ఇకపై ఫ్లిప్‌కార్ట్ లోనూ సినిమాలు చూడోచ్చు..

ఫ్లిప్‌కార్ట్ యాప్ ను ఉపయోగించే వినియోగదారులకు ఈ సర్వీసు ఉచితంగా అందుబాటులో ఉంటుంది

ఇకపై ఫ్లిప్‌కార్ట్ లోనూ సినిమాలు చూడోచ్చు..

అమెజాన్ ప్రైమ్ వీడియోకు పోటీగా ఫ్లిప్‌కార్ట్ ఉచితంగా వీడియో స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీపావళి షాపింగ్ సీజన్‌కు ముందే అనగా సెప్టెంబర్ నాటికి ఫ్లిప్‌కార్ట్ ప్లస్ లాయల్టీ మెంబర్స్ కోసం వీడియో స్ట్రీమింగ్‌ను రూపొందించాలని భావిస్తున్నట్లు సంస్థకు చెందిన ప్రతినిధులు తెలిపారు. అలాగే ప్రస్తుతం ఈ సర్వీస్ బీటా మోడ్‌లో ఉందని తెలిపారు.

ఫ్లిప్ కార్ట్ వీడియోస్ పేరుతో ఈ సర్వీస్ ను ప్రారంభించనుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్ ను ఉపయోగించే వినియోగదారులకు ఈ సర్వీసు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. వీడియో స్ట్రీమింగ్ సర్వీసులపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసుల మాదిరిగా కాకుండా, మొదట్లో ఫ్లిప్‌కార్ట్ ఒరిజినల్ కంటెంట్ ను ఉత్పత్తి చేయడానికి బదులుగా వాల్ట్ డిస్నీ, బాలాజీ టెలిఫిల్మ్స్ వంటి స్థానిక స్టూడియోల నుంచి కంటెంట్‌ను లైసెన్స్ కు తీసుకుని, భవిష్యత్తులో ఒరిజినల్ కంటెంట్ ను ఉత్పత్తి చేయవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ వీడియో స్ట్రీమింగ్ దాని లాయల్టీ ప్రోగ్రామ్ మాదిరిగా ఉచితంగా లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులు వారు ఖర్చు చేసే ప్రతి రూ. 100 కొనుగోలుపై 2 కాయిన్స్ చొప్పున 300 సూపర్ కాయిన్స్ ను సేకరించడం ద్వారా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ కావచ్చు. వినియోగదారులు ఈ కాయిన్లను విమాన టిక్కెట్లు, ఫుడ్ డెలివరీ, కారు రెంటల్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ సబ్ స్క్రిప్షన్ వంటి వాటి కోసం రెడీమ్ చేసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ప్లస్ తన రివార్డ్ ప్రోగ్రామ్‌ను 2018 సంవత్సరంలో ప్రారంభించింది, అప్పటికే భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒరిజినల్ షోలు, బాలీవుడ్, ప్రాంతీయ భాషా చిత్రాల కోసం పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అమెజాన్ సర్వీసులను పొందడానికి సంవత్సరానికి రూ. 999 లేదా నెలకు రూ. 129 చెల్లించాలి.

నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి గ్లోబల్ స్ట్రీమింగ్ దిగ్గజాలు మన దేశంలో గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. సిస్కో సిస్టమ్స్ అంచనాల ప్రకారం, ఇవి 2022 నాటికి 829 మిలియన్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల మార్కును అందుకునే అవకాశం ఉంటుంది. అలాగే 500 మిలియన్ డాలర్ల టర్న్ ఓవర్ కలిగిన భారతీయ వీడియో స్ట్రీమింగ్ మార్కెట్ 2023 నాటికి 10 రెట్లు పెరుగుతుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఒక నివేదికలో తెలిపింది.

(source - livemint)

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly