నిఫ్టీ ఎంత రాబడి ఇచ్చిందో తెలుసా?

మార్కెట్ స్వల్పకాలికంలో చాలా అస్థిరత్వం కలిగి ఉంటుంది. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడిని ఇస్తుంది

నిఫ్టీ ఎంత రాబడి ఇచ్చిందో తెలుసా?

మార్కెట్ లో లిస్ట‌యిన కంపెనీల్లో 50 కంపెనీలు నిఫ్టీ 50 సూచీలో ఉంటాయి. వీటిని మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్, లిక్విడిటీ కంపెనీల ఆర్థిక ఫ‌లితాలు, ప‌నితీరు, వృద్ధి, ప‌రిమాణం త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. సూచీలో ఉండే 50 కంపెనీలు 12 ర‌కాల సెక్టార్లకు చెందిన‌వి. నిఫ్టీ 50 ని 1000 పాయింట్ల‌తో ఏప్రిల్ 1996 లో ప్రారంభించారు. కింది ప‌ట్టిక‌లు 2005 నుంచి నిఫ్టీ ఏవిధంగా వృద్ధి చెందింద‌నేది తెలియ‌చేస్తాయి. ఒక సంవ‌త్స‌రం కాలంలో చూస్తే రాబ‌డి అత్య‌ధికంగానీ అత్య‌ల్పంగానీ న‌మోద‌యింది. స్థిర‌త్వం లేదు.అదే మూడేళ్లు,ఐదేళ్లు, ప‌దేళ్లు కాల‌ప‌రిమితికి కొంత స్థిర‌త్వం క‌నిపిస్తుంది. ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది ఏంటంటే ఒక సంత్స‌రానికి సంపూర్ణ రాబ‌డి 3,5,10 ఏళ్ల కాలానికి సీఏజీఆర్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

Nifty50.jpg

మార్కెట్ స్వల్పకాలికంలో చాలా అస్థిరత్వం కలిగి ఉంటుంది. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడిని ఇస్తుంది. కింది పట్టికలను గ‌మ‌నిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది.

1, 3 , 5 10 ఏళ్ల‌ రాబడి వివ‌రాలు

Nifty 1 yr.jpg

ఉదా: నిఫ్టీ 50 ను బెంచ్ మార్కుగా ప‌రిగ‌ణించే ఎస్‌బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్. A అనే వ్య‌క్తి రూ. 10,000 పెట్టుబ‌డి చేస్తే రాబడి కింది విధంగా ఉంటుంది.

సంవ‌త్స‌రం రాబ‌డి:

A అనే వ్య‌క్తి జనవరి, 2007 లో రూ. 10,000 మ‌దుపు చేశారనుకుందాం. ఒక సంవత్సరం తరువాత జనవరి, 2008 నాటికి అతని పెట్టుబడి 25.83% పెరిగి రూ. 12,583 కు చేరింది. ఆ వ్య‌క్తి జూన్ 2007 లో రూ. 10,000 మ‌దుపు చేస్తే సంవత్సరం తరువాత, అతని పెట్టుబడి - 6.43% రాబ‌డి ఇచ్చి రూ. 9,357 త‌గ్గింది. డిసెంబరు, 2007 లోరూ.10,000 పెడితే పెట్టుబడులు -51.79% రాబ‌డితో రూ. 4,821 కు త‌గ్గింది.

మూడేళ్ల‌ రాబ‌డి:

Nifty 3yr.jpg

A అనే వ్య‌క్తి జనవరి, 2005 లో రూ. 10,000 మ‌దుపు చేశారనుకుందాం. మూడేళ్ల‌ తరువాత జనవరి, 2008 నాటికి అతని పెట్టుబడి 35.66% పెరిగి రూ. 51,370 కు చేరింది. ఆ వ్య‌క్తి న‌వంబ‌రు 2005 లో రూ. 10,000 మ‌దుపు చేస్తే మూడేళ్ల‌ తరువాత, అతని పెట్టుబడి 1.28% రాబ‌డి ఇచ్చి రూ. 10,389 కి పెరిగింది. మార్చి2006 లోరూ.10,000 పెడితే మూడేళ్ల‌ తరువాత -3.49% రాబ‌డితో రూ.9,022 కు త‌గ్గింది.

ఐదేళ్ల‌ రాబ‌డి:
Nifty 5 yr.jpg

A అనే వ్య‌క్తి జనవరి, 2003 లో రూ. 10,000 మ‌దుపు చేశారనుకుందాం. ఐదేళ్ల‌ తరువాత జనవరి, 2008 నాటికి అతని పెట్టుబడి 37.59% పెరిగి రూ. 49,310 కు పెరిగింది. ఆ వ్య‌క్తి న‌వంబ‌రు 2007 లో రూ. 10,000 మ‌దుపు చేస్తే ఐదేళ్ల‌ తరువాత, అతని పెట్టుబడి 0.40% రాబ‌డి ఇచ్చి రూ. 10,203 కు పెరిగింది. డిసెంబరు, 2007 లోరూ.10,000 పెడితే పెట్టుబడులు -0.77% రాబ‌డితో రూ.9620 కు త‌గ్గింది.

ప‌దేళ్ల రాబ‌డి:

Nifty 10 yr.jpg

A అనే వ్య‌క్తి జనవరి, 2008 లో రూ. 10,000 మ‌దుపు చేశారనుకుందాం. ప‌దేళ్ల తరువాత జనవరి, 2018 నాటికి అతని పెట్టుబడి 7.94% పెరిగి రూ. 21,467 కు పెరిగింది. ఆ వ్య‌క్తి డిసెంబ‌రు 2008లో రూ. 10,000 మ‌దుపు చేస్తే సంవత్సరం తరువాత, అతని పెట్టుబడి 13.89% రాబ‌డి ఇచ్చి రూ. 36,716 కు పెరిగింది.

పై ప‌ట్టిక‌ల‌ను గ‌మ‌నిస్తే మార్కెట్లు స్వ‌ల్ప‌కాలంలో రుణాత్మ‌క రాబ‌డిని ఇచ్చినా, దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని అందించాయి. మార్కెట్లు ఒడిదొడుకుల‌కు లోనైన‌పుడు క్ర‌మంగా పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్లకు త‌క్కువ ధ‌ర‌కు మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ల‌ను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది. సిప్ విధానంలో పెట్టుబ‌డి చేయ‌మ‌ని చెప్ప‌డానికి కార‌ణం ఇదే.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly