నమస్తే సిరి, గతంలో నేను అడిగిన ప్రశ్నలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.నా వయస్సు 28. నేను ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ లో పనిచేస్తున్నాను. నెలకు 27,000 చేతికి వస్తాయి. మా కంపెనీ నుంచి నాకు పీఎఫ్పె, పెన్షన్ ఉంది. పీఎఫ్ కు దాదాపు 4500 మరియు పెన్షన్ కు 2500 వరకు కట్ అవుతున్నది.అయితే నా సహోద్యోగుల్లో కొంతమంది వీపీఎఫ్ ను కూడా కడుతున్నారు. వారు నన్ను కూడా కట్టమని ప్రోత్సహిస్తున్నారు. కానీ నాకు మ్యూచువల్ ఫండ్ మీద ఆసక్తి ఉన్నది. వీపీఎఫ్ మంచిదా లేక మ్యూచువల్ ఫండ్ మంచివా? ఈ రెండింటిలో ఏది ఎక్కువ రాబడి ఇస్తాయి? వీపీఎఫ్ పనితనం, రాబడి ఎలా ఉంటుందో కూడా వివరించగలరు. నాకు సొంత ఇల్లు, నా పిల్లలకు విద్య, పెళ్లికి సంబంధించి ఎలాంటి ప్లన్స్ ను తీసుకోవాలో చెప్పండి.

వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగి తనంతట తానుగా కంట్రిబ్యూట్ చేసే మొత్తం. ప్రతి నెలా ఆటోమేటిక్ గా నెలజీతం నుంచి జమ అవుతుంది. దీనిపై వడ్డీ ప్రావిడెంట్ ......

సర్ నమస్కారం, నేను పోలీసు కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాను, నాకు ఇద్దరు మగ పిల్లలు ఒకరు 7 ఏళ్ళు ,4 ఏళ్ళు . 3 నెలల క్రితం ఇంటి స్థలం , అలాగే ఇల్లు కట్టుకోవడానికి, బ్యాంక్ ద్వారా లోన్ తీసుకున్నాను. రూ. 32,000 జీతం లో రూ. 24,000 వచ్చే ఏడు ఆగస్టు నుండి EMI కట్ అవుతుంది అన్నారు. నేను తీసుకున్న నిర్ణయం మీ అభిప్రాయం మరియు పిల్లల భవిష్యత్, సేవింగ్స్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఏమి చేయలేదు. నాకు ఏమైనా ఆర్థికంగా భవిష్యత్ సలహా ఇవ్వగలరని ప్రార్ధన.

సాధారణముగా అన్ని రుణాల చెల్లింపులు, నెల జీతంలో 30 శాతానికి మించకుండా ఉండేట్లు చూసుకోవాలి. దీని వలన కుటుంబ ఖర్చులతోపాటు ఇతర ఆర్ధిక లక్ష్యాలను కూడా చేరు......

హాయ్ సిరి, నా పేరు జగన్, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. నెల జీతం రూ 35 వేలు. నా భార్య ప్రభుత్వ టీచర్. ఆమె నెల జీతం రూ 47 వేలు. నాకు రూ 65 లక్షల టర్మ్ జీవిత బీమా , రూ 3 లక్షల పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది . నా భార్యకు ఎల్ ఐ సి లో రూ 5 లక్షల పాలసీ, ఎస్ బి ఐ జీవిత బీమా కూడా ఉంది. మా ఇద్దరికీ రూ 9 లక్షల వ్యక్తిగత రుణం , అలాగే రూ. 7 లక్షల కారురుణం ఉన్నాయి . ఎస్ బి ఐ మ్యూచువల్ ఫండ్ లో నెలకు రూ 3 వేలు మదుపు చేస్తున్నాము. మా ఆర్ధిక ప్రణాళిక ఎలా ఉండాలో తెలుపగలరు.

వ్యక్తిగత రుణం, కారురుణం ఫై వడ్డీ అధికంగా ఉంటాయి. అలాగే పన్ను ప్రయోజనాలు కూడా ఉండవు. కాబట్టి ఇటువంటి రుణాలను త్వరగా తీర్చివేయడం మంచిది. మీ భార్య పేరు......

హాయ్ సిరి, మంచి సలహాలు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. నా వయసు 29 ఏళ్ళు. నెల జీతం రూ 35 వేలు. ఈ మధ్యనే మాక్స్ లైఫ్ నుంచి రూ 1 కోటి విలువ గల టర్మ్ జీవిత బీమా పాలసీ తీసుకున్నాను. నెల ప్రీమియం రూ 1,200. మా అమ్మ గారితో కలిసి రూ 25 లక్షలకు గృహా రుణం తీసుకున్నాను. ఈఎంఐ రూ 23 వేలు. బృంద ఆరోగ్య బీమా పాలసీ రూ. 5 లక్షలకు ఉంది. ఇది తప్ప వేరే ఆరోగ్య పాలసీ లేదు. రూ 6 లక్షల జీవన లక్ష్య పాలసీ 2016 లో తీసుకున్నాను. వార్షిక ప్రీమియం రూ. 26 వేలు. ఈ పాలసీని రద్దు చేసుకోనా? రెండు ఏళ్లలో నా వివాహం . ఈ ఎల్ ఎస్ ఎస్ లో నెలకు రూ 3,500 లు మదుపు చేస్తున్నాను. నాకు ఏ ఇతర పెట్టుబడులు గానీ , అప్పులు గానీ లేవు. నాకు ఆర్ధిక ప్రణాళిక సూచించండి .

చిన్న వయసు నుంచే మదుపు చేస్తున్నందుకు అభినందనలు. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ ఉంటుంది కాబట్టి, పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూ......

హాయ్ సిరి, నా పేరు సుమతి . ప్రైవేట్ కాలేజీ లో లెక్చరర్ ని. రెండు నెలల క్రితం తల్లిని అయ్యాను. ప్రస్తుతం జీతం లేకుండా సెలవులో ఉన్నాను. ఆరు నెలల తరువాత మళ్ళీ ఉద్యోగంలో చేరతాను. నా వద్ద రూ 2 లక్షలు ఉన్నాయి . నాకు రూ 5 లక్షలకు వ్యక్తిగత ఆరోగ్య పాలసీ ఉంది. మా వారు ఒక నిర్మాణ సంస్థలో సివిల్ ఇంజనీర్. నెల జీతం రూ 32 వేలు. మా నెల ఖర్చులు రూ. 20 వేలు. మేము అద్దె ఇంట్లో నివసిస్తున్నాము. మంచి సలహాలు, ఆర్ధిక ప్రణాళికలను అందజేస్తున్నందుకు ధన్యవాదాలు. మాకు ఆర్ధిక ప్రణాళిక సూచించండి.

మీరు తల్లి అయినందుకు శుభాకాంక్షలు. ముందుగా మీ వారు ఒక టర్మ్ పాలసీ ని తీసుకోమనండి. టర్మ్ పాలసీ వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేల......

హాయ్ సిరి . నాకు 26 ఏళ్ళు . 3 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని. నెల జీతం రూ 50 వేలు. వచ్ఛే సంవత్సరం నా వివాహం. ఎల్ ఐ సి లో 20 సంవత్సరాల ఎండోమెంట్ పాలసీ లో 3 సంవత్సరాల పాటు వార్షిక ప్రీమియం రూ 50వేలు కట్టా. ఇప్పుడు ఆపేద్దామనుకుంటున్నా. ఎల్ ఐ సి ప్రీమియం ని పీ పీ ఎఫ్ లో నెలకు రూ 5 వేలు మదుపు చేద్దాం అనుకుంటున్నా. గత రెండు సంవత్సరాల నుండి పోస్టల్ జీవిత బీమా కడుతున్న. దీని వార్షిక ప్రీమియం రూ 25 వేలు. దీనినే కడదాం అనుకుంటున్నా. మొన్ననే యు టి ఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో రూ 500 లతో మొదలుపెట్టా, దీన్ని రూ 2,000 లకు పెంచాలనుకుంటున్నాను. యాక్సిస్ యాన్యుటీ లాంగ్ టర్మ్ ఇండెక్స్ ఫండ్ లో నెలకు రూ 1,000 తో సిప్ చేద్దామనుకుంటున్నాను. ప్రస్తుతం నా దగ్గర రూ 6 లక్షలు ఉన్నాయ్. మరో రూ 4 లక్షల కోసం నెల నెలా రూ 20 వేలు రికరింగ్ డిపాజిట్ ఖాతాలో వేద్దాం అనుకుంటున్నాను. అత్యవసర నిధి కోసం నెలకు రూ 5 వేలు మదుపు చేద్దాం అనుకుంటున్నాను. పైన నా ప్లాన్ సరైనదేనా చెప్పండి?

జీవిత బీమా కోసం ఒక టర్మ్ పాలసీని ఎంచుకోవటం మంచిది. వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని......

నా వయస్సు 27, నెలసరి జీతం రూ 95,000. నెలసరి ఖర్చులు 15,000/-. నాకు ఐసిఐసిఐ లొ రూ 75 లక్షలకి టర్మ్ పాలసీ ఉంది. నెలకు రూ 2,000 పీ పీ ఎఫ్ లో , రూ 5,000 మ్యూచువల్ ఫండ్స్ లొ, అలాగే హెచ్ డి ఎఫ్ సి లో సంవత్సరానికి రూ 50,000 సూపర్ ఇన్కమ్ పాలసీ లొ పొదుపు చేస్తున్నా. నెలకు రూ 13,000/- ఈ ఎం ఐ తొ పర్సనల్ లోన్ కడుతున్నా. నవంబర్ లో నా పెళ్లి ఖర్చుల నిమిత్తం 7 లక్షలు అవసరం ఉంది. నేను పర్సనల్ లోన్ టాప్ అప్ తీసుకోవడం మంచిదా లేక పీ ఎఫ్ విత్ డ్రా చేయడం మంచిదా లేక చీటీ వేయడం మంచిదా? సలహా ఇవ్వగలరు.

టర్మ్ జీవిత బీమా మీ వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు ఉండేటట్లు చూసుకోండి. మీ ఆదాయానికి తగినట్లుగా పొదుపు లేదు. పీ పీ ఎఫ్ లో పెట్టుబడి పెంచండి. మ్యూచు......

హాయ్ సిరి, నా పేరు వెంకట శివ నేను ఓక ప్రవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను నెలకు జీతం 24000/. అయితే నా ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఓకటి మా బాబు (ప్రస్తుత వయస్సు 3 సం) ఇంజనీరింగ్ కోసం మరియు స్వతంగా మా ఊరిలో (స్వంత స్థలం 150 గజాల లో) ఇల్లు కట్టు కోవాలనీ. ప్రస్తుతానికి నేను SBI HYBRID EQUITY FUND -REG 100000/ (2 ఏళ్ళ క్రితం లంప్సమ్ లో మదుపు చేశాను) మరియు SBI Infrastructure Dir -G 5000/- (బంగారం పై రుణం తీసుకుని మదుపు చేసాను ఒకేసారి). ఇంకా సిప్ ల విషయానికీ వస్తే మొత్తం రూ. 4000/-నెలకీ క్రింది విధంగా విభజించి పెడుతున్నాను. ABSL Front Line Equity fund Dir Gr- 1000/-, అలాగే ICICI Nifty 50 Index Dir Gr - 1000, LT Mid cap Dir Gr -500, L&T India Value fund Dir Gr - 500, అలాగే TATA P/E Equity Dir Gr- 500 ఇంకా SBI Banking &Finance Dir Gr - 500. అంటే మొత్తం నెలకి 4000/- సిప్ లో మదుపు చేస్తున్నాను. ఇంక అత్యవసర నిధి కోసం ICICI Pru Liquid Fund లో 15000/- మరియు ICIC pru Blue chip Dir Gr 10000/- ఉంచాను. అలాగే LIC Bima Diamond Gold (841) బీమా హామీ రూ. 160000/- మనీ బ్యాక్ పధకం 4 ఏళ్ళకి ఒకసారి 15% (Sum assured) రూపం లో డబ్బు వెనక్కి వస్తుంది. సార్, నేను నా లక్ష్యాలను చేరుకోవడానికి నేను పైన చెప్పిన పెట్టుబడులలో మార్పులు చేర్పులు ఏమైనా చేయాలో కోంచెం తెలపగలరు. మీ సమాధానం మాకు ఇప్పుడున్న స్థితిలో ఎంత గానో ఉపయోగపడుతుంది. నా వయస్సు 29.

దీర్ఘకాల లక్ష్యాలను గుర్తించి వాటి కోసం మదుపు చేయడం చాలా మంచి ఆలోచన. ముందుగా మీ బీమా డైమండ్ గోల్డ్ పధకం గురించి తెలుసుకుందాం. ఇందులో బీమా హామీ తక్కువ......

నా పేరు జి. రామారావు. వ‌య‌సు 48 సంవ‌త్స‌రాలు, ప్ర‌భుత్వ ఉద్యోగిని, నెల‌కు 70 వేల జీతం, ఇత‌ర ఆదాయం ఏమీ లేదు. ఇద్ద‌రు అబ్బాయిలు. మొద‌టి బాబు ఇంటర్‌, రెండ‌వ బాబు 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. ఇటీవ‌లే రూ.35 ల‌క్ష‌ల‌తో స్థ‌లం కొనుగోలు చేశాను. అందులో రూ.20 ల‌క్ష‌లు రుణం తీసుకున్నాను. నెల‌వారీ ఈఎమ్ఐ రూ.27 వేలు. రూ.6 వేలు అద్దె వ‌చ్చే ఒక ప్లాట్ ఉంది. దానికి సంబంధించి రూ.13 ల‌క్ష‌ల రుణం ఉంది. నెల‌వారీ ఈఎమ్ఐ రూ.17 వేలు. ఈ ప్లాట్ ప్ర‌స్తుత విలువ రూ.35 ల‌క్ష‌లు. ప్లాట్‌, స్థ‌లంపై మొత్తంగా రూ.44 వేలు ఈఎమ్ఐ చెల్లిస్తున్నాను, వ‌డ్డీ రూ.35 వేలు. వ‌డ్డీ మొత్తం త‌గ్గించుకునేందుకు ఏమి చేయాలో తెల‌పండి?

త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు ఇచ్చే గొప్ప బ‌హ‌మ‌తి నాణ్య‌మైన విద్య‌. ఇందుకు అధిక మొత్తం అవ‌స‌రం అవుతుంది. మీ పిల్ల‌లు ఏ రంగం వైపు వెళ్ళాల‌నుకుంటున్నార......

హాయ్, నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. వార్షిక ఆదాయం రూ. 12 లక్షలు. పన్ను మినహాయింపు కోసం నెలకు రూ. 2500 ఆదిత్య బిర్లా సన్ లైఫ్ టాక్స్ రిలీఫ్ lo రూ. 2500 ఆక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ లో మదుపు చేస్తున్నాను. దానితో పాటు ఎల్ఐసి న్యూ జీవన్ ఆనంద్ లో ఏడాదికి రూ. 23000 తో రూ. 1 కోటి బీమా హామీ గల ఏగోన్ లైఫ్ టర్మ్ ప్లాన్ కోసం రూ. 10860 కడుతున్నాను, అపోలో మునిచ్ లో అమ్మ నాన్న కోసం హెల్త్ పాలసీ కి రూ. 12888 కడుతున్నాను. కానీ ఇంకు పన్ను చాలా ఎక్కువగా కట్ అవుతుంది. విద్య రుణం రూ. 50000 ఉంది. సెక్షన్ 80c కింద రూ. 1.50 లక్షల వరకు మదుపు చేశాను. నా టాక్స్ స్లాబ్ కింద 20% కట్ అవుతుంది. పన్ను ఆదా చేస్తూ మంచి రాబడి వచ్చేలాగా ఎక్కడ మదుపు చేయాలి? నా పెట్టుబడుల్లో ఏవైనా మార్పులు చేయాలా?

ముందుగా, బీమా పెట్టుబడి కలిపిన పాలసీలను సరెండర్ చేయడం మంచిది. మేరీ ఎంచుకున్న ఎల్ఐసి పాలసీ లో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, పైగా ప్రీమియం ఎక్కువ. మిగ......

హాయ్ సార్‌, నేను ప్ర‌స్తుతం ఈ కింది యులిప్స్‌, మ్యూచువ‌ల్ పండ్ల‌లో మ‌దుపు చేశాను. మిరాయ్ ఎసెట్ ఇండియా ఈక్విటీ ఫండ్ గ్రోత్ ప్లాన్ - 12 ఏప్రిల్ 2019- రూ. 20 వేలు లైఫ్ గోల్ ఎస్యూరెన్స్‌-బ‌జాజ్‌లో నెల‌కు రూ. 6000- డిసెంబ‌ర్-2018 ఏబీఎస్ఎల్ వెల్త్‌ ఎస్పైర్ 2017 లో నెల‌కు రూ. 5000 జులూ 2018. ఎల్ఐసీ - రూ. 17 వేలు, మెచ్యూరిటీ సంవ‌త్స‌రం 2025. నేను ఈ సంవత్స‌రం ఇంటిని కొనుగోలు చేయాల‌నుకుంటున్నాను. నా వ‌ద్ద దాదాపు రూ. 10 ల‌క్ష‌లు(రూ. 5 ల‌క్ష‌లు పీఎఫ్‌, మ‌రో రూ. 5 ల‌క్ష‌లు న‌గ‌దు) ఉన్నాయి. నేను నెల‌కు రూ. 20 వేలు పెట్టుబ‌డి పెట్ట‌గ‌ల‌ను. రూ. 20 వేలు ఈఎమ్ఐ చెల్లించేలా, ఇంటి కొనుగోలు ఏవిధంగా ప్లాన్ చేసుకోవాలో తెల‌పండి.

మిరాయ్‌ లిక్వీడ్ ఈక్విటీ ఫండ్ అనేది మ‌ల్టీక్యాప్ ఫండ్‌, రాబ‌డి 10.22 శాతం(1 సంవ‌త్స‌రానికి) 18.02 శాతం (మూడు సంవ‌త్స‌రాల‌కు), 17.94 శాతం( 5 సంవ‌త్స‌రా......

నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ఎస్‌బీఐ నుంచి రూ. 25 ల‌క్ష‌ల‌కు, 20 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో 8.5 శాతం ఫ్లోటింగ్ రేటుతో గృహ రుణం తీసుకున్నాను. నెల‌వారీ ఈఎమ్ఐ రూ. 22,672, ఆగ‌ష్టు 2017 నుంచి ఈఎమ్ఐ చెల్లించ‌డం ప్రారంభించాను. నాకు 10 సంవ‌త్స‌రాల స‌ర్వీసు ఉంది. నాకు రావ‌ల‌సిన బ‌కాయిలు రూ. 3 ల‌క్ష‌లు ఈ మ‌ధ్య‌నే వ‌చ్చాయి. ఈ మొత్తంతో గృహ రుణం ముంద‌స్తుగా చెల్లించ‌డం మంచిదా? వేరే చోట పెట్టుబ‌డి పెట్ట‌డం మంచిదా? నేను 30శాతం ఆదాయ‌పు ప‌న్ను స్లాబ్‌లో ఉన్నాను. తెలంగాణా ప్ర‌భుత్వం మాకు రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌డ్డీ రీయంబ‌ర్స్‌మెంట్ ఇస్తుంది. ప‌న్ను మిన‌హాయింపు, ప్ర‌భుత్వ రీయంబ‌ర్స్‌మెంట్ పోకుండా 10 సంవ‌త్స‌రాల‌లో గృహ రుణం పూర్తిగా చెల్లించాలంటే ఏవిధంగా పెట్టుబ‌డి పెట్టాలి? ఈఎమ్ఐ పెంచుకోవాలా? లేదా కాల‌ప‌రిమితి త‌గ్గించాలా? లేదా బోన‌స్ మొత్తాన్ని ప్రీ పేమెంట్ చేయాలా? తెలుప‌గ‌ల‌రు.

ప్ర‌స్తుతం మీరు ఉన్న స్థితిలో ఎటువంటి ముంద‌స్తు చెల్లింపులు చేయ‌కుండా ఈఎమ్ఐను కొన‌సాగించ‌డం మంచిది. ఈ విధంగా చేయడం వ‌ల్ల ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌......

డియ‌ర్ సిరి టీమ్‌, నా వ‌య‌సు 52 సంవ‌త్స‌రాలు, నా వార్షిక ఆదాయం రూ. 10 లక్ష‌లు, ప‌ద‌వీవిర‌మ‌ణ వ‌య‌సు 60 సంవ‌త్స‌రాలు, బ్యాంకులో తీసుకున్న గృహ రుణం రూ. 20 ల‌క్ష‌లు, వార్షికంగా రూ. 2.52 ల‌క్ష‌ల ఈఎమ్ఐ చెల్లిస్తున్నాను. 60 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌ర‌కు చెల్లించాలి. నాకు ఇద్ద‌రు పిల్ల‌లు, ఇంట‌ర్మీడియేట్‌, 10వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు; ఇంజ‌నీరింగ్‌, మొడిసిన్ చేయాల‌నుకుంటున్నారు. సెక్ష‌న్ 80 సీ కింద మిన‌హాయింపు కోసం ఈ కింది పెట్టుబ‌డులు పెట్టాను 1. ఎల్ఐసీ ప్రీమియం- వార్షికంగా రూ. 23 వేలు 2. ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను 2018లో ప్రారంభించాను - వార్షికంగా రూ. 1.5 లక్ష‌లు 3. రూ. 50 ల‌క్ష‌ల‌కు ట‌ర్మ్ ప్లాన్ తీసుకున్నాను (రూ. 50 ల‌క్ష‌ల‌ యాక్సిడెంట‌ల్ డెత్ బెనిఫిట్‌తో) 4. కార్ప‌స్ ఫండ్ కోసం రూ. 10 ల‌క్ష‌లు ఎఫ్‌డీ చేశాను ప‌ద‌వీ విర‌మ‌ణ నాటికి మా పిల్ల‌ల విద్య, వివాహం వంటి ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు త‌గిన పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక‌, ఫోర్ట్‌పోలియోల గురించి త‌గిన స‌ల‌హా ఇవ్వ‌గ‌లరు?

సాధార‌ణంగా ట‌ర్మ్ ఇన్సురెన్స్ మీ వార్షిక ఆదాయానికి 10 నుంచి 15 రెట్లు ఉండాలి. ఇప్పుడు మీరు రూ. 50 ల‌క్ష‌ల‌కు మాత్ర‌మే పాల‌సీ తీసుకున్నారు కాబ‌ట్టి అద‌......

సార్ నా పేరు అజ‌య్‌. నా వ‌య‌సు 35 సంవ‌త్స‌రాలు. నేను పోలిస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చూస్తున్నాను. నాకు ఇద్ద‌రు పిల్ల‌లు, పాప‌(6), బాబు(3). నా జీతం నెల‌కు రూ. 26 వేలు, ఇంటి క‌ర్చుల నిమిత్తం రూ. 10 వేలు, గోల్డ్ లోన్ నిమిత్తం రూ. 4 వేలు, ఎస్‌బీఐ మాగ్న‌మ్ మిడ్ క్యాప్ రూ. 2 వేలు, రిల‌య‌న్స్ స్మాల్ క్యాప్ రూ. 1 వెయ్యి, మోతీలాల్ రూ. 2 వేలు సిప్ చేస్తున్నాను. భ‌విష్య‌త్తులో మ‌రికొంత మొత్తం పెట్టుబ‌డిపెట్టాల‌నుకుంటున్నాను. మంచి ప్లానుల‌ను సూచించండి.

మిడ్‌క్యాప్‌, స్మాల్ క్యాప్ ఫండ్లు స్వ‌ల్ప కాలంలో చాలా అనిశ్చితికి గుర‌వుతాయి. మీరు మ‌రొక 10 సంవ‌త్స‌రాల‌ను పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే మంచి ఫ‌లితాల‌ను ......

Q: నమస్తే, సిరి. నేను మీరు అందిస్తున్న కథనాలను చాలా శ్రద్ధగా చదువుతున్నాను. నాకు కూడా మీ ఆర్థిక సలహాలు అవసరం అని నమ్ముతున్నాను. నాకు కొత్తగా వివాహం జరిగింది. నా ఆర్థిక పరిస్థితి ఏమి బాగాలేదు. చిన్న చిన్న అవసరాలను తీర్చుకోవడం కష్టంగా మారింది. మీరు సరైన దిశలో నన్ను నడిపిస్తారని భావిస్తున్నాను.నా నెలసరి వేతనం రూ. 47 వేలు నా భార్యా నెలసరి వేతనం రూ. 16 వేలు. నా అప్పుల‌ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1. 6 లక్షల చిట్టి - నెలకు రూ. 30 వేలు డిసెంబర్ 2019 వ‌ర‌కు చెల్లించాలి. 2. సిండికేట్ సరళ లోన్ - రూ. 2.5 లక్షలు. - నెలకు రూ. 5,785 చెల్లించాలి. లోన్ తీసుకున్న తేది. 10.08.2017 (టర్మ్ -5 స౹౹) 3. గోల్డ్ లోన్ - రూ. 1 లక్ష - వ‌డ్డీ 33పైసలు. లోన్ తీసుకున్న తేదీ. 10.11.2018. 4. గోల్డ్ లోన్ -రూ. 2.75 లక్షలు. వ‌డ్డీ 77 పైసలు. లోన్ తీసుకున్న తేదీ. 15.09.2018 4. స్కూటర్ లోన్ - 11నెలల పాటు రూ. 4 వేలు చెల్లించాలి.01.01.2020 నుంచి. బయట వ్యక్తులకు అప్పులు - 5. రూ. 30 వేలు, నెలకు వ‌డ్డీ రూ.3 6. రూ. 70 వేలు నెలకు వ‌డ్డీ రూ. 2 స్నేహితులకు - 7. రూ. 50 వేలు, వ‌డ్డీ లేదు. నాకు జీవిత బీమా కానీ, ఆరోగ్య బీమా కానీ ఏమీ లేవు. ఇంకో 2 సంవ‌త్స‌రాల‌లో నా అప్పులు అన్ని తీర్చేసి ఆర్థిక పరిస్థితి బాగుపరుచు కోవాలంటే ఏమి చేయాలి?

అన్నింటి కంటే ముందుగా ఒక ట‌ర్మ్ పాల‌సీని తీసుకోండి. మీ వార్షిక ఆదాయాన‌కి 12 నుంచి 15 రెట్లు ఎక్కువ‌ హామీ మొత్తంతో మీ 60 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌ర‌కు పాల......

హ‌లో ఈనాడు సిరి, మీరు అందించే ఆర్టిక‌ల్స్‌తో నాకు ఆర్థిక విష‌యాల‌పై ఆస‌క్తి పెరుగుతోంది. పెట్టుబ‌డుల విష‌యంలో నాకు ఒక సందేహం ఉంది. భ‌విష్య‌త్తుకు భ‌రోసానివ్వ‌డంతో పాటు ప‌న్ను ఆదా చేసుకునేలా ఎందులో పెట్టుబ‌డులు పెట్టాలి? ఇప్పుడు నా వ‌య‌సు 25 సంవ‌త్స‌రాలు, వేత‌నం రూ.45 వేలు. పెళ్లి కాలేదు. నేను ఇప్ప‌టివ‌ర‌కు ఎందులో పెట్టుబ‌డులు పెట్ట‌లేదు. గ‌త కొంత కాలం నుంచి ప‌న్ను ఆదా చేసే ప‌థ‌కాల గురించి ప‌రిశీలిస్తున్నాను. నేను పని చేస్తున్న కంపెనీలో నాకు, మా త‌ల్లిదండ్రుల‌తో క‌లిపి ఆరోగ్య బీమా పాల‌సీ ఉంది . ఇది కాకుండా మ‌రొక పాల‌సీ తీసుకోవాలా? సంవ‌త్స‌రానికి రూ. 10-12 వేలు ప్రీమియంతో ఎల్ఐసీ పాల‌సీ తీసుకుంటే ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని తెలిసిన‌వారు చెప్పారు. దీంతో లాభంతో పాటు ప‌న్ను ఆదాయం కూడా ల‌భిస్తుంద‌ని చెప్తున్నారు. ఇది నిజ‌మేనా? నాకు అయితే పీపీఎఫ్‌లో పొదుపు చేయాల‌ని ఉంది. ఎందుకంటే ఇందులో రిస్క్‌ ఏమి ఉండ‌దు అదేవిధంగా ఎంతైనా డిపాజిట్ చేయ‌వ‌చ్చు. దీనిలో పెట్టుబ‌డులు స‌రైన‌వేనా? ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు కాబ‌ట్టి ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డులు పెట్టాలా . మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో రిస్క్ ఉంటుంద‌ని విన్నాను కాని ఈఎల్ఎస్ఎస్ లో పెట్టుబ‌డుల‌కు ప‌న్ను ఆదా ఉంటుంది కాబ‌ట్టి పెళ్లివ‌ర‌కు అంటే మూడేళ్ల పాటు ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డులు పెట్టాలా ఇది స‌రైనదేనా? సూచించ‌గ‌ల‌రు

మా సిరి క‌థ‌నాల‌ను చదువుతున్నందుకు ధ‌న్య‌వాదాలు. ఇక మీ పెట్టుబ‌డులు విష‌యానికొస్తే మొద‌ట మీరు చేయ‌వ‌ల్సింది మీ త‌ల్లిదండ్రుల‌కు కూడా క‌లిపి వ‌ర్తించే ......

సర్, న పేరు నీలేష్, నాకు 40 ఏళ్ళు. ఇప్పటి వరుకు పొదుపు చెయ్యలేదు. నాకు ఒక బాబు ఇంకా పాప, బాబు 8, పాప 4 ఏళ్ళు. నాకు నెలకి రూ. 78000 వస్తుంది. ఇందులో రూ. 27000 ఇంటి రుణానికి, రూ. 5500 కార్ రుణానికి, స్కూల్ ఫీజు కి ఏడాదికి రూ. 1,60,000 కట్టాలి. ఇంకా మొత్తం అన్ని ఖర్చులు కలిపి మొత్తం ఒక రూ. 5000 నెలకి సేవ్ చెయ్యగలను. నేను రిటైర్మెంట్ కి, పిల్లల చదువు/పెళ్లికి ఎలా పొదుపు చెయ్యాలో చెప్పగలరు. మ్యూచువల్ ఫండ్స్ లో సిప్ ఇంకా లంప్సమ్ లో సేవ్ చెయ్యాలంటే ఎలా చెయ్యాలి.

మీరు మీ పదవీ విరమణ కోసం ఎన్పీఎస్ పధకం లో మదుపు చేయడం ఆరంభించండి. ఇతర ఆర్ధిక లక్షయాల కోసం మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయండి. ఒక లార్జ్ కాప్, ఒక బ్యాలన్సుడ......

నేను ఒక స్కూల్ టీచ‌ర్‌ని. మే 1,2017 న విధుల్లోచేరాను. జూన్ నెల నుంచి పీఎఫ్ ఈఎస్ఐ కోసం రూ.1100 క‌ట్ అవుతోంది. మొత్తం రూ.7000 కు రూ.5945 వ‌స్తుంది. ఏంట‌ని అడిగితే సీసీఏ అంటున్నారు. కానీ ఇంత వ‌ర‌కూ పీఎఫ్ నంబ‌ర్ కానీ ఈఎస్ఐ కార్డు కానీ ఇవ్వ‌లేదు. అడిగితే ఇస్తామంటున్నారు కానీ ఇవ్వ‌డంలేదు పీఎఫ్ నంబ‌రు ఇచ్చిన వారికి మాత్రం వారి ఖాతాల్లో రూ.2000 డిపాజిట్ అయింది. ఎవ‌రిని అడ‌గాలో ఎవ‌రికి ఫిర్యాదు చేయాలో తెలియ‌దు. నాకు కొంచె వివ‌రాలు చెప్ప‌గ‌ల‌రు.

సీసీఏ అంటే సీటీ కాంపెన్సేట‌రీ అలెవెన్స్, ఇది ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు అద‌న‌పు ఖ‌ర్చుల‌కు ఇచ్చే మొత్తం. ఈ మొత్తం ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్......

హలో సిరి, నా బ్యాంకు ఖాతాలో రూ. 20లక్షలు ఉన్నాయి. నా జీతం నెలకు రూ. 32,000. ఇటీవలే నేను ముందస్తుగా రూ. 3 లక్షలు చెల్లించి ఒక ఫ్లాట్ ను బుక్ చేశాను. ఇంకా రూ. 10 నుంచి రూ. 12 లక్షలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మిగిలిన మొత్తానికి గాను రూ. 30 లక్షలు గృహ రుణం తీసుకోవాలని భావిస్తున్నాను. ఫ్లాట్ కోసం చెల్లించగా మిగిలిన మొత్తంతో రూ. 7.5 లక్షలు విలువ చేసే కారును కొనాలని అనుకుంటున్నాను. దీని కోసం నా దగ్గర ఉన్న మొత్తాన్ని చెల్లించడం మంచిదా లేదా కారు రుణం తీసుకోవడం మంచిదా? ఒకవేళ నేను రూ. 3 నుంచి రూ. 4 లక్షల కారు రుణం తీసుకున్నట్లైతే, అది గృహ రుణ మంజూరుపై ప్రభావం చూపుతుందా? ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియచేయగలరు. నాకు ఉద్యోగం తప్ప ఇతర ఆదాయ మార్గాలు లేవు. ఉద్యోగం పోతుందనే టెన్షన్ లేదు. నాకు ఇంకా వివాహం కాలేదు. నేను నెలకు రూ. 3500 ఈఎల్ఎస్ఎస్ లో సిప్ ద్వారా పెట్టుబ‌డి చేస్తున్నాను. అలాగే ఎల్ఐసీ పాలసీలో రూ. 5 లక్షల హామీ మొత్తానికి గాను సంవత్సరానికి రూ. 24000 చెల్లిస్తున్నాను. నాకు రూ. 5 లక్షల కవరేజ్ తో ఆరోగ్య బీమా కూడా ఉంది.

ఒకవేళ మీ తల్లిదండ్రులు మీ పై ఆధారపడి జీవిస్తున్నట్లైతే, ముందుగా మీ వార్షిక ఆదాయానికి 10 నుంచి 15 రెట్లు హామీ మొత్తానికి టర్మ్ బీమా పాలసీని తీసుకోవడం ......

నాపేరు దినేష్. మా నాన్న గారు జులై లో ఆదాయ‌ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేశారు. సెప్టెంబ‌రు 19 న మ‌ర‌ణించారు. డిసెంబ‌రులో ఆదాయ‌ప‌న్ను శాఖ‌నుంచి వ‌చ్చిన రిఫండ్ చెక్ తిరిగి వెళ్లింది. మా నాన్న గారు లేక‌పోవ‌డంతో పోస్ట్ మ్యాన్ చెక్ తిరిగి పంపిచిన‌ట్లు పేర్కొన్నారు. నేను ఆ మొత్తం కోసం ఆన్లైన్‌లో ఆదాయ‌ప‌న్ను శాఖ వారికి విజ్ఞ‌ప్తి చేశాను. అయితే అడ్ర‌స్ లేద‌ని చూపిస్తుంది. నా పేరు మీద ఆ చెక్ రావాలంటే ఏం చేయాలి. వ‌చ్చే అవ‌కాశం ఉందా తెలుప‌గ‌ల‌రు.

మీరు ముందుగా పోస్టాఫీసు కార్యాల‌యానికి వెళ్లి సంప్ర‌దించండి. కొన్ని సంద‌ర్భాల్లో పోస్ట్‌మాస్ట‌ర్ మీకు స‌హ‌క‌రించ‌వ‌చ్చు. లేదంటే ఆదాయ‌ప‌న్ను శాఖ కార్యా......

డియర్ సర్, డబ్బు సంపాదించాక ఇల్లు కట్టుకోవడం మంచిదా లేదా ఇప్పుడే రుణం(50 to 60 శాతం) తీసుకొని ఇల్లు కొనడం మంచిదా? కేసు 1: ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు. నేను 10 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి, 10 నుంచి 12 శాతం వడ్డీ వచ్చే పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెట్టి అనంతరం ఇల్లు కొనుక్కోవడం. కేసు -2: ఇప్పుడు ఇంటి రుణం తీసుకుని ఇల్లు కొనుక్కుని, నాకొచ్చే సంపాదనలో 60 శాతం ఇంటి రుణానికి చెల్లించి, 10 శాతం పొదుపు చేయడం. ఈ రెండింటిలో ఏది మంచి ఆప్షనో తెలియచేయగలరు. నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, మన దేశంలో ప్రతి ఒక్కరి మొదటి లక్ష్యం ఉద్యోగం, తరువాత సొంత ఇల్లు కొనుక్కోవడం. పైన తెలిపిన రెండు కేసుల ఆధారంగా 10 సంవత్సరాల తరువాత ఎవరు ఎక్కువ సంపాదిస్తారు?

ఎవరైతే వారి సొంత ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ, అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లడం ఇష్టం లేదో అలాంటి వారు మొదటగా కొంత మొత్తాన్ని పొదుపు చేసి, 3 నుంచి 4 స......

ముందుగా సిరి కి నా హృదయ పూర్వక ధన్యవాదములు.. నా పేరు కుమార్ వయసు 31 నేనొక ఎమ్ఎన్‌సీ కంపెనీ లో 5 ఏళ్ల‌ నుంచి పనిచేస్తున్నాను జీతం రూ.45,000/ చెల్లి పెళ్లి తదితర కారణాల వల్ల ఎటువంటి పొదుపు చేయలేకపోయాను. ఈ సంవత్సరం నాకు పెళ్లి జరగొచ్చు.. ఎటువంటి అప్పులు లేవు.. భవిష్యత్ అవసరాల కోసం బ్యాంక్ లోన్ పెట్టుకుని ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాను. రూ.15 - 20 ల‌క్ష‌లు రుణం తీసుకున్నా నెల‌కు 15 - 18 వేలు ఈఎమ్ఐ కట్టగలను అనుకుంటున్నా. అయితే నేను అనుకున్న బడ్జట్లో ఏదైనా ఫ్లాట్/హౌస్ కొనడం కష్టం అనిపిస్తుంది.. దీనికి బ‌దులు స్థ‌లం తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. కానీ భూమి తీసుకుంటే హోమ్ లోన్ రాదు కాబట్టి ప‌ర్స‌న‌ల్ లోన్ వల్ల ఈఎమ్ఐ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోతుంది... నాకు ఈ పరిస్థితుల్లో (లాండ్ కొనుటకు) హోమ్ లోన్ వచ్చే అవకాశం కానీ.. లేదా ఏదైనా ఇత‌ర సలహా సూచించగలరు. నాకు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఆలోచన ఉంది అయితే వాటిపై అంత అవగాహన లేదు. ఎలా పెట్టాలి ?ఎన్ని సంవ్సరాలకి పెట్టాలి? వీటి పెట్టుబడులు గురించి అవగాహన పొందుటకు మార్గాలు తెలుపగలరు.. వీటితో పాటు నా తల్లిదండ్రులు మా గ్రామంలో ఉంటారు. నాన్నగారు వ్యవసాయం, ఆస్తిపాస్తులు ఏమి లేవు. ప్రస్తుతం వారికి మా కంపెనీ అందించే 3 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా పాల‌సీ ఉంది.అమ్మకు ఎల్ఐసీ బీమా పాలసీ ఉంది. 5 ఏళ్ల త‌రువాత‌ నేను వారి అవసరాలు చూడాల్పి రావచ్చు. దాని నిమిత్తం నేను ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలో తెలియచేయండి (అసలు నా ఉద్దేశ్యం ఏదైనా ఫ్లాట్/హౌస్ తీసుకుంటే దాని మీద వచ్చే ఏదైనా సంపాదన నా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది అని, కానీ నా బడ్జెట్ 20 ల‌క్ష‌ల‌కు మించి లేదు. ఈ బడ్జెట్ లో ఫ్లాట్ కొనడం కష్టం అని స్థలం కొందామ‌ని నిర్ణ‌యించుకున్నాను.. నా ద్దగ్గర ప్రస్తుతం 5 ల‌క్ష‌ల‌ వరకు డ‌బ్బు ఉంది. నా ఆలోచనకు సరైన మార్గం వేయగలరు.

ముందుగా మీరు ట‌ర్మ్ బీమా పాల‌సీ ని తీసుకోండి. మీ వార్షిక ఆదాయానికి క‌నీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మ‌రో 30 ఏళ్ల పాటు పాల‌సీని కొన‌సా......

హలో సిరి, నా వయస్సు 27 సంవత్సరాలు. నాకు ఇంకా వివాహం కాలేదు. నేను నెలకు రూ. 70000 జీతం సంపాదిస్తున్నాను. 1) నేను 21 సంవత్సరాల కాలపరిమితికి గాను నెలకు రూ. 2200లతో ఏల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీని తీసుకున్నాను. 2) నెలకు రూ. 7000 (జీతంలో 10 శాతం)లను ప్రజా భవిష్య నిధికి చెల్లిస్తున్నాను. 3) మా తల్లిదండ్రుల కోసం నెలకు రూ. 7000 (జీతంలో 10 శాతం)లను పొదుపు చేస్తున్నాను. 4) అత్యవసర నిధి కింద నెలకు రూ. 7000 (జీతంలో 10 శాతం) లను పొదుపు చేస్తున్నాను. 5) నెలకు రూ. 15000లను చిట్ ఫండ్స్ లో పెట్టుబడిగా పెడుతున్నాను. 6) ప్రస్తుతం నేను నెలకు రూ. 10000 లను మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నాను. మిగిలిన మొత్తాన్ని నా వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటాను. దయచేసి నేను కింద అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలుపగలరు : 1) నేను ఎంచుకున్న ఆర్ధిక ప్రణాళిక సక్రమంగానే ఉందా? లేదా ఏదైనా మార్పులు చేసుకోవాలా దయచేసి చెప్పగలరు? 2) మంచి రాబడులు పొందడానికి మ్యూచువల్ ఫండ్స్ లో నెలకు రూ. 10000లను ఎలా పెట్టుబడిగా పెట్టాలి? 3) పైన తెలిపిన పెట్టుబడులతో పాటు టర్మ్ పాలసీ తీసుకోవడం మంచి ఆలోచనేనా?

35 సంవత్సరాలకు గాను మీ వార్షిక ఆదాయానికి 10 నుంచి 12 రెట్లు అధిక మొత్తంతో ఒక టర్మ్ పాలసీని తీసుకోవలసిందిగా సూచిస్తున్నాము. దానికి అదనంగా కొన్ని రైడర్ల......

నాకు మార్చి, 2018లో ఉద్యోగం వచ్చింది. నా జీతం నెలకు రూ. 1,05,000. ఇటీవల మీరిచ్చిన సలహా మేరకు నేను రూ. 12000 విలువ గల ఐదు మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేశాను. గందరగోళంలో ఉన్న నాకు అమూల్యమైన సలహాను ఇచ్చి సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. 1. రూ. 25000 / నెలకు - ఐసీఐసీఐ మాగ్జిమైజర్ వీ (మార్చి 2018, 7 సంవత్సరాల వరకు) 2. రూ. 12000 / నెలకు - ఐదు మ్యూచువల్ ఫండ్స్ (సిరి బృందం సూచించబడింది, 10 సంవత్సరాల వరకు) 3. రూ. 3000 / నెలకు - ప్రజా భవిష్య నిధి 4. రూ. 4000 / నెలకు - లైఫ్ ఇన్సూరెన్సు కార్పొరేషన్ (ఇంకా తీసుకోవాల్సినవి) 5. రూ. 10000 / నెలకు - చిట్ ఫండ్స్ (3 సంవత్సరాల వరకు) 6. రూ. 8000-10000 / నెలకు - రూ.1 లక్ష వరకు పొదుపు (అత్యవసర పరిస్థితుల్లో నగదు కొరకు) ప్రస్తుతం నా వయస్సు 23 సంవత్సరాలు. నాకు ఇంకా వివాహం కాలేదు. నెలకు నేను రూ. 20,000 (ఇంటి అద్దె, ఆహరం, ఇంటి అవసరాలు కలుపుకుని) ఖర్చు చేస్తున్నాను. అలాగే రూ. 1 లక్ష వ్యక్తిగత రుణం నిమిత్తం నెలకు రూ. 8000 చెల్లిస్తున్నాను. ప్రస్తుతం నాకు ఎలాంటి బాధ్యతలు లేవు, అలాగే నాకంటూ ఎలాంటి ఆస్తులు కూడా లేవు. నేను మిమల్ని రెండు ప్రశ్నలు అడగదలచుకున్నాను. దయచేసి సహాయం చేయగలరు. 1. జూన్ 2018 నుంచి నేను పైన తెలిపిన పొదుపు వ్యూహాలను అనుసరించినట్లైతే 7 నుంచి 10 సంవత్సరాల్లో రూ.1 కోటి లను సంపాదించగలనా? 2. నెలకు నేను రూ. 13000 లను అద్దెగా చెల్లిస్తున్నాను. నేను 100 శాతం గృహ రుణం తీసుకొని, ఆ ఇంటిని అద్దెకు ఇవ్వొచ్చా? ఈ రెండు ప్రశ్నలకు మీరు సమాధానం ఇచ్చినట్లయితే నేను మీకు కృతజ్ఞుడిగా ఉంటాను. ఇటీవల మీ వెబ్ సైట్ లో రాసిన "రెండవ ఇంటిని కొనుగోలు చేస్తున్నారా?" అనే ఆర్టికల్ ను చదివాను. అది నాకు బాగా నచ్చింది. ఇందులో చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందించారు. ఆర్టికల్ రాసిన వారికి నా కృతఙ్ఞతలు.

సరైన పథకం ప్రకారం ధనవంతుడిగా మారడానికి మీరు చూపిస్తున్న చొరవను మేము అభినందిస్తున్నాము. మీ ప్రశ్నలకు కింద సమాధానం తెలియచేస్తున్నాము: a) 10 సంవత్సరాల ......

సర్! నా పేరు ఫ‌ణీంద్ర. నేను 2010 నుంచి టాటా స్టీల్ కంపెనీలో ప‌ని చేస్తున్నాను. నాకు రూ.30 వేలు జీతం. నా భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ఇప్ప‌టి వ‌ర‌కూ నేను ఒక్క రూపాయి కూడా పొదుపు చేయ‌లేదు. కానీ నాకు ఎల్ఐసీలో 20 ఏళ్ల కాల వ్య‌వ‌ధి గ‌ల జీవ‌న్ ఆనంద్ పాల‌సీ ఉంది. దీనికి నేను ఏటా రూ.53 వేలు క‌డుతున్నాను. నాకు ఏడాది వ‌య‌సు గ‌ల కూతురు ఉంది. వ్య‌క్తిగ‌త రుణాల‌ వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కూ నేను పొదుపు చేయ‌లేక‌పోయాను. కానీ ఇప్ప‌టి నుంచి నెల‌కు రూ.2 వేలు పెట్టుబడిగా పెట్టాల‌నుకుంటున్నాను. మ్యూచువ‌ల్ ఫండ్ల గురించి విన్నాను. వేటిలో పెడితే నాకు మంచి రాబ‌డులు వ‌స్తాయో తెలుప‌గ‌ల‌రు. 5 నుంచి 7 ఏళ్ల‌లో నేను ఒక మంచి సెడాన్ కార్ కొనాల‌నుకుంటున్నాను. అలాగే నా కూత‌రును మంచి చ‌దువులు చ‌దివించాల‌నుకుంటున్నాను. కొంత భూమి కూడా కొనాల‌నుకుంటున్నాను. ఈ ఏడాది ఆగ‌స్టులో మా వేత‌నాన్ని స‌వ‌రించ‌నున్నారు. దీనివ‌ల్ల నా నెల జీతం క‌నీసం రూ.5 వేలు పెరుగుతుంద‌ని భావిస్తున్నాను. నేను ఎక్క‌డ పెట్టుబ‌డులు పెట్టాలి. నాకు అత్య‌వ‌ర వైద్యంతో పాటు, నా కుటుంబ‌మంత‌టికీ ఆరోగ్య బీమా వ‌ర్తించేలా, శ‌స్త్ర చికిత్స‌లు, ఇత‌ర అవ‌స‌రాలు తీరేలా స‌ల‌హాలు ఇవ్వ‌గ‌ల‌రు. అలాగే ట‌ర్మ్ పాల‌సీ కూడా తీసుకోవాల‌నుకుంటున్నాను. నాకు త‌గిన స‌ల‌హాలివ్వ‌గ‌ల‌రు.

## ట‌ర్మ్ పాల‌సీ తీసుకోండి.. మీరిచ్చిన వివ‌రాల‌ను బ‌ట్టి చూస్తే మీరు ఎండోమెంట్ అండ్ హోల్ లైఫ్ పాల‌సీ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎండోమెంట్ పాల‌సీల‌లో ......

నేనొక బ్యాంక్ ఎంప్లాయ్. నా భార్య కూడా బ్యాంక్ ఎంప్లాయ్. ఇద్దరికి కలిపి గ్రాస్ శాలరీ రూ.85 వేలు వస్తుంది. డిడ‌క్ష‌న్లు రూ.8 వేలు . బ్యాంక్ ఇంటి రెంట్ లీజ్ రూపం లో ఇస్తుంది. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో(ఈక్విటీ) నెల కు రూ. 21,500 పెట్టుబ‌డి చేస్తున్నాం. నాకు రూ. 50 ల‌క్ష‌ల టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. ఎల్ఐసీ పాల‌సీ నా పేరు మీద రూ.12 లక్షలు, నా భార్య పేరు మీద రూ. 4 లక్షలు ఉన్నాయి. పోస్టల్ ఇన్సూరెన్స్ నాకు రూ. 3 ల‌క్ష‌లు తనకిరూ. 6 లక్షలకి ఉన్నాయి. రెలిగర్ హెల్త్ ఇన్సూరెన్స్లో రూ. 5 లక్షల హెల్త్ పాలసీ ఉంది. మాకు స్టాఫ్ హోసింగే లోన్ రూ. 80 లక్షల దాకా వస్తుంది. ఈ సంవత్సరo ఆఖరులోతీసుకుందాం అనుకుంటున్నాం. దానికి 30 వేల రూపాయలు ఈఎమ్ఐ పోతుంది. పిల్లలు లేరు. ఇంటి ఖ‌ర్చులు,ఇత‌ర ఖ‌ర్చులు రూ. 20వేలు అవుతున్నాయి. మాకు స‌రిపోయే ఆర్ధికసలహా ఇవ్వ గలరు.

ట‌ర్మ్ పాల‌సీల‌తో పోలిస్తే ఎండోమెంట్ పాల‌సీలు అధిక ప్రీమియంతోనూ త‌క్కువ బీమా హామీతోనూ వ‌స్తాయి. మీ పాల‌సీలు ఒక సారి ప‌రిశీలించి రాబ‌డి అంత బావుండక‌పో......

నేను రూ.1.50 ల‌క్ష‌లు ఎస్‌బీఐ మాగ్న‌మ్ నెలవారీ ఆదాయం పథకం లో డిపాజిట్ చేసి సిస్ట‌మేటిక్ విత్‌డ్రాయ‌ల‌న్ ప్లాన్ ద్వారా ఎంత డబ్బు వెనక్కి తీసుకోవచ్చో తెలుపుగ‌ల‌రు. మ‌రో 5 సంవత్సరాల పాటు రూ. 1.50 ల‌క్ష‌లను తీయ‌కుండా ప్ర‌తీ మూడు నెల‌ల‌కు ఒక‌సారి డ‌బ్బు తీసుకోవాల‌ని అనుకుంటున్నాం. సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్, ఎమ్ఐపీ (ఎస్‌డ‌బ్ల్యూపీ),డెట్ ఫండ్లల‌ను పోల్చి చూస్తే ఏవి నాకు అనుకూలమో తెలుప‌గ‌ల‌రు. ఈ ప్రశ్న మీరిచ్చే జ‌వాబు ప్రతీ సీనియర్ సిటిజ‌న్ కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నేను భావిస్తున్నాను.

ఎస్‌బీఐ మాగ్నమ్ (ఎమ్‌పీఐ), సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్, డెట్ ఫండ్ల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ## సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్......

నా పేరు మ‌ణికంఠ. వ‌య‌సు 28 ఏళ్లు. ఒక ప్రైవేటు బ్యాంకులో ప‌నిచేస్తున్నాను. నా వార్షిక వేత‌నం రూ.7.5 ల‌క్ష‌లు. నేను 2013 నుంచి ఉద్యోగం చేస్తున్నాను. అప్ప‌టి నుంచి మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేస్తున్నాను. ప్ర‌తీ నెల రూ.15,000 సిప్ విధానంలోమ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తున్నాను. ట‌ర్మ్ పాల‌సీ రూ.75 ల‌క్ష‌లకు ఉంది.దీనికి క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌రేజీ ఉంది. నేను ప‌నిచేసే బ్యాంకు రూ. 4ల‌క్ష‌ల‌కు ఆరోగ్య బీమా ఇచ్చింది. ఈ మ‌ధ్య‌నే నాకు వివాహం జ‌రిగింది. నాకు స‌రిపోయే విధంగా ఆర్థిక స‌ల‌హాను సూచించ‌గ‌ల‌రు. నా ఆర్థిక ల‌క్ష్యాలు సొంతిల్లు,పిల్ల‌ల ఉన్న‌త విద్య‌,కారు కొనుగోలు. నేను గృహ రుణం పొందేందుకు అర్హ‌త క‌లిగి ఉన్నాను. మా బ్యాంకు అందించే స్టాప్ హౌసింగ్ లోన్ ప‌థ‌కం కింద నాకు రుణం వ‌స్తుంది.ఇప్పుడు నేను ఇళ్లు కొనుగోలు చేయాలా లేదా తెల‌ప‌గ‌ల‌రు. లేదా స్థ‌లం కొనుగోలు చేయాలా. నా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేసిన సంప‌ద‌ను ఉప‌యోగించి స్థ‌లం కొనుగోలు చేయడం మంచిదేనా తెలుప‌గ‌ల‌రు.

మీ బీమా ట‌ర్మ్ పాల‌సీ మొత్తం స‌రిపోతుంది. అత్య‌వ‌స‌ర నిధి కింద కొంత మొత్తాన్ని లిక్విడ్ ఫండ్ల‌లో లేదా ఫిక్సిడ్ డిపాజిట్ లో ఉంచుకోండి. మీరు ఇప్ప‌టికే ......

నా వ‌య‌సు 29. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాను. భార్య గృహిణి. ఈ ఏడాదిలో పిల్ల‌ల కోసం ప్లానింగ్ చేస్తున్నాం. నా నెల సంపాద‌న సుమారు రూ.60వేలు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఇన్వెస్ట్ చేద్దామ‌నుకుంటున్నాను. నా ఆర్థిక వివ‌రాలు ఇలా ఉన్నాయి... వేత‌నం - నెల‌కు రూ.55వేలు, వ్య‌క్తిగ‌త రుణ వాయిదా నెల‌కు రూ.16,700. ఇది మార్చి 2020తో తీరిపోతుంది. కుటుంబ ఖ‌ర్చుల‌కు రూ.20వేలు అవుతున్నాయి. ఎల్ఐసీ లో జీవ‌న్ రూ.5ల‌క్ష‌ల‌కు జీవ‌న్ ఆనంద్ పాల‌సీ తీసుకున్నాను. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోలో రూ.1ల‌క్ష యాక్సిడెంట‌ల్ క‌వ‌రేజీ పాల‌సీ ఉంది. ఇది కాకుండా పోస్టాఫీసులో 5ఏళ్ల ట‌ర్మ్ డిపాజిట్ ఖాతాలో రూ.1ల‌క్ష ఉంది. రూ.50వేల విలువ చేసే జాతీయ పొదుపు ప‌త్రాలున్నాయి. ఇంకా ఆన్‌లైన్‌లో రూ.1కోటి విలువ చేసే ఇ-ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవాల‌నుకుంటున్నాను. 15ఏళ్ల దాకా నెలకు రూ.5వేలు సంపాదించాల‌నుకుంటున్నాను. ఎలాంటి మ్యూచువ‌ల్ ఫండ్లు ఎంచుకుంటే మంచిదో తెలుప‌గ‌ల‌రు.

మీది చిన్న వ‌య‌సు. 15ఏళ్ల‌పాటు సిప్‌ను కొన‌సాగించ‌వ‌చ్చు. 40శాతం లార్జ్‌క్యాప్ ఫండ్ల‌లో, 40శాతం డైవ‌ర్సిఫైడ్ ఫండ్లు లేదా ఈఎల్ఎస్ఎస్‌ల‌లో పెట్టుబ‌డి పె......

నాకు 57ఏళ్లు. రూ.కోటి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి దానిపై 6.5శాతం వ‌డ్డీ వ‌స్తుంద‌నుకుంటే నెల‌కు సుమారు రూ.50వేలు ఇంటి ఖ‌ర్చుల‌కు పోను మిగ‌తాది ఇన్వెస్ట్ చేద్దామ‌నుకుంటున్నాను. సిప్ ద్వారా ఇలా మిగులు మొత్తాన్ని 30ఏళ్ల పాటు పెడ‌దామ‌నుకుంటున్నాను. ఇది కాకుండా మ‌రో రూ.20ల‌క్ష‌లు ఉన్నాయి. అయితే దీన్ని లంప్‌స‌మ్‌గా 4 అల్ట్రా షార్ట్ ట‌ర్మ్ లేదా లిక్విడ్ ఫండ్ల‌లో చెరో రూ.5ల‌క్ష‌ల చొప్పున పెట్టి ఎస్టీపీ ద్వారా 4 బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌కు పంపించి ఆ త‌ర్వాత రూ.5వేలు సిస్ట‌మెటిక్ విత్‌డ్రాయ‌ల్ ప్లాన్ ద్వారా ఏడాదిపాటు వ‌స్తుంది అని విన్నాను. ఎఫ్‌డీ సొమ్ము రూ.50వేలు, ఈ రూ.20వేలు మొత్తం రూ.70వేలు వ‌స్తాయి. దీంట్లో రూ.30వేలు ఇంటి ఖ‌ర్చుల‌కు పోను తిరిగి రూ.40వేలు పెట్టుబ‌డిగా పెడ‌దామ‌నుకుంటున్నాను. ఈ విష‌యంలో స‌రైన స‌ల‌హా ఇవ్వ‌గ‌ల‌రు.

మీరు అనుకున్న ప్ర‌ణాళిక బాగుంది. కావాల‌నుకుంటే ఈ కింది ఆప్ష‌న్ల‌ను కూడా ప‌రిశీలించ‌గ‌ల‌రు. 1. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో గ‌రిష్టంగా రూ.25ల‌క్ష‌లు. వీటిప......

మా నాన్నగారి ఆర్థిక ప్ర‌ణాళిక గురించి త‌గిన స‌ల‌హా ఇవ్వ‌గ‌ల‌రు. ఆయ‌న త్వ‌ర‌లో రిటైర్ కాబోతున్నారు. పింఛ‌ను డ‌బ్బు రూ.80ల‌క్ష‌ల దాకా రానుంది. దీంట్లో రూ.40ల‌క్ష‌లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించాల‌నుకుంటున్నాం. మ‌రో 40ల‌క్ష‌ల్లో చెరో 10ల‌క్ష‌లు చొప్పున 3 బ్యాలెన్స్‌డ్ ఫండ్ల‌లో, 1 ఈక్విటీ ఫండ్ల‌లో పెడ‌దామ‌నుకుంటున్నాం. బ్యాంకు ఎఫ్‌డీల నుంచి నెల‌కు రూ.25వేలు వ‌డ్డీ రావొచ్చు. ఫండ్ల ద్వారా ఎస్‌డ‌బ్ల్యూపీ విధానంలో రూ.40వేలు రావొచ్చు అనుకుంటున్నాం. మొత్తంగా రూ.65వేలు నెల‌కు రావొచ్చు. దీనికి అద‌నంగా రూ.13వేలు పింఛ‌ను వ‌స్తుంది. ఈ మొత్తంలో 40వేలు ఇంటి ఖ‌ర్చుల‌కు పోగా మిగ‌తా 38వేలు మ‌రిన్ని ఈక్విటీ ఫండ్ల‌లో పెడ‌దామ‌నుకుంటున్నాం. దీన్ని 20-30ఏళ్ల పాటు కొన‌సాగించాల‌నుకుంటున్నాం. మా కుటుంబానికంత‌టికీ స‌రిపోయే ప్ర‌ణాళికను సూచించ‌గ‌ల‌రు.

మీరు ఎవ‌రైనా మంచి అర్హ‌త క‌లిగిన ఆర్థిక స‌ల‌హాదారును లేదా చార్ట‌ర్డ్ అకౌంటెంట్‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు. వారితో నేరుగా సంప్ర‌దించ‌డం వ‌ల్ల పెట్టుబ‌డులు, ......

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ప్రతి 6నెల‌లు లేదా ఏడాదికోసారి స‌మీక్షించాలంటారు. నెల‌కు రూ.10వేల చొప్పున ఏడాది పాటు రూ.1.2ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టాక ఇత‌ర ఫండ్ల‌కు మారే క్ర‌మంలో చ‌క్ర‌వ‌డ్డీ ఫ‌లితాల‌ను కోల్పోతానా? ఎక్కువ రాబ‌డి రాకుండా కొంచెం సొమ్ముకే ప‌రిమిత‌మ‌వుతానా? ప‌్ర‌స్తుతం కొన‌సాగిస్తున్న ఫండ్ ప‌నితీరు ఆశాజ‌న‌కంగా లేక‌పోతేనే ఇలాంటి నిర్ణ‌యం తీసుకుందామ‌నుకుంటున్నాను. దీనిపై స్ప‌ష్ట‌త‌నివ్వ‌గ‌ల‌రు.

చ‌క్ర‌వ‌డ్డీని వార్షికంగా లెక్కిస్తారు. దీర్ఘ‌కాలంపాటు పెట్టుబ‌డి పెడితే రాబ‌డి అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉంటాయి. మీర‌డిగిన‌ సందేహానికి స‌మాధానం భ‌విష్య‌......

మాకు ఇద్దరు అమ్మాయిలు, 6 , 4 సంవత్సరాల వయసు. వారి భవిష్యత్తు కోసం ఒక్కొక్కరికీ నెల నెలా రూ. 5000 పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నాను. ఇలా 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టగలను. ప్రస్తుతానికి బీమా పాలసీలకు సంవత్సరానికి రూ. 1,20,000 చెల్లిస్తున్నాను, పీపీఎఫ్ లో నెలకు రూ. 1000, పెద్ద అమ్మాయి పేరుతో పోస్ట్ ఆఫీస్ పధకంలో సంవత్సరానికి రూ. 30 వేలు పెట్టుబడి పెడుతున్నాను. ఎలాంటి మార్పులు చేసుకోవాలి.. భవిష్యత్తు లక్ష్యాలకు ఎలా పెట్టుబడి పెట్టాలో సలహా ఇవ్వండి.

పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నందుకు ముందుగా మీకు అభినందనలు. నెల నెలా రూ. 5 వేలు ఎస్ ఐ పీ విధానం ద్వ......
ఆర్థిక ప్ర‌ణాళిక అంటే ఏమిటి?

నిర్ణీత కాలంలో నిర్ణ‌యించుకున్న ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానిని కావ‌ల్సిన ప్ర‌ణాళిక‌ను ఆర్థిక ప్ర‌ణాళిక అంటారు.ఇది ప్ర‌స్తుత వ్య‌క్తి ఆర్థిక ప‌రిస్థితి , భ‌విష్యత్తులో రాబోయే ఖ‌ర్చులు,ఆదాయం,ద్ర‌వ్యోల్బ‌ణం అన్నింటిని ప‌రిగ‌ణ‌న లోకి తీసుకుని ఆర్థిక ఇబ్బందులు త‌లెత్త‌కుండా అవ‌స‌ర‌మైన‌పుడు డ‌బ్బులు అందే విధంగా ఆర్థిక ప్ర‌ణాళిక ఉప‌యోగ‌ప‌డుతుంది..

ఆర్థిక ల‌క్ష్యాల ర‌కాలు ఏమిటి?

కొన్ని ర‌కాల ఆర్థిక‌ల‌క్ష్యాలు ప‌ద‌వీవిర‌మ‌ణత‌ర్వాత త‌విశ్రాంత‌జీవితం గ‌డిపేందుకు రిటైర్మెంట్ ప్ర‌ణాళిక పిల్ల‌ల చ‌దువుల కోసం వివాహా వేడుక ఆస్తుల కొనుగోలు

రిస్క్ అంచ‌నా వేయ‌డం అంటే ఏమిటి?

మ‌దుప‌రి తాను ఎంత న‌ష్టం భ‌రించ‌గ‌ల‌డో తెలుసుకోవ‌డాన్ని రిస్క్ ప్రొఫైలింగ్ అంటారు. వారి ఆర్థిక‌ప‌రిస్థితి , భాద్య‌త‌లు లు త‌దిత‌ర విష‌యాల‌ను ప‌రిగణ‌న‌లోకి తీసేఉకుని వారి న‌ష్ట‌భ‌యాన్ని అంచ‌నావేస్తారు. దానికి అనుగుణంగా ఆ మ‌దుప‌రి పెట్టుబ‌డి సాధ‌నాల‌నుఎంచుకుంటారు.

వీలునామా రాయ‌డం అవ‌స‌రం ఏమిటి?

వ్య‌క్తి త‌న త‌ద‌నంత‌రం ఆస్తుల‌ను వారి వార‌సుల‌కు స‌మానంగా పంచేందుకు వీలునామా ఉప‌యోగప‌డుతుంది. వార‌సుల మ‌ధ్య ఎలాంటి త‌గాదాలు రాకుండా ఉండాలంటే వీలునామా రాయ‌డం మంచిది.

ఆర్థిక ప్ర‌ణాళిక ఎందుకు వేసుకోవాలి?

మ‌న ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు ఆర్థిక‌ప్ర‌ణాథ‌ళిక ఉప‌యోగ‌ప‌డుతుంది. భ‌విష్య‌త్తులో అవ‌స‌ర‌మ‌య్యే నిధుల‌కు ఇప్ప‌టినుంచి ఎంత మ‌దుపుచేయాలి అనే విష‌యం తెలుస్తుంది. ఎక్క‌డ మ‌దుపుచేస్తే ఎంత రాబ‌డి వ‌స్తుంది మొద‌లైన విష‌యాలు లెక్క‌వేసుకోవ‌చ్చు.

ఆర్థిక‌ప్ర‌ణాళిక కాల‌ప‌రిమితి ఎంత‌?

స‌ర్టిఫైడ్ ఫైనాన్సియ‌ల్ ప్లాన‌ర్ ని సంప్ర‌దించి ఆ వ్య‌క్తి కి స‌రిపోయే విధంగా ప్ర‌ణాళిక ను నిర్మించుకోవాలి

ఆర్థిక‌ప్ర‌ణాళిక జీవితంలో ఒక సారి వేస్తే స‌రిపోతుందా లేదా మ‌ధ్య‌లో దాన్ని ప‌రిశీలుస్తుండాలా?

ఆర్థిక ప్ర‌ణాళిక ఒక సారి వేసి వ‌దిలేసేదికాదు. క‌నీసం ఏడాది కోసారి ఆర్థిక ప్ర‌ణాళిక‌ను ప‌రిశీలించుకోవాలి. ఏమైనా మార్పులుచేయాల్సి వ‌స్తే చేసుకోవాలి.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీకు ఆర్ధిక ప్రణాళిక కావాలా ?

మీ వివరాలు పరిశీలించి, తగిన ఆర్ధిక ప్రణాళికను సిరి ద్వారా నిపుణులు సూచిస్తారు.

ఓ అంచనాకు రండి

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుతుప‌వ‌నాల ప్ర‌భావం స్టాక్ మార్కెట్‌పై ఉంటుందా?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%