బిట్ కాయిన్‌కు సంబంధించిన ఐదు విష‌యాలు

ధ‌ర‌లో ఒడుదొడుకులు, చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేక‌పోవ‌డం మూలంగా వీటిని పెట్టుబ‌డిగా భావించ‌కూడ‌దు.

బిట్ కాయిన్‌కు సంబంధించిన ఐదు విష‌యాలు

ఏదైనా పెట్టుబ‌డి ఒక రోజులో 20-30 శాతం హెచ్చుత‌గ్గుల‌కు లోనైతే వాటిని అస్థిత‌ర‌త క‌లిగిన వాటిగా ప‌రిగ‌ణిస్తారు. అస్థిర‌త ద్వారా పెట్టుబ‌డులు హెచ్చుత‌గ్గుల‌కు గురికావ‌డం స‌హ‌జం. అయితే బిట్ కాయిన్ల విష‌యంలో అస్థిర‌త‌కు లోన‌య్యే అవ‌కాశం మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. చిన్న మ‌దుప‌ర్లు వీటిలో మ‌దుపు చేస్తే దాని మూలంగా పెట్టుబ‌డి న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంటుంది.

బిట్ కాయిన్ లో ఎందుకు పెట్టుబ‌డి చేయ‌కూడ‌దంటే…

హెచ్చుత‌గ్గులు:

అస్థిత‌ర‌త అధికంగా ఉండే బిట్ కాయిన్ల‌లో పెట్టుబ‌డి చేయ‌డం అంత మంచిది కాదు. గ‌త కొంత కాలంగా బిట్ కాయిన్ ధ‌ర‌ల‌లో వ‌స్తున్న‌హెచ్చుత‌గ్గుల‌ను గ‌మ‌నిస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది. గ‌తేడాది డిసెంబ‌రులో ఒక బిట్ కాయిన్ విలువ గ‌రిష్టంగా 19,783 డాల‌ర్ల‌కు చేరింది. ప్ర‌స్తుతం 9,000 డాల‌ర్ల వ‌ద్ద ట్రేడ‌వుతుంది. ఈ స్థాయిలో హెచ్చుత‌గ్గులు రావాడం బ‌హుశా బిట్ కాయిన్ కే సొంత‌మ‌ని చెప్పాలి.

విలువను గుర్తించ‌లేం:

వీటి విలువ‌ను క‌చ్చితంగా నిర్ధ‌రించేందుకు అండ‌లైయింగ్ ఆస్త‌లు ఏవీ లేవు. ఇది బ్లాక్ చెయిన్ టెక్నాల‌జీ ఆధారంగా రూపొందింది.వీటి ధ‌ర కూడా ఎక్కువ‌. మ‌న క‌రెన్సీలో ఒక కాయిన్ విలువ ల‌క్ష‌ల్లో ఉంది. అంత ధ‌ర పెట్టి వీటిని కొనుగోలు చేయ‌డం చాలా న‌ష్ట‌భ‌యంతో కూడుకున్న అంశం.

సైబ‌ర్ సెక్యూరిటీ:

ఈ లావాదేవీలు చేసేందుకు అవ‌స‌ర‌మ‌య్యే కీల‌క స‌మాచారాన్ని స‌ద‌రు వ్య‌క్తులు జాగ్ర‌త్త‌గా ఉంచుకోవాలి. సైబ‌ర్ సెక్యూరిటీ అంశాల‌ను దృష్టిలో ఉంచుకుని వీటి లావాదేవీలు చేయ‌డం మంచిది. వీటికి ప్ర‌త్యేక గుర్తింపు పొందిన వ్య‌వ‌స్థ ఏదీ లేక‌పోవ‌డం మూలంగా భ‌ద్ర‌త‌కు ముప్పు ఉంటుంది. ఈ మ‌ధ్య బిట్ కాయిన్ల‌ను అప‌హ‌రించ‌డం ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఈ ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు. కాబ‌ట్టి కొనుగోలు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది.

చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేదు:

వీటికి మ‌న దేశంలో చ‌ట్ట‌ప‌ర‌మైన గుర్తింపు లేదు. ప్ర‌భుత్వం క్రిప్టోక‌రెన్సీల‌పై అధ్య‌య‌నం చేయాల్సిందిగా ఒక క‌మిటీని నియ‌మించింది. మ‌న దేశంలో చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేన‌ట్టు ప్ర‌భుత్వం కొంత కాలం క్రిత‌మే ప్ర‌క‌టించింది.

పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణించ‌కూడ‌దు:

బిట్ కాయిన్ కు డిమాండు పెరిగిన‌ స‌మ‌యంలో ధ‌ర అమాంతం పెర‌గ‌డం, అనంత‌రం త‌గ్గ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. అంద‌రూ చేస్తున్నార‌ని వీటి విలువ‌ ఎక్కువగా ఉన్న స‌మ‌యంలో కొనుగోలు చేస్తే అమాంతం విలువ త‌గ్గే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి పెట్టుబ‌డి కోణంలో వీటిని చూడ‌వ‌ద్దు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly