డిజిటల్‌ కరెన్సీని ఆవిష్కరించిన ఫేస్‌బుక్‌..

ఎవరైతే ఆన్ లైన్ ద్వారా ఎక్కువగా చెల్లింపులు చేస్తారో వారికి ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి

డిజిటల్‌ కరెన్సీని ఆవిష్కరించిన ఫేస్‌బుక్‌..

ప్రముఖ సోషల్ మెసేజింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌ త్వరలో ఒక సరికొత్త అంతర్జాతీయ కరెన్సీ ని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ‘లిబ్రా’ పేరుతో సొంతంగా డిజిటల్‌ కరెన్సీ ని అందుబాటులోకి తీసుకురానుంది. దీనిని ఉపయోగించి వినియోగదారులు సులువుగా నగదును దాచుకోవడం, వేరొకరికి బదిలీ చేయడం లేదా నగదు చెల్లింపులు చేయడం వంటివి చేయవచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఆన్ లైన్ ద్వారా ఎక్కువగా చెల్లింపులు చేస్తారో వారికి ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడతాయని సంస్థ తెలిపింది.

ఈ అంతర్జాతీయ కరెన్సీని వచ్చే సంవత్సరం మార్కెట్ లోకి తీసుకురానుకున్నట్లు సంస్థ తెలిపింది. అయితే, దీనికి సంబంధించిన నమూనాను ఫేస్‌బుక్‌ తన భాగస్వాములతో కలిసి విడుదల చేసింది. అలాగే లిబ్రా విలువ ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేలా జెనీవాకి చెందిన ఒక సంఘం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇప్పటికీ బ్యాంకు సేవలు అందని చాలా మంది ప్రజలకు ఈ- కామర్స్‌, ఆర్థిక సేవలను లిబ్రా ద్వారా అందుబాటులోకి తీసుకురాగలమని లిబ్రా అసోసియేషన్‌ హెడ్ డాంటే డిస్పార్టీ తెలిపారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly