పీ2పీ రుణాలు తీసుకునేందుకు ఐదు కార‌ణాలు

ఏయే స‌మ‌యాల్లో పీ2పీ రుణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌చ్చ‌నేది ఇప్పుడు చూద్దాం.

పీ2పీ రుణాలు తీసుకునేందుకు ఐదు కార‌ణాలు

పీర్ టూ పీర్ లెండింగ్ అంటే ఒక‌రి నుంచి మ‌రొక‌రు అప్పుగా డ‌బ్బు తీసుకోవ‌డం. దీన్నే సంక్షిప్తంగా పీ2పీ లెండింగ్ అంటారు. రుణం అవ‌స‌ర‌మ‌య్యే (రుణ గ్ర‌హీత‌లు) వారిని, రుణం ఇచ్చి వ‌డ్డీ ఆదాయం ఆర్జించాల‌నుకునే (రుణదాత‌లు) వారిని ఒక వేదిక‌పైకి తీసుకురావ‌డం ద్వారా చిన్న చిన్న రుణాలు ల‌భించ‌డం క‌ష్టంగా ఉండేవారికి ఈ వేదిక‌ల ద్వారా సుల‌భ‌మైన సేవ‌లను ఈ సంస్థ‌లు క‌ల్పిస్తాయి. దీనికి ఆ సంస్థ‌లు కొంత మొత్తం ఫీజును తీసుకుంటాయి. తీసుకునే రుణం, పీ2పీ సంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఫీజులు మారుతుంటాయి. ఏయే స‌మ‌యాల్లో పీ2పీ రుణాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌చ్చ‌నేది ఇప్పుడు చూద్దాం.

పీర్ టూ పీర్ లెండింగ్ గురించి విన్నారా

ఇంటి మ‌ర‌మ్మ‌త్తులకు:

ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు చేసేందుకు సాధార‌ణంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందుతాం. అయితే ఇంటికి సంబంధించి ఏవైనా మ‌ర‌మ్మ‌త్తులు, కొత్త హంగులు చేసుకోవాలంటే దానికి త‌క్కువ మొత్తంలో ఖ‌ర్చుఅవుతుంది. దీనికి అయ్యే ఖ‌ర్చు రూ.1,00,000 లోపు ఉంద‌నుకుంటే, దానికి 12 నెల‌ల కాల‌ప‌రిమితికి వ్య‌క్తిగ‌త రుణం తీసుకోవ‌డం అంత సూచ‌నీయం కాదు. దీనికి పీటూపీ లెండింగ ఫ్లాట్‌ఫామ్ ద్వారా రుణం తీసుకోవడం గురించి ఆలోచించ‌వ‌చ్చు. ఇందులో 3-6 నెల‌ల కాల‌ప‌రిమితితో, రూ. 10000 నుంచి రుణాలు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఎటువంటి రుసుం లేకుండా ముందుగా చెల్లించేందుకు వీలు ఉంటుంది.

వివాహ ఖ‌ర్చులకు:

వివాహ వేడుక‌ల‌కు సంబంధించి కొన్ని సంద‌ర్భాల్లో ఖ‌ర్చులు పెరుగుతుంటాయి. దానికి అవ‌స‌ర‌మైన మొత్తాన్ని పీటూపీ ద్వారా తీసుకోవ‌చ్చు. ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారా రుణాన్ని తొంద‌ర‌గా పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. ప‌ర్స‌న‌ల్ లోన్ కంటే కూడా వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా ఉంటుంది. త‌ద్వారా భ‌విష్య‌త్తులో ఆర్థిక భారం ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌చ్చు.

వైద్య ఖ‌ర్చుల‌కు:

ప్రమాదానికి గురికావ‌డం, ఆసుప‌త్రిలో చేర‌డం, శ‌స్త్రచికిత్స వంటి వాటికి ఎక్కువ డ‌బ్బు అవ‌స‌రం రావొచ్చు. ఎటువంటి త‌న‌ఖా లేకుండా రుణాలు పీటూపీ ద్వారా పొంద‌వ‌చ్చు. చాలా వ‌ర‌కూ ఆరోగ్య బీమా పథకాలలో దంత చికిత్స, కాస్మెటిక్ శస్త్రచికిత్సల‌ను మినహాయిస్తారు. కాబ‌ట్టి వీటి కోసం నిధులను పీటూపీ ద్వారా పొంద‌వ‌చ్చు. పీటూపీ లెండింగ్ ద్వారా వైద్య‌రుణాలు

విద్య ఖర్చులు:

విద్యా రుణాలకు సంబంధించి బ్యాంకులు అందుబాటులో ఉన్నా, కొన్ని సంద‌ర్భాల్లో ముందుగా విద్యార్థులు చెల్లించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. ఆ స‌మ‌యాల్లో పీ2పీ ద్వారా రుణాల‌ను పొంద‌వ‌చ్చు. స్వల్ప-కాలానికి నిధులు సమకూర్చుకోడానికి పీటూపీ రుణాన్ని పరిగణించవచ్చు. దీంతో పాటు కొన్ని పార్ట్ టైమ్, ఎక్జిక్యూటివ్ కోర్సుల‌కు విద్య రుణాలు అందుబాటులో ఉండ‌క‌పోవ‌చ్చు. వాటికి అవ‌స‌ర‌మైన మొత్తాన్ని స‌మ‌కూర్చుకునేందుకు ఈ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప్రయాణ ఖర్చులు:

ప్ర‌స్తుతం చిన్న‌పెద్ద తేడా లేకుండా అంద‌రూ విహార యాత్ర‌లంటే మ‌క్కువ చూపిస్తున్నారు. అయితే ఈ విష‌యంలో ఒక అడుగు ముందే ఉంటారు. ఆర్థికప‌రంగా ఆటంకం క‌ల‌గ‌కుండా పీటూపీ ద్వారా రుణాలు పొంద‌వ‌చ్చు. పీటూపీ రుణాలతో విహార యాత్ర‌ల‌కు సంబంధించిన లక్ష్యాలను చేరుకోవ‌చ్చు. అదే విధంగా వినియోగ‌దారులు వివిధ సంద‌ర్భాల్లో త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా పీటూపీ రుణాల‌ను తీసుకోవ‌చ్చు. పీటూపీ రుణాల‌ను తీసుకునే ముందు ఎటువంటి ఖ‌ర్చుల‌కు రుణం తీసుకుంటున్నాం? ఎంత మొత్తం అవ‌స‌రం? తిరిగి ఎంత కాలంలో చెల్లించాలి త‌దిత‌ర వివ‌రాల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించుకోవాలి. వీటితో పాటు స‌ద‌రు పీటూపీ ఫ్లాట్‌ఫామ్ లో రిజిస్ట్రేష‌న్,రుసుములు త‌దిత‌ర వివ‌రాల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly