స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? నాలుగు రోజులు ఆగండి..

క్రెడిట్ కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ ను అందించనుంది

స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? నాలుగు రోజులు ఆగండి..

దేశంలోనే అతిపెద్ద ఆన్ లైన్ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్ కార్ట్ మరో సేల్ తో వినియోగదారుల ముందుకు రానుంది. ఫ్లిప్ కార్ట్ “బిగ్ షాపింగ్ డేస్” పేరుతో మరో సారి సేల్ ను ప్రారంభించనుంది. జులై 15 మధ్యాహ్నం 12 గంటల నుంచి 18 వ తేదీ వరకు ఈ సేల్ ను ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించనుంది. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందించనుంది. దీంతో పాటు క్రెడిట్ కార్డుల ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ ను అందించనుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేసిన వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ ను సంస్థ అందించనుంది. అలాగే బై బ్యాక్ గ్యారంటీ, కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. వీటితో పాటు బజాజ్ ఫిన్సర్వ్ అందించే నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులు జులై 15 ఉదయం 8 గంటల నుంచే సేల్ లో పాల్గొనవచ్చు. వీటితో పాటు సేల్ జరిగే సమయంలో రష్ అవర్స్, బ్లాక్ బస్టర్ డీల్స్, ప్రైస్ క్రాష్, మాన్సూన్ స్టోర్ వంటి ఆఫర్లను కూడా అందించనుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ పరికరాలపై 80 శాతం వరకు, టీవీస్ & అప్లయన్సెస్ పై 75 శాతం వరకు, ఫ్యాషన్ పై 80 శాతం వరకు, హోమ్ & ఫర్నిచర్ పై 40 నుంచి 80 శాతం వరకు, ఫ్లిప్ కార్ట్ బ్రాండ్స్ పై 70 శాతం వరకు డిస్కౌంట్ ను అందించనుంది.

స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ అందించే ఆఫర్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే…

 • రియల్ మీ 3 ప్రో (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 15,999 నుంచి రూ. 13,499
 • ఆసుస్‌ మాక్స్ ప్రో ఎం1 (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 12,999 నుంచి రూ. 8,499
 • హానర్‌ 9ఎన్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 13,999 నుంచి రూ. 8,499
 • మోటో వన్ పవర్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 18,999 నుంచి రూ. 10,999
 • నోకియా 5.1 ప్లస్ (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 13,199 నుంచి రూ. 7,999
 • సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 74,000 నుంచి రూ. 34,990
 • సామ్సంగ్ ఆన్ ఎన్ఎక్స్టీ (3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 17,900 నుంచి రూ. 8,990
 • రెడ్మీ నోట్ 7ఎస్ (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 11,999 నుంచి రూ. 9,999
 • ఒప్పో ఎఫ్ 11 ప్రో (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 28,990 నుంచి రూ. 20,990
 • ఒప్పో ఎఫ్ 9 ప్రో (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 25,990 నుంచి రూ. 17,990
 • ఒప్పో కే1 (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 18,990 నుంచి రూ. 14,990
 • ఒప్పో ఏ3ఎస్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 13,990 నుంచి రూ. 10,990
 • ఆసుస్‌ మాక్స్ ఎం1 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 8,999 నుంచి రూ. 6,499
 • అసూస్ 5జడ్ (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 29,999 నుంచి రూ. 21,999
 • అసూస్ 6జడ్ (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 35,999 నుంచి రూ. 31,999

పైన తెలిపిన స్మార్ట్ ఫోన్స్ తో పాటు సామ్సంగ్ ఏ 50, ఏ 30, ఏ 10, ఐఫోన్ లపై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులను ఫ్లిప్ కార్ట్ అందించనుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly