మీరు ఎంత గృహ రుణాన్ని పొందవచ్చో తెలుసుకోండి...

గృహ రుణ దరఖాస్తుదారునిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్యను హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు పరిగణిస్తాయి

మీరు ఎంత గృహ రుణాన్ని పొందవచ్చో తెలుసుకోండి...

గృహ రుణాల కోసం, గత ఆరు నెలల శాలరీ స్లిప్, జీతం జమ అయ్యే బ్యాంకు స్టేట్మెంట్, గత రెండేళ్ల ఫారం 16, రెండేళ్ళ 26 ఏఎస్ స్టేట్మెంట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ ఫోటో, ఇప్పటికే తీసుకున్న రుణాల వివరాలు వంటి వాటి ఆధారంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు జీతం పొందిన వ్యక్తి అర్హతను లెక్కిస్తారు.

అర్హత లెక్కింపు :

శాలరీ స్లిప్‌ల ఆధారంగా చివరి ఆరు నెలల సగటు జీతం ఆదాయాన్ని తీసుకోని, ప్రస్తుతం ఉన్న రుణ బాధ్యతను తగ్గిస్తారు. గృహ రుణ దరఖాస్తుదారునిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్యను హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు పరిగణిస్తాయి. మంత్లీ లోన్ సర్వీసింగ్ చార్జీలు (ఎంఎల్ఎస్సీ) - రుణగ్రహీత నెల జీతంలో 65 శాతాన్ని గృహ రుణ తిరిగి చెల్లింపుగా, మిగిలిన మొత్తాన్ని ఇంటి ఖర్చులుగా ఫైనాన్స్ కంపెనీలు పరిగణిస్తాయి. కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఎంఎల్ఎస్సీ ని 50 శాతంగా పరిగణించవచ్చు.

కచ్చితమైన నియమం :

ఒక వ్యక్తి వయస్సు 30 సంవత్సరాల లోపు ఉంటే, వారికి గృహ రుణం పొందే అర్హత ఎక్కువగా ఉంటుంది. జీతం పొందే ఉద్యోగికి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే గరిష్ట కాలపరిమితి 30 సంవత్సరాలు. ఒకవేళ మీ వయస్సు 30 సంవత్సరాలు అయితే, అప్పుడు మీకు 58 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి మీరు పదవీ విరమణ చేస్తారు. అందువలన మీకు 28 సంవత్సరాల కాలపరిమితితో మాత్రమే రుణం లభిస్తుంది. గృహ రుణ గరిష్ట కాలపరిమితి కారణంగా, నెలవారీ ఈఎంఐ భారం కూడా గరిష్ట స్థాయికి తగ్గుతుంది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly