించగలిగినప్పటికీ, చాలా కొద్ది కంపెనీలు మాత్రమే ఆ ఆప్షన్ ను అందిస్తాయి.

బీమా పాలసీలపై మీరు ఎప్పుడు రుణం తీసుకోవాలి?

జీవిత బీమా పాలసీని కలిగి ఉండటం అనేది మన ప్రియమైన వ్యక్తికి ఆర్థిక భద్రతను కల్పించడం. బీమా పాలసీలపై రుణాలను అత్యవసర పరిస్థితులలో, అలాగే తక్కువ కాల వ్యవధికి మాత్రమే తీసుకోవాలని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. మొదటగా, మీ పాలసీపై రుణం తీసుకునే అవకాశం ఉందా? అలాగే పాలసీపై పొందగలిగే రుణం మొత్తం ఎంత? అనే విషయాలను బీమా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించి తెలుసుకోవాలి. చాలా కాలంగా నిర్వహిస్తున్న పాలసీలు మంచి రుణ విలువలను కలిగి ఉంటాయి.

ఎవరు బీమా పాలసీలపై రుణం తీసుకోకూడదు?

ఒకవేళ మీరు ఇటీవలే పాలసీని తీసుకుని ఉండి, దానికి అందుబాటులో ఉన్న రుణ మొత్తం తక్కువగా ఉన్నట్లయితే, అటువంటి బీమా పాలసీలపై రుణం తీసుకోకుండా ఉండడం మంచిది. ఒకవేళ బీమా పాలసీపై రుణం తీసుకున్న పాలసీదారుడు రెగ్యులర్ ప్రీమియం‌లతో పాటు రుణ వడ్డీని చెల్లించలేకపోతే, పాలసీకి సంబంధించిన ఎటువంటి ప్రయోజనాలకు అర్హత ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly