క్రెడిట్ కార్డులో క‌నీస మొత్తం అంటే ఏంటి?

క్రెడిట్ కార్డులో కనీస మొత్తం చెల్లించడం అప్పుడప్పుడు చేస్తే ఫ‌ర్వాలేదు కానీ దీన్ని ఒక అల‌వాటుగా చేయకూడదు.

క్రెడిట్ కార్డులో క‌నీస మొత్తం అంటే ఏంటి?

రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా ప్రకారం డిసెంబర్ 2018 నాటికి మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 4.42 కోట్లు, 5.46 ల‌క్ష‌ల కోట్ల లావాదేవీలు ఆ నెల‌లో జరిగాయి. దేశంలో క్రెడిట్ కార్డు వాడకం క్రమంగా పెరిగింది. 45 రోజుల వడ్డీ లేని రుణాలు, లావాదేవీలు చేయడంలో ఉండే సౌల‌భ్యం, తగ్గింపులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల‌ను పెంచేందుకు తీసుకుంటున్న చొర‌వ కార‌ణంగా వీటి వినియోగం మ‌రింత పెరిగింది. అయితే, క్రెడిట్ కార్డు ద్వారా వ్యయం చేసేవారికి అధిక ఖ‌ర్చు చేసేంద‌కు అవ‌కాశం ఉంటుంది. క్రెడిట్ కార్డు వినియోగించే వారు చెల్లించేందుకు నిధులు కొర‌త వ‌స్తే, కనీస మొత్తాన్ని చెల్లించే ఎంపికను క్రెడిట్ కార్డు సంస్థ‌లు అందిస్తున్నాయి. ఇది మొత్తం బిల్లులో తక్కువ శాతం ఉంటుంది. అయితే, ప్ర‌తీ సారీ కనీస మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటే క్ర‌మేపీ రుణ వ‌లంలో చిక్కుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. క్రెడిట్ కార్డ్ నిర్వహించడానికి గడువు తేదీకి చెల్లించాల్సిన కనీస మొత్తం ఇది. ప్ర‌తీ నెలా చేసిన ఖ‌ర్చు మొత్తంలో కొంత శాతం మాత్ర‌మే ఉంటుంది. సాధారణంగా, కనీస మొత్తం వినియోగించిన మొత్తంలో 5% గా లెక్కిస్తారు. అయినప్పటికీ, క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఈఎమ్ఐ పై ఏదైనా కొనుగోలు చేసినా లేదా క్రెడిట్ పరిమితి కంటే ఎక్కువ ఖ‌ర్చుచేసినా, లేదా అంతకుముందు నెలలో చేయాల్సిన క‌నీస మొత్తం చెల్లింపులు మొద‌లైన‌వ‌న్నీ క‌లిపి ప్రస్తుత కనీస‌ మొత్తంలో క‌లుస్తుంది.

కనీస మొత్తం చెల్లించడం వల్ల ఆల‌స్య రుసుము చెల్లించకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఆల‌స్య రుసుము మీరు తీసుకున్న‌క్రెడిట్ సంస్థ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉంటుంది. సాధారణంగా ఇది రూ. 100 నుంచి రూ. 1,000 మధ్య ఉంటుంది. క‌నీస మొత్తం చెల్లించినా క్రెడిట్ కార్డు ద్వారా వినియోగించిన మొత్తం బ్యాలెన్స్ పై వ‌డ్డీ లెక్కిస్తారు.

క్రెడిట్ కార్డులోని కనీస మొత్తాన్ని చెల్లించినట్లైతే, మీరు డిఫాల్టర్ గా ప‌రిగ‌ణించ‌రు.అలాగే భవిష్యత్తులో కూడా మీరు క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించవచ్చు. ఒకవేళ మీరు కనీస చెల్లింపును చేయకపోతే, ఆలస్య చెల్లింపు చార్జీలు వంటి ఇతర ఛార్జీలను చెల్లించవలసి ఉంటుంది. మీరు క్రెడిట్ కార్డులో కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించినట్లైతే, వచ్చే నెల బిల్లులో మిగిలిన మొత్తానికి పైన తెలిపిన దానికంటే ఎక్కువ వడ్డీని మీరు చెల్లించవలసి ఉంటుంది.

కనీసపు చెల్లించకపోతే క్రెడిట్ కార్డు నిర్వ‌హ‌ణ సంస్థ‌లు ఆలస్యం చెల్లింపు ఫీజు, వడ్డీ, ఇతర ఛార్జీలు విధించవచ్చు. క్రెడిట్ కార్డు ర‌ద్దు చేయ‌డం కూడా జ‌రుగుతుంది. అంతేకాకుండా, కనీస మొత్తం చెల్లించకపోవడం వలన క్రెడిట్ స్కోర్ను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. భవిష్యత్తులో రుణం తీసుకోవాల‌నుకుంటే ఇబ్బందులు ఏర్ప‌డొచ్చు.

చాలా వ‌ర‌కూ క్రెడిట్ కార్డు సంస్థ‌లు నెలవారీ వడ్డీ రేటును 3% వసూలు చేస్తున్నాయి. వార్షిక వడ్డీ రేటు 40% కంటే ఎక్కువగా ఉంటుంది. కనీస మొత్తం చెల్లించిన తర్వాత మిగిలిన మొత్తంపై బ్యాంకు వ‌డ్డీని లెక్కిస్తుంది. మొత్తం బిల్లును చెల్లించ‌డానికి చాలా నెలలు పట్టవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఇచ్చిన ఉదాహరణ ప్రకారం, మొత్తం వినియోగించిన‌ బిల్లు రూ. 5,000 ఉంటే, ప్రతి నెలలో కనీస మొత్తం రూ.200 చెల్లించాలి. ఈ కార్డుపై ఎటువంటి వ్యయం చేయక‌పోతే మొత్తం బిల్లు చెల్లిచేందుకు 44 నెలల స‌మ‌యం ప‌డుతుంది. కనీస మొత్తం చెల్లించడం అప్పుడప్పుడు చేస్తే ఫ‌ర్వాలేదు కానీ దీన్ని ఒక అల‌వాటుగా చేయకూడదు.

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly