ఐటీఆర్ ఫారం -1తో ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం ఎలా?

సంవత్సరానికి రూ.50 లక్షల వరకు సంపాదిస్తున్న వారు ఫారం -1ని దాఖలు చేయవలసి ఉంటుంది

ఐటీఆర్ ఫారం -1తో ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడం ఎలా?

ఆదాయ పన్ను శాఖ ఆర్థిక సంవత్సరం 2017-18 లేదా అస్సెస్మెంట్ సంవత్సరం 2018-19 కి గాను ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖ‌లు చేయ‌డానికి ఐటీఆర్ ఫారం -1 (సహజ్) ఈ - ఫైలింగ్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీతం లేదా గృహ లేదా ఇతర వనరుల ద్వారా సంవత్సరానికి రూ.50 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్న వారు ఐటీఆర్ ఫారం -1ని దాఖలు చేయవలసి ఉంటుంది.

ఆదాయ పన్ను రిటర్న్స్ ఫారం -1 (సహజ్)లో కొన్ని మార్పులు చేశారు. వాటిని పరిశీలిద్దాం…

  1. ఆదాయ పన్ను రిటర్న్స్ ఫారం - 1 కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది.
  1. జీతం ద్వారా వచ్చే ఆదాయాన్ని పూర్తి వివరాలతో పేర్కొనాలి.

  2. గృహం ద్వారా వచ్చే ఆదాయ వివరాలను పేర్కొనాలి.

  3. ఒకవేళ గడువు ముగిసిన తర్వాత ఆదాయ పన్ను రిటర్న్స్ నమోదు చేస్తే 234ఎఫ్ సెక్షన్ కింద ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఆదాయ పన్ను రిటర్న్స్ ఫారం -1 ను ఎలా దాఖలు చెయ్యాలి?

ఆదాయ పన్ను రిటర్న్స్ ఫారం -1 ను దాఖలు చేయడానికి రెండు మార్గాలున్నాయి

1. ఆఫ్ లైన్

ఆఫ్ లైన్ పద్దతిలో ఆదాయ పన్ను రిటర్న్స్ ఫారం-1ను దాఖలు చేయాల‌నుకుంటే నేరుగా ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. దీన్ని సమర్పించినప్పుడు ఆదాయ పన్ను శాఖ మీకు ఒక రశీదును జారీ చేస్తుందని సీఏ అభిషేక్ సోనీ, టాక్స్2విన్.ఇన్ యజమాని తెలిపారు.

కానీ ఆదాయ పన్ను చట్టం ప్రకారం, కింది తెలిపిన వ్యక్తులు మాత్రమే కాగితం రూపంలో ఆదాయ పన్ను తిరిగి దాఖలు చేసే అవకాశం ఉంటుంది.

  • 80 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులు

  • ఆదాయం రూ. 5 ల‌క్ష‌లు లోపు ఉండి రిఫండ్ కోసం ఏ విధ‌మైన క్లెయిమ్‌లు చేయ‌కుండా ఉండే వ్య‌క్తులు, హిందూ అభివ్యాజ్య కుటుంబాలు

2. ఆన్ లైన్

మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ ను ఆన్ లైన్ ద్వారా దాఖలు చేయాలనుకుంటే రెండు మార్గాలున్నాయి.

A. రిటర్న్ ను సిద్ధం చేసి ఆన్ లైన్లో (ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్ లో) సమర్పించండి

B. ఆఫ్ లైన్ ద్వారా xml ను తయారుచేసి, ఆన్ లైన్ ద్వారా అప్లోడ్ చేయండి

పైన తెలిపిన రెండు మార్గాలను ఒకదాని తరువాత ఒకటి తెలుసుకుందాం.

A. రిటర్న్ ను సిద్ధం చేసి ఆన్ లైన్లో (ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ లో) సమర్పించండి

స్టెప్ 1 - మొదటగా మీరు incometaxindiaefiling.gov.in లోకి ప్రవేశించి అక్కడ మీ యూజర్ ఐడి, పాస్ వర్డ్, పుట్టిన తేదీ, క్యాప్చాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

స్టెప్ 2 - లాగిన్ అయిన వెంటనే, మీకు “ఆదాయ పన్ను రిటర్న్ దరఖాస్తు” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

స్టెప్ 3 - ఆదాయ పన్ను రిటర్న్స్ ఫారం పేరు, అసెస్మెంట్ సంవత్సరం, సమర్పించాల్సిన పద్ధతిని ఎంచుకోండి.

స్టెప్ 4 - వివరాలను తెలిపిన అనంతరం ‘సబ్మిట్’ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 5 - మీ రిటర్న్స్ విజయవంతంగా సమర్పించబడ్డాయి, ఐటీఆర్-v జెనెరేట్ అవుతుందనే పాప్ అప్ ను ఇక్కడ మీరు చూడవచ్చు. అనంతరం లింక్ పై క్లిక్ చేసి, రసీదును డౌన్లోడ్ చేసుకోండి. ఐటీఆర్-v మీ రిజిస్టర్డ్ ఈ - మెయిల్ కు కూడా అందుతుంది.

B. ఆఫ్ లైన్ ద్వారా xml ను తయారుచేసి, ఆన్ లైన్ ద్వారా అప్లోడ్ చేయండి

స్టెప్ 1: మీరు https://www.incometaxindiaefiling.gov.in/home వెబ్ సైట్ లోకి ప్రవేశించగానే కుడి వైపు ‘ఆఫ్ లైన్ యుటిలిటీస్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

స్టెప్ 2: అనంతరం మీకు ‘ఇన్కం టాక్స్ రిటర్న్ ప్రిపరేషన్ యుటిలిటీస్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: అనంతరం మీరు ఏ అస్సేస్మెంట్ సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలనుకుంటున్నారో దాని పై క్లిక్ చేయండి.

స్టెప్ 4: తరువాత మీరు ఆదాయ పన్ను రిటర్న్స్ ఈ - ఫైల్ చేయదలిచిన ఆఫ్ లైన్ యుటిలిటీని డౌన్ లోడ్ చేయండి.

స్టెప్ 5: ఆఫ్ లైన్ లో తయారుచేసిన రిటర్న్స్ ను ఆదాయ పన్ను వెబ్ సైట్ లో ‘ఫైలింగ్ అఫ్ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్’ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి xml ఫైల్ ను అప్ లోడ్ చేయాలి.

మొత్తం ప్రక్రియ పూర్తి అయినప్పటికీ, మీ ఆదాయ పన్ను రిటర్న్స్ సమర్పించిన తర్వాత, రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి 120 రోజుల్లోపు మీ రిటర్న్స్ ను ధృవీకరించడం మర్చిపోవద్దు.

ముగింపు

2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను అర్హులైన వ్యక్తులు ఐటిఆర్ ఫారం -1 ను పూర్తి చేసి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. కానీ రిటర్న్ దాఖలు చేయడానికి కొంత సమయం వేచి ఉండడం మంచిది. ఎందుకంటే సరైన, పూర్తి టీడీఎస్ వివరాలు జూన్ నెలలో అప్ డేట్ చేయబడతాయి. ఒకవేళ ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మీకు ఎలాంటి టీడీఎస్ తగ్గింపులు లేకపోయినట్లయితే ఆదాయ పన్ను రిటర్న్ ను దాఖలు చేసుకోవచ్చు. ఏదేమైనా, వ్యక్తి లేదా సంస్థ సంవత్సరానికి మీ టీడీఎస్ ను తగ్గించినట్లైతే, రిటర్న్స్ దాఖలు సమయంలో 26 ఏఎస్ ను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly