పెళ్ల‌యి సంపాదించే యువ‌తకు 6 ఉత్త‌మ ఆర్థిక సూచ‌న‌లు

పెళ్ల‌యి సంపాదిస్తున్న యువ‌త ఆర్థిక ప్ర‌ణాళిక ఎలా ఉంటే బాగుంటుందో తెలుసుకుందాం.

పెళ్ల‌యి సంపాదించే యువ‌తకు 6 ఉత్త‌మ ఆర్థిక సూచ‌న‌లు

ప‌న్ను ఆదాకు ఎలాంటి ప‌థ‌కాన్ని కొనుగోలు చేయ‌కండి! పీపీఎఫ్ ఖాతాను తెర‌వొద్దు! 20-25ఏళ్ల కాల‌వ్య‌వ‌ధికి స‌రిపోను ట‌ర్మ్ పాల‌సీని కొనుగోలు చేయ‌గ‌ల‌రు. రిటైర్‌మెంట్ వ‌య‌సుకు స‌మీపంలో ముగిసేలా ఉండేలా చూసుకోవ‌డం మంచిది. వార్షిక వేత‌నానికి 15 రెట్లు స‌మానంగా బీమా హామీ సొమ్ము ఉండేలా చూసుకోవ‌డం మేలు. వీలైతే ఇంకా ఎక్కువ తీసుకున్నా ఫ‌ర్వాలేదు. మొట్టమొదటిది, అత్య‌వ‌స‌ర నిధి. అత్య‌వ‌స‌ర నిధ జ‌మ‌చేసుకోవాలి. మీ ద‌గ్గ‌రున్న సొమ్మునంతా బ్యాంకు ఖాతాలో వేయండి. దీంట్లోంచి కొంత సొమ్ముతో ఆన్‌లైన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా తెర‌వండి. ఇది అత్య‌వ‌స‌ర నిధిగా ప‌నికొస్తుంది. నెల‌వారీ ఖ‌ర్చుల‌కు 6రెట్లు స‌మానంగా ఈ నిధి అవ‌స‌ర‌మ‌వుతుంది. అది జ‌మ అయ్యేంత వ‌ర‌కు ఖాతాలో డ‌బ్బులు వేస్తూ వెళ్లండి. మీరు పెళ్లి కాని యువ‌తీయువ‌కులా! మీ సంపాద‌న‌తో ఇలా చేస్తే విజ‌యాలు మీవే!

మెడిక్లెయిం పాల‌సీ:

మీ సంస్థ మెడిక్లెయిం పాల‌సీ ఇచ్చినా స‌రే మీకంటూ సొంతానిది ఒక‌టి తీసుకోండి. దీంట్లో మీ త‌ల్లిదండ్రులకు పాల‌సీ వ‌ర్తించేలా చేసుకోండి. వీలైనంత ఎక్కువ క‌వ‌రేజీ ఉన్న పాల‌సీని కొనుగోలు చేసే ఏటా పెంచుకునే అవ‌కాశాల‌ను ప‌రిశీలించండి. దీనికి సంబంధిత ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిశీలించండి. జీవిత భాగ‌స్వామిని, మీపై ఆధార‌ప‌డిన వారిని దీంట్లో జ‌త‌చేయ‌డం మంచిది.

చెడు రుణాలను త‌గ్గించుకోవ‌డం:

ఉప‌క‌ర‌ణాలు లేదా గ్యాడ్జెట్ల వాయిదాలు చెల్లించేందుకు డ‌బ్బు జ‌మ‌చేసుకోండి. దీంతో పాటు క్రెడిట్ కార్డు బిల్లులు, వ్య‌క్తిగ‌త రుణాలు తీర్చే ప్ర‌య‌త్నంలో ఉండండి. అద‌నంగా ఏమైనా సొమ్ము ఉంటే వీటికి ముంద‌స్తు చెల్లింపు జ‌రిపే ఆలోచ‌న‌ను చేయ‌వ‌చ్చు.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో:

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేయ‌డం ప్రారంభించ‌గ‌ల‌రు. 80సీ సెక్ష‌న్ కింద రూ.1.5ల‌క్ష‌ల కంటే ప‌రిమితి త‌క్కువ‌గా ఉంటే సాధ్య‌మైనంత ఎక్కువ‌గా ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి చేయ‌గ‌ల‌రు. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లో ఖాతా తెరిచి ఎప్పటిక‌ప్పుడు వీలైనంత డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టండి.

పిల్ల‌లు ఉంటే?

మీకు పిల్ల‌లు ఉంటే వారి ఉన్న‌త చ‌దువుల‌కు, పెళ్లిళ్ల‌కు మ‌దుపు చేసే విష‌య‌మై ఆలోచించండి.

చివ‌రి మాట‌:

ఇలాంటి ప్రాథ‌మిక ప‌నులన్నీ చేసే దాకా ఎలాంటి పుస్త‌కాలు చ‌దవాల్సిన అవ‌స‌రంలేదు. ఎలాంటి ఉద్దేశం లేకుండా బ్లాగులు, మ్యాగ‌జైన్లు చ‌ద‌వ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేదు. ఆర్థిక జీవితానికి సంబంధించి ప్ర‌శ్న‌లు మీలోనే ఉంటాయి, వాటికి స‌మాధానాలు మీరే అన్వేషించాల్సి ఉంటుంది. ఒక ప్ర‌శ్న‌కు స‌మాధానం వెతుక్కున్నాక మ‌రోదానికి క‌ద‌లండి.

గ‌మ‌నిక: ఈ క‌థ‌నం కేవ‌లం యువ‌త‌లో ఆర్థిక శైలిపై త‌మకున్న సందేహాల‌ను వాటికి స‌మాధానాల‌ను అన్వేషించే క్ర‌మాన్ని స‌రైన క్ర‌మంలో పేర్చుకునేందుకు స‌హాయ‌ప‌డ‌డానికి ఉద్దేశించింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly