బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీ కారుని విడుదల చేసిన హ్యుందాయ్..

3 సంవత్సరాల్లో కాంపాక్ట్ ఎస్యూవీ కార్ల అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి

బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీ కారుని విడుదల చేసిన హ్యుందాయ్..

భారతదేశంలో అతిపెద్ద యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మొదటి కాంపాక్ట్ యుటిలిటీ కారుని దేశ మార్కెట్లోకి విడుదల చేసింది. దాని పేరు ‘వెన్యూ’. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ కార్ల అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి.

గ్లోబల్ కారు అయిన వెన్యూ ను మొదటగా మనదేశంలో విడుదల చేయడం గమనార్హం. అనంతరం ఈ కారును అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి విదేశీ మార్కెట్లలో హ్యుందాయ్ మోటార్ కంపెనీ విడుదల చేయనుంది. హ్యుందాయ్ వెన్యూ బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీతో అందుబాటులో ఉండడంతో పాటు వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలను అందించనుంది. భారతదేశంలో విడుదల చేసిన మొట్టమొదటి కనెక్టెడ్ కారు ఇదేనని కంపెనీ తెలిపింది.

Hyundai.jpg

ఇప్పటి వరకు 15,000 మంది ఈ కారును బుక్ చేసుకున్నారని, వారిలో 64 శాతం మంది పెట్రోల్ ఇంజిన్ ను ఎంచుకున్నట్లు సంస్థ తెలిపింది. దీని ఆధారంగా వినియోగదారులు డీజిల్ ఇంజిన్ల కంటే పెట్రోల్ ఇంజిన్లపై ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం, కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లు మొత్తం యుటిలిటీ వాహన విభాగంలో 49 శాతాన్ని ఆకర్మించాయి, ఇది 2016 ఆర్ధిక సంవత్సరంలో కేవలం 16 శాతంగా ఉంది.

దేశీయ మార్కెట్లో కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో మారుతీ విటారా బ్రీజా, టాటా నెక్సాన్‌, ఫోర్డ్‌ ఎకో స్పోర్ట్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 300లతో హ్యుందాయ్ వెన్యూ పోటీ పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి హ్యుందాయ్ తన ఉత్పాదక సామర్థ్యాన్ని 50,000 యూనిట్లకు పెంచుకుంది. ప్రస్తుతం హ్యుండాయ్ సామర్ధ్య వినియోగ రేటు 95 శాతం కంటే ఎక్కువగా ఉంది.

ఈ కొత్త బ్లూలింక్ కనెక్టివిటీ టెక్నాలజీని భవిష్యత్తులో విడుదలయ్యే కార్లతో పాటు, ప్రస్తుతం ఉన్న మోడళ్లకు కూడా హ్యుందాయ్ అందిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇక ఈ కారు ధర విషయానికి వస్తే… రూ. 6.5 - రూ. 11.1 లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌ దిల్లీ) గా నిర్ణయించారు. హ్యుందాయ్‌ వెన్యూ మూడు ఇంజిన్‌ వేరియంట్లలో లభించనుంది. ఒకటి 1 లీటర్‌ టర్బో, రెండవది 1.2 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ ట్రైన్స్‌, ఇక మూడవది 1.4 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌. పెట్రోల్‌ వేరియంట్ల ధరలు రూ. 6.5 - రూ. 11.1 లక్షలు, డీజిల్‌ వేరియంట్ల ధరలు రూ.7.75 - రూ. 10.84 లక్షలు మధ్య ఉన్నాయి.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly