పీఎఫ్ పొందే వారు యూఏఎన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

యూఏఎన్ కింద బహుళ సభ్యుల ఐడిలను లింక్ చేయడం ద్వారా ప్రస్తుత, మునుపటి సంస్థల పీఎఫ్ సంబంధిత వివరాలను ఒకే ప్రదేశంలో వీక్షించవచ్చు

పీఎఫ్ పొందే వారు యూఏఎన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

యూనివర్సల్ అకౌంట్ నెంబరు (యూఏఎన్) అనేది ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కేటాయించే ప్రత్యేక సంఖ్య. ప్ర‌తీ ఉద్యోగికి వేర్వేరు సంఖ్య ఉంటుంది. ఇది శాశ్వతంగా ఉంటుంది. మీరు ఎన్ని ఉద్యోగాలు మారినప్పటికీ యూఏఎన్‌ మాత్రం ఒకటే ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పటికే యూఏఎన్ ను కలిగివున్నట్లైతే, మీరు ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో ఉద్యోగం మానేసి, కొత్త సంస్థలో చేరే సమయంలో వారికి మీ యూఏఎన్ ను సమర్పిస్తే సరిపోతుంది. అప్పుడు వారు కొత్తగా కేటాయించిన మెంబర్ ఐడీ ని మీ యూఏఎన్ తో లింక్ చేస్తారు. మీ యూఏఎన్ కింద వివిధ సంస్థలు ఇచ్చే ఐడీ లను లింక్ చేయడం ద్వారా ప్రస్తుత, మునుపటి సంస్థల పీఎఫ్ సంబంధిత వివరాలను ఒకే ప్రదేశంలో వీక్షించడానికి ఈపీఎఫ్ఓ సభ్యుడు సహాయపడుతుంది. అయితే, సభ్యుడు యూఏఎన్ కార్డు డౌన్ లోడ్, సభ్యుడి పాస్ బుక్ డౌన్ లోడ్, కేవైసీ సమాచారాన్ని నవీకరించడం, తమ ఐడీలన్నింటినీ యూఏఎన్ కింద నమోదు చేయడం, ఫైల్ & బదిలీ క్లెయిమ్లను వీక్షించడం వంటి వివిధ రకాల సౌకర్యాలను పొందేందుకు సభ్యుడు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

దీని కోసం సభ్యుడు మొదటగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్ ను సందర్శించి, అందులో ‘యాక్టీవేట్ యూఏఎన్’ అనే లింక్ ను ఎంచుకోవడం ద్వారా యూఏఎన్ ను యాక్టీవేట్ చేసుకోవచ్చు. యాక్టీవేట్ చేసుకునే ముందు సభ్యుడు యూఏఎన్, మొబైల్ నెంబర్, సభ్యుని ఐడీ ని సిద్ధంగా ఉంచుకోవాలి. మరిన్ని వివరాల కోసం ‘యూజర్ మాన్యువల్ ఫర్ మెండర్’ అనే ఆప్షన్ ను ఎంచుకోండి.

యూఏఎన్ ను యాక్టీవేట్ చేసుకోడానికి గల ప్రధాన ఉద్దేశం యజమానిపై ఆధారపడకుండా, సర్వీస్ నాణ్యతను మెరుగుపరుచుకోవడం. ఒకవేళ పీఎఫ్ లబ్దిదారునికి యూఏఎన్ లేనట్లయితే, అతను లేదా ఆమె ప్రస్తుత యజమానిని సంప్రదించవచ్చు.

ఒక సభ్యుడు యూఏఎన్ పోర్టల్ ద్వారా ఈ కింది సదుపాయాలను పొందవచ్చు.

 • URL : https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ను సందర్శించండి.

 • యూఏఎన్, మొబైల్ నెంబరు, సభ్యుని ఐడీని నమోదు చేయడం ద్వారా సభ్యుని యూఏఎన్ రిజిస్ట్రేషన్ ను యాక్టీవేట్ చేసుకోవచ్చు.

 • సభ్యుడు సృష్టించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ ను ఉపయోగించి పోర్టల్ లో లాగిన్ అవ్వాలి.

డౌన్ లోడ్:

 • సభ్యుడి పాస్ బుక్ డౌన్ లోడ్
 • యూఏఎన్ కార్డ్ డౌన్ లోడ్

మునుపటి సభ్యుల ఐడీ లు:

 • మునుపటి సభ్యుని ఐడీ జాబితా
 • స్టేటస్ ను వీక్షించడం

క్లెయిమ్ బదిలీ:

 • ఫైల్ ట్రాన్స్ ఫర్ క్లెయిమ్
 • బదిలీ క్లెయిమ్ స్టేటస్ ను వీక్షించడం
 • సిస్టం సృష్టించిన ట్రాన్స్ ఫర్ క్లెయిమ్ స్టేటస్

ప్రొఫైల్:

 • మొబైల్ నంబర్ ను సవరించడం
 • ఈ - మెయిల్ ఐడీని సవరించడం
 • కేవైసీ సమాచారాన్ని నవీకరించడం
 • పాస్ వర్డ్ ను మార్చడం
 • వ్యక్తిగత వివరాలను సవరించండం

తరచుగా అడిగే ప్రశ్నలు:

 • మమ్మల్ని సంప్రదించండి
 • హెల్ప్ డెస్క్ ఈ - మెయిల్
 • హెల్ప్ డెస్క్ ఫోన్ సంఖ్య
 • వెబ్ సైట్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly