ఇకపై ఎన్పీఎస్ చందాదారులు రెండు సార్లు సీఆర్‌ఏ లను ఎంచుకోవచ్చు...

ఆల్ సిటిజన్ మోడల్ కింద ఉన్న చందాదారులు, ఇప్పటి వరకు సీఆర్‌ఏల ఎంపిక లేదా మార్పును ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అనుమతించేవారు

ఇకపై ఎన్పీఎస్ చందాదారులు రెండు సార్లు  సీఆర్‌ఏ లను ఎంచుకోవచ్చు...

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ఆల్ సిటిజెన్ మోడల్ చందాదారులు, ఇప్పుడు ఒక ఆర్థిక సంవత్సరానికి రెండు సార్లు సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలను (సీఆర్‌ఏ) ఎంపిక చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. ఇంతకు ముందు, ఈ సౌకర్యం ఒక సంవత్సరంలో ఒక్క సారి మాత్రమే అందుబాటులో ఉండేది. 17 ఏప్రిల్, 2020 నాటి సర్క్యులర్‌లో, ఆల్ సిటిజన్ మోడల్ కింద ఉన్న చందాదారులు, ఇప్పటి వరకు సీఆర్‌ఏల ఎంపిక లేదా మార్పును ఆర్థిక సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అనుమతించేవారు. కానీ ఈ సారి ఇటువంటి ఎంపికలను ఆర్థిక సంవత్సరానికి రెండుసార్లు చేసుకోవచ్చునని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ పేర్కొంది. ఇంకా, ఎంప్లోయర్ - ఎంప్లొయీ రిలేషన్షిప్ కింద ఉన్న చందాదారులు, రెండు సీఆర్‌ఏల కంటే ఎక్కువ ఎంపిక చేసుకోవచ్చు, అయితే, వారి యజమాని సీఆర్‌ఏని మార్చడానికి ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు సార్లు సీఆర్‌ఏ ఎంపిక చేసిన చందాదారులు ప్రభుత్వం లేదా కార్పొరేట్ మోడల్ కింద తమ యజమాని ద్వారా ఎన్పీఎస్ సభ్యుడిగా మారినట్లయితే, సీఆర్‌ఏ ని రెండుసార్ల కంటే ఎక్కువ ఎంచుకోవచ్చునని సర్క్యులర్ పేర్కొంది.

అదేవిధంగా, సిటిజన్స్ మోడల్ చందాదారులు ఎవరైతే ఇప్పటికే ఆర్థిక సంవత్సరానికి రెండుసార్లు సీఆర్‌ఏ ఎంపికను వినియోగించుకున్నారో, వారు తమ యజమాని ద్వారా ఎన్పీఎస్ లో సభ్యులైతే, సీఆర్‌ఏ ఎంపికను రెండు సార్లు కూడా ఎంచుకోవచ్చునని సర్క్యులర్ లో తెలిపారు.

ఎన్‌పీఎస్ చందాదారుల లావాదేవీల స్టేట్ మెంట్ సీఆర్‌ఏ పోస్ట్ మార్పును జనరేట్ చేసింది, ఇది మునుపటి సీఆర్‌ఏ ద్వారా చేసిన లావాదేవీల వివరాలను ప్రతిబింబిస్తుందని పీఎఫ్‌ఆర్‌డీఏ సర్క్యులర్ పేర్కొంది.

ఏప్రిల్ 13న, ఆన్-బోర్డింగ్ ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్ ప్రాన్ జనరేషన్ మాడ్యూల్ (ఓపీజీఎం)లో అనేక మార్పులను పీఎఫ్‌ఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఫోటో, సంతకం అప్ డేట్ అవ్వని ఖాతాల్లో ఫోటో, సంతకాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి సీఆర్‌ఏ లు సౌకర్యాన్ని కల్పిస్తాయి. ఇంకా, సీఆర్‌ఏ లు వారి ఎన్‌పీఎస్ ఖాతాలను క్రమబద్ధీకరించడానికి, ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంటేషన్‌తో చందాదారులను ప్రాంప్ట్ చేయడానికి హెచ్చరికలను పంపిస్తాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly