కొత్త ఆదాయపు పన్ను నియమాల గురించి తెలుసుకోవాల్సిన 10 పాయింట్లు..

ఏప్రిల్ నుంచి కొత్త ఆదాయపు పన్ను రేట్లు అమల్లోకి వచ్చాయి

కొత్త ఆదాయపు పన్ను నియమాల గురించి తెలుసుకోవాల్సిన 10 పాయింట్లు..

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, 2019-20 ఆర్థిక సంవత్సరానికి తగ్గింపును క్లెయిమ్ చేయడానికి, వివిధ పెట్టుబడులు చేయడానికి ప్రభుత్వం గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఇందులో నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్), పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ వంటి ఇతర సెక్షన్ 80సీ పెట్టుబడులు ఉన్నాయి. ఏప్రిల్ నుంచి కొత్త ఆదాయపు పన్ను రేట్లు అమల్లోకి వచ్చాయి. ఏదేమైనా, పాత పన్ను స్లాబ్‌లు కూడా అమలులో ఉంటాయి, ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం పన్ను చెల్లింపుదారునికి ఉంటుంది.

కొత్త పన్ను రేట్ల ప్రకారం, రూ. 2,50,000 వరకు - 0, రూ. 2,50,001 నుంచి రూ. 5,00,000 వరకు - 5 శాతం, రూ. 5,00,001 నుంచి రూ. 7,50,000 వరకు - 10 శాతం, రూ. 7,50,001 నుంచి రూ. 10,00,000 వరకు - 15 శాతం, రూ. 10,00,001 నుంచి రూ. 12,50,000 వరకు - 20 శాతం, రూ. 12,50,001 నుంచి రూ. 15,00,000 వరకు - 25 శాతం, రూ. 15 లక్షలకు పైన - 30 శాతం.

ఎన్పీఎస్ పై ఆదాయపు పన్ను మినహాయింపు: పాత పన్ను రేటు vs కొత్త పన్ను రేటు :

  1. ఒకవేళ మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లైతే, ఎన్‌పీఎస్ కాంట్రిబ్యూషన్ పై కొన్ని పన్ను ప్రయోజనాలకు మీరు అర్హులు కాదు.

  2. ఒకవేళ మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లైతే, ఉద్యోగి ఎన్‌పీఎస్ ఖాతాకు యజమాని కాంట్రిబ్యూషన్ పై మీరు ఇప్పటికీ ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఒకవేళ యజమాని మీ ఎన్‌పీఎస్ ఖాతాకు కాంట్రిబ్యూషన్ అందిస్తున్నట్లైతే, ఏదైనా పరిమితితో సంబంధం లేకుండా 10 శాతం వరకు జీతం (ప్రాథమిక + డీఏ) మినహాయింపు సెక్షన్ 80 సీసీడీ (2) కింద ఆదాయపు పన్ను మినహాయింపుకు అర్హత పొందుతుంది.

  3. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతంలో 14 శాతం అధిక పరిమితిని పొందుతారు. ఇతరులకు, ఈ పరిమితి 10 శాతంగా ఉంది.

  4. ఒకవేళ మీరు పాత ఆదాయపు పన్ను విధానానికి కట్టుబడి ఉన్నట్లైతే, ఈ ప్రయోజనం కూడా లభిస్తుంది.

  5. ఒకవేళ మీరు పాత ఆదాయపు పన్ను విధానానికి కట్టుబడి ఉన్నట్లైతే, సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద మీరు రూ. 50,000 ప్రత్యేక తగ్గింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.

  6. కానీ ఒకవేళ మీరు కొత్త పన్ను విధానానికి మారితే ఇది క్లెయిమ్ చేయబడదు.

  7. పాత పన్ను విధానంలో, ఈ అదనపు రూ. 50,000 పన్ను మినహాయింపు ఎన్‌పీఎస్ కి పెట్టుబడులు పెట్టడానికి సెక్షన్ 80 సీసీడీ (1) కింద అనుమతించిన రూ. 1.5 లక్షలకు అదనంగా ఉంటుంది.

  8. కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఈ రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపు అందుబాటులో లేదు.

సెక్షన్ 80 సీ, 80 సీసీసీ (బీమా సంస్థ ఇచ్చే పెన్షన్ ప్లాన్‌లో పెట్టుబడి), సెక్షన్ 80 సీసీడ్ (1) (ఎన్‌పీఎస్ కోసం) కింద మొత్తం మినహాయింపు ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షలకు మించకూడదని గుర్తుంచుకోండి.

  1. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మరో ఆదాయపు పన్ను మార్పులో ఎన్‌పీఎస్, సూపరాన్యునేషన్ ఫండ్, ఈపీఎఫ్ కు యజమాని కాంట్రిబ్యూషన్ సంవత్సరంలో రూ. 7.5 లక్షలకు మించి ఉన్నట్లయితే పన్ను వర్తిస్తుంది.

  2. ఆదాయపు పన్ను నిబంధనలో ఈ మార్పు పాత, కొత్త పన్ను విధానాలకు వర్తిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly