కాంపౌండింగ్ ఎఫెక్ట్ మామూలుగా ఉండ‌దు

ముందుగా పెట్టుబ‌డి చేసిన వారికి ప్ర‌యోజ‌నాలు ఉన్న‌పుడు చేయ‌డానికి ఆలోచించ‌డం దేనికి?

కాంపౌండింగ్ ఎఫెక్ట్ మామూలుగా ఉండ‌దు

ఎంత ముందుగా పెట్టుబ‌డి చేయ‌డం ప్రారంభిస్తే అంత ఎక్కువ ఫ‌లితం పొంద‌వ‌చ్చ‌ని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. దీనికి కార‌ణం ఏంటో తెలుసా? కాంపౌండింగ్ ఎఫెక్ట్ దీని గురించి అల్‌బ‌ర్ట్ ఐన్‌స్టీన్ ఏమ‌న్నాడంటే కాంపౌండింగ్ అనేది ఎనిమిదో వింత దీన్ని అర్థం చేసుకున్న వారు సంపాదిస్తారు. అర్థం చేసుకోని వారు చెల్లిస్తారు. ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో మ్యూచువ‌ల్ ఫండ్లు, పీపీఎఫ్, ఎన్‌పీఎస్ లో క్ర‌మంగా మ‌దుపుచేసే వారు కాంపౌండింగ్ ద్వారా ఫ‌లితం పొంద‌వ‌చ్చు. మ‌దుప‌రికి దీర్ఘ‌కాలంలో ఎక్కువ సొమ్ము స‌మ‌కూర్చుకునేందుకు వీలుంటుంది. కొంత‌ మంది మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి ప్రారంభించ‌డాన్ని వాయిదా వేసుకుంటూ వ‌స్తుంటారు. దీని ద్వారా వారు కాంపౌండింగ్ ద్వారా వ‌చ్చే ఫ‌లితాన్ని పొంద‌లేరు. చిన్న వ‌య‌సు మ‌దుప‌ర్లు కొంత న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉన్న‌ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపు చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. ముంద‌స్తుగా పెట్టుబ‌డులు చేయ‌డం ద్వారా మ‌న డ‌బ్బుపై రాబ‌డి లేదా వ‌డ్డీ కి వ‌డ్డీ ల‌భిస్తుంది. దీని ద్వారా దీర్ఘ‌కాలంలో మ‌దుప‌ర్లు ఎక్కువ మొత్తంలో నిధి స‌మ‌కూర్చుకోగ‌ల‌రు. పెట్టుబ‌డుకు సంబంధించి ఏయే వ‌ర్గాల్లో ఎంతెంత పెట్ట‌బ‌డి చేయాల‌నే దానికి ఒక థంబ్ రూల్ ఏంటంటే 100 నుంచి మ‌దుప‌రి వ‌య‌సు ను తీసివేస్తే వ‌చ్చే దాని శాతం ఈక్విటీలో నూ, మిగిలిన‌ది స్థిరాదాయ పెట్టుబ‌డుల్లో చేయ‌వ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు మీ వ‌య‌సు 25 సంవ‌త్స‌రాలు అనుకుంటే 100-25 =75 శాతం ఈక్విటీ లో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు. ఈక్విటీ పెట్టుబ‌డులు న‌ష్ట‌భ‌యం,రాబ‌డి ఎక్కువ‌గా ఉండేవి. అదే మ‌దుప‌రి 35 సంవ‌త్స‌రాల‌కు పెట్టుబ‌డి ప్రారంభిస్తే మొత్తం 100-35=65 శాతం పెట్టుబ‌డి ఈక్విటీలో చేయాలి. మిగిలిన 35 శాతం స్థిరాదాయ ప‌థ‌కాల్లో చేయ‌డం ఒక థంబ్ నియమంగా ఉంది.

లాభామెలా ఉంటుందంటే…

సంపాదించ‌డం ప్రారంభించిన తొలినాళ్ల‌లోనే పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా దీర్ఘ‌కాలంలో మంచి మొత్తం మ‌దుప‌ర్లు పొంద‌వ‌చ్చు. సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ సిప్ విధానంలో పెట్టుబ‌డులు చేయ‌డం, పీపీఎఫ్ ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ ఎన్‌పీఎస్ ద్వారా మ‌దుపు చేయ‌డం ద్వారా మ‌దుప‌ర్లు దీర్ఘ‌కాలంలో మంచి మొత్తంలో రాబ‌డి పొంద‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక మ‌దుప‌రి నెల‌కు రూ.1,000,రాబ‌డి శాతం 8 చొప్పున సిప్ చేస్తే ప‌దేళ్లలో రూ.1,64,000 అవుతుంది.
అదే మ‌దుప‌రి 20 ఏళ్ల‌పాటు పెట్టుబ‌డి కొన‌సాగిస్తే ఆ మొత్తం రూ.4,47,000 అవుతుంది. కాంపౌండింగ్ వ‌ల్ల ఈ లాభం మ‌దుప‌రుల‌కు చేకూరుతుంది. 25 ఏళ్ల వ‌య‌సు ఉన్న వారు 20 సంవ‌త్సరాలు పెట్టుబ‌డి చేస్తే 45 ఏళ్లు వ‌చ్చేస‌రికి మొత్తం రూ.1,64,000 అందుతుంది. 35 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌వారు 10 సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డి చేస్తే 45 ఏళ్లు వ‌చ్చేస‌రికి రూ.4,47,000 మొత్తం అందుతుంది.

బీమా ప్రీమియం:

బీమా పాల‌సీ ప్రీమియం కూడా వ‌య‌సు బ‌ట్టి పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్య బీమా పాల‌సీ కూడా ప్రీమియం చిన్న వ‌య‌సు వారికి త‌క్కువ‌గా ఉంటుంది.వృధ్దులకు ఆరోగ్య పాల‌సీలు ప్రీమియం ఎక్కువ‌గా ఉంటాయి. బీమా కంపెనీలు క్లెయిమ్ కు అవ‌కాశం ఎక్కువ ఉంటుంద‌ని భావించి ప్రీమియం ఎక్క‌వ వేస్తారు. 35 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న వ్య‌క్తికి ఆరోగ్య బీమా పాల‌సీ హామీ మొత్తం రూ.3 ల‌క్ష‌ల‌కు ప్రీమియం సుమారు రూ. 8000 ఉంటుంది. అదే 25 ఏళ్ల వ‌య‌సులో ఉన్న యువ‌కుడి ప్రీమియం అంతే హామీ మొత్తానికి రూ.4000 కు ల‌భిస్తుంది.

జీవిత బీమా పాల‌సీ హామీ మొత్తం రూ.1 కోటికి ప్రీమియం సుమారు రూ.8,400 వ‌ర‌కూ ఉంటుంది. 30 ఏళ్ల వ‌య‌సు ఉండే వారికి 35 ఏళ్ల వ‌య‌సు ఉంటే అంతే హామీ మొత్తానికి పాల‌సీ ప్రీమియం సుమారు రూ.10,500 ఉంటుంది., వ‌య‌సు 45 కు చేరితే ప్రీమియం మొత్తం రూ.17,5000 ఉంటుంది. ట‌ర్మ్ బీమా ప్ర‌తీ ఒక్క‌రూ బీమా హామీ మొత్తంత‌మ వార్షిక‌ ఆదాయానికి 10 రెట్లు ఉండేలా చూసుకోవాలి.

ఎన్‌పీఎస్:

నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్ (ఎన్‌పీఎస్) లో మ‌దుప‌ర్ల‌కు ఈక్విటీ భాగం 75 శాతం వ‌ర‌కూ ఎంచుకునే అవ‌కాశం ఉంది. అగ్రెస్సివ్ లైఫ్ సైకిల్ ఫండ్ లో పీఎఫ్ఆర్‌డీఏ మ‌రో రెండు ఫండ్ల‌ను ప్రారంభించింది. మోడ‌రేట్ లైఫ్ సైకిల్ ఫండ్ దీంట్లో ఈక్విటీ గ‌రిష్ట ప‌రిమితి 50 శాతం వ‌ర‌కూ ఉంటుంది. క‌న్స‌ర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్ లో ఈక్విటీ గ‌రిష్ట ప‌రిమితి 25 శాతం ఉంటుంది. యుక్త వ‌య‌సులో ఉండేమ‌దుప‌ర్లు మొద‌టి అగ్రెస్సివ్ లైఫ్ సైకిల్ ఫండ్ ను ఎంచుకోవ‌చ్చు.

అగ్రెస్సివ్ లైఫ్ సైకిల్ ఫండ్:

వ‌య‌సు 35 ఏళ్ల వ‌ర‌కూ ఈక్విటీ 75శాతం, 41 ఏళ్ల వ‌ర‌కూ 41 శాతం, 48 ఏళ్ల‌కు 26 శాతం, 55ఏళ్ల‌కు 15 శాతం ఈక్విటీ భాగం ఉంటుంది.

మోడ‌రేట్ లైఫ్ సైకిల్ ఫండ్:

వ‌య‌సు 35 ఏళ్ల వ‌ర‌కూ ఈక్విటీ 50శాతం ఉంటుంది. ఖాతాదారు వ‌య‌సు క్ర‌మంగా పెరిగేకొల‌దీ ఈక్విటీ లో పెట్టుబ‌డి భాగం త‌గ్గుతూ వ‌స్తుంది. 55ఏళ్ల వ‌చ్చే స‌రికి 10 శాతానికి చేరుకుంటుంది.

క‌న్స‌ర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్:

వ‌య‌సు 35 ఏళ్ల వ‌ర‌కూ 25 ఈక్విటీ శాతం ఉంటుంది. ఖాతాదారుని వ‌య‌సు 55వ‌చ్చే స‌రికి 5 శాతానికి చేరుకుంటుంది.

క్రిసిల్ రిసెర్చ్ నివేదిక ప్ర‌కారం లైఫ్ సైకిల్ ఫండ్ ఈక్విటీ ప‌రిమితి 25%,50%,75% ల్లో గ‌రిష్ట రాబ‌డి 75% ఈక్విటీకే వ‌చ్చిన‌ట్లు తెలిపింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly