ఎస్బీఐ రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీ ప్లాన్ గురించి మీకు తెలుసా?

ఎస్బీఐ రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీ ప్లాన్ లో డిపాజిట్ చేయవలసిన కనీస వాయిదా మొత్తం రూ. 1,000

ఎస్బీఐ రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీ ప్లాన్ గురించి మీకు తెలుసా?

పొదుపు ఖాతాల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాల వరకు వివిధ రకాల సాధనాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తుంది. ఎస్బీఐ అందించే ఈ సాధ‌నాలలో రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీ ప్లాన్ ఒకటి, ఇది ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగా పనిచేస్తుంది. ఎస్బీఐ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో, మెచ్యూరిటీ సమయంలో మాత్రమే వడ్డీని చెల్లిస్తారు. సాధారణ వడ్డీని ప్రిన్సిపల్ కి జోడించి, కాంపౌండ్ వడ్డీని లెక్కించి దానిపై చెల్లిస్తారు. ఎస్బీఐ రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీ ప్లాన్ లో డిపాజిట్ చేయవలసిన కనీస వాయిదా మొత్తం రూ. 1,000. అయితే డిపాజిట్లపై గరిష్ట పరిమితి లేదు.

ఎస్బీఐ రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీ ప్లాన్ గురించి తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు :

  1. ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ల కు వర్తించే వడ్డీ రేట్ల మాదిరిగానే, రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వడ్డీ రేట్లు ఉంటాయి. మెచ్యూరిటీ సమయంలో వడ్డీని చెల్లిస్తారు.
  1. ఎస్బీఐ రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీ ప్లాన్ కనీస కాల వ్యవధి 6 నెలలు కాగా గరిష్ట కాల వ్యవధి 10 సంవత్సరాలు. ఒకవేళ మెచ్యూరిటీకి సంబంధించిన సూచనలు ఇవ్వకపోతే, రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీ ప్లాన్ ఆటోమాటిక్ గా రెన్యువల్ అవుతుంది.

  2. ఎస్బీఐ రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీ ప్లాన్ ముందస్తు ఉపసంహరణ సౌకర్యాన్ని అందిస్తుంది.

  • ఐదు లక్షల రూపాయల వరకు రిటైల్ టర్మ్ డిపాజిట్ విషయంలో, ముందస్తు ఉపసంహరణకు జరిమానా 0.50 శాతంగా ఉంటుంది.

  • ఐదు లక్షల నుంచి ఒక కోటి రూపాయల వరకు రిటైల్ టర్మ్ డిపాజిట్ విషయంలో, వర్తించే జరిమానా 1 శాతంగా ఉంటుంది.

  1. ఎస్బీఐ రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీ ప్లాన్ కు పన్ను వర్తిస్తుంది.

  2. డిపాజిట్ చేసిన మొత్తం, అది సంపాదించిన వడ్డీ పై 90 శాతం వరకు రుణ లేదా ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఎస్టీడీఆర్ (స్పెషల్ టర్మ్ డిపాజిట్ రేటు) కంటే 1.00 శాతం ఎక్కువ వద్ద ఎస్బీఐ రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీ ప్లాన్ అందిస్తుంది.

ఎస్బీఐ రీఇన్వెస్ట్మెంట్ ఎఫ్డీ ప్లాన్ నామినేషన్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly