ఐదు కెమెరాల స్మార్ట్ ఫోన్..

ఈ ఫోను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు నోకియా స్టోర్ లలో లభించనుంది

ఐదు కెమెరాల స్మార్ట్ ఫోన్..

ఫిన్ ల్యాండ్ కి చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఐదు కెమెరాలు కలిగిన స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దాని పేరు నోకియా 9 ప్యూర్‌ వ్యూ. ఫిబ్రవరిలో జరిగిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో ఈ ఫోన్ ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఇప్పుడు ఇది భారత మార్కెట్‌లోకి ప్రవేసించింది. ఈ ఫోన్ లో 12 ఎంపీ సామర్థ్యం కలిగిన రెండు ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్లతో పాటు మరో మూడు మోనోక్రోమ్ సెన్సార్‌లను అమర్చారు. దీని ధరను రూ. 49,999 గా సంస్థ నిర్ణయించింది. మిడ్‌నైట్‌ బ్లూ కలర్‌లో ఇది లభించనుంది. ఈ ఫోను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు నోకియా స్టోర్ లలో లభించనుంది.

నోకియా 9 ఫీచర్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

  • 5.99 ఇంచ్ క్యూహెచ్‌డీ డిస్‌ప్లే
  • ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌
  • స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
  • ఆన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • వెనుకవైపు 5*12 ఎంపీ మెయిన్ కెమెరా సెట్అప్
  • ముందువైపు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 3320 ఎంఏహెచ్ బ్యాటరీ
  • వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
  • 18w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly