మరో భారీ సేల్ కు సిద్దమైన ఫ్లిప్‌కార్ట్‌..

ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువులపై డిస్కౌంట్లను అందించనుంది

మరో భారీ సేల్ కు సిద్దమైన ఫ్లిప్‌కార్ట్‌..

దేశంలోనే అతిపెద్ద ఆన్ లైన్ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మరో భారీ సేల్ తో వినియోగదారుల ముందుకు రానుంది. ఫ్లిప్ కార్ట్ “బిగ్ బిలియన్ డేస్” పేరుతో మరో సారి సేల్ ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ సేల్ ను ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించనుంది. ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందించనుంది. దీంతో పాటు క్రెడిట్ కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ ను అందించనుంది. యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా షాపింగ్ చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ ను సంస్థ అందించనుంది. అలాగే బై బ్యాక్ గ్యారంటీ, కేవలం ఒక రూపాయి నుంచే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. వీటితో పాటు బజాజ్ ఫిన్సర్వ్ అందించే నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 28 రాత్రి 8 గంటల నుంచే సేల్ లో పాల్గొనవచ్చు. వీటితో పాటు సేల్ జరిగే సమయంలో క్రేజీ డీల్స్, రష్ అవర్స్, ఫ్లాష్ సేల్, మహా ప్రైస్ క్రాష్ వంటి ఆఫర్లను కూడా అందించనుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ పరికరాలపై 90 శాతం వరకు, టీవీస్ & అప్లయన్సెస్ పై 75 శాతం వరకు, ఫ్యాషన్ పై 90 శాతం వరకు, హోమ్ & ఫర్నిచర్ పై 50 నుంచి 90 శాతం వరకు, ఫ్లిప్‌కార్ట్‌ బ్రాండ్స్ పై 90 శాతం వరకు డిస్కౌంట్ ను అందించనుంది.

ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ రివీల్ చేసిన ఆఫర్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే…

 • రెడ్మీ నోట్ 7ఎస్ (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 11,999 నుంచి రూ. 8,999
 • రెడ్మీ నోట్ 7ఎస్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 13,999 నుంచి రూ. 9,999
 • రియల్ మీ 5 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 10,999 నుంచి రూ. 8,999
 • రియల్ మీ 5 (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 11,999 నుంచి రూ. 9,999
 • రెడ్మీ కే20 ప్రో (6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) : రూ. 28,999 నుంచి రూ. 24,999
 • అసూస్ 6జడ్ (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 35,999 నుంచి రూ. 27,999
 • ఒప్పో రెనో (6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) : రూ. 41,990 నుంచి రూ. 39,990
 • సామ్సంగ్ ఎస్9 ప్లస్ (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 70,000 నుంచి రూ. 34,990
 • ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ (2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 7,999 నుంచి రూ. 5,499
 • మోటో వన్ యాక్షన్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 16,999 నుంచి రూ. 11,999
 • మోటో వన్ విజన్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 22,999 నుంచి రూ. 14,999

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly