రుణ భారాన్ని తగ్గించుకోడానికి ఐదు మార్గాలు

మీ వనరులకు ప్రాధాన్యతనిచ్చి అత్యంత ముఖ్యమైన అవసరాలకు మాత్రమే వాటిని కేటాయించండి

రుణ భారాన్ని తగ్గించుకోడానికి ఐదు మార్గాలు

చాలా మంది వ్యక్తులు ఎదుర్కొనే అతిపెద్ద ఆర్థిక సమస్యలలో రుణం ఒకటి. వ్యాపార నష్టాల నుంచి అనవసర ఖర్చుల వరకు, ఒకవేళ మీరు రుణం మీద నియంత్రణ కలిగి ఉండకపోతే, ఆర్ధిక ఇబ్బందులకు గురి అవ్వక తప్పదు. దీని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురికావడమే కాకుండా ఇప్పటికే మీకున్న ఆస్తులను కోల్పోయే అవకాశం ఉంది. చాలా సందర్భాలలో, రుణం అనేది వ్యక్తి ఆర్ధిక అవసరాలను ప్రతిబింబిస్తుంది. ఇది మిమల్ని పేదరికంలోకి నెట్టడమే కాకుండా మీ దీర్ఘ కాలిక కోరికలను హరించి వేస్తుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి, డబ్బును పొందే సామర్థ్యాన్నికలిగి ఉండండి. రుణాల నుంచి బయటపడటానికి వ్యూహాత్మకంగా వ్యవహరించడం అవసరం.

రుణ చెల్లింపులు చేసే కొన్ని వ్యూహాలను కింద మీకోసం తెలియచేశాము.

  1. అనవసర ఖర్చులను ఆపివేయండి :

దాచిన ఒక రూపాయి ఇంకో రూపాయిని సంపాదిస్తుంది - ప్రస్తుత పరిస్థితులకు కూడా ఈ పాత సామెత సరిగ్గా వర్తిస్తుంది. తక్షణ సంతోషాన్ని నివారించుకోండి. మీ అవసరాలు, కోరికల జాబితాను తయారు చేసుకోండి. మీ వనరులకు ప్రాధాన్యతనిచ్చి అత్యంత ముఖ్యమైన అవసరాలకు మాత్రమే వాటిని కేటాయించండి. ముందుగా మీ ప్రాధాన్యతలను తెలుసుకోవడం ద్వారా ఖర్చులను నియంత్రించడంలో అది మీకు సహాయం చేస్తుంది.

  1. కొత్త బాధ్యతలను తెచ్చుకోకపోవడమే మంచిది :

మీ రుణ సమస్యకు జతయ్యే అన్ని రకాల ఖర్చులను నివారించుకోండి. అవసరమైన గృహా పునర్నిర్మాణాలు, విలాసవంతమైన సెలవు ప్రయాణాలకు చేసే ఖర్చు, కొత్త కారు కొనుగోలు వంటివి మీ రుణానికి అదనంగా జత అవుతాయి. అందువలన వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది.

  1. రుణ చెల్లింపుకు ప్రాధాన్యత :

క్రెడిట్ కార్డు చెల్లింపులు, కారు రుణాలు, విద్యా రుణాలు, గృహ రుణాలు వంటి వాటిలో మీరు ఒకటి కంటే ఎక్కువ రుణాలను కలిగి ఉండవచ్చు. మీరు ముందుగా క్లియర్ చేయాలనుకుంటున్న రుణ రకంపై అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. అధిక వడ్డీ రేట్లు ఉన్న వాటికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. క్రెడిట్ కార్డు వడ్డీ రేటు చాలా అధికంగా ఉంటుంది. ఉదాహరణకు క్రెడిట్ కార్డుపై వడ్డీ రేట్లు నెలకు 3 నుంచి 4 శాతంగా ఉంటాయి. అంటే సంవత్సరానికి వడ్డీ రేటు 36 నుంచి 48 శాతం. దీని అర్ధం రూ. 1,00,000 క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ కు గాను నెలకు రూ. 3000 నుంచి రూ. 4000 వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

  1. రుణ ఏకీకరణ, రుణ పునర్నిర్మాణం :

రుణ మొత్తం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, రుణ గ్రహీతలు వారి రుణాలను తగ్గించుకోడానికి లేదా పునఃనిర్మించుకోనే మార్గాల కోసం చూస్తారు. రుణ ఏకీకరణ, రుణ పునర్నిర్మాణం అనేవి తిరిగి చెల్లించే దానికంటే ఎక్కువ రుణాలను కలిగి ఉన్న వారి కోసం రెండు రుణ నిర్వహణ సాధనాలుగా ఉన్నాయి.

  1. త్వరగా చెల్లించటానికి పెట్టుబడులు పెట్టండి :

పెట్టుబడి ద్వారా వచ్చే రాబడుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం, కాలక్రమేణా పెట్టిన పెట్టుబడులపై వచ్చే కాంపౌండ్ రిటర్న్స్ లు మీ రుణాన్ని సమర్ధవంతంగా నిర్వహించడంలో సహాయపడతాయి. మీరు కొంత డబ్బును కాలక్రమేణా పెట్టుబడిగా పెట్టినట్లైయితే, అది మీకు భవిష్యత్తులో మంచి రాబడిని అందిస్తుంది, తద్వారా మీ రుణాన్ని చెల్లించి, కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly