మరో సేల్ కు సిద్దమైన ఫ్లిప్కార్ట్..

దాదాపు అన్ని సంస్థలకు చెందిన స్మార్ట్ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తుంది

మరో సేల్ కు సిద్దమైన ఫ్లిప్కార్ట్..

మన దేశంలో ఇవాల్టి నుంచి ఐపీఎల్ సమరం మొదలవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ‘మొబైల్స్ బొనాంజా’ పేరుతో మార్చి 25 నుంచి మార్చి 28 వరకు సేల్ ను నిర్వహించనుంది. ఈ సేల్‌లో భాగంగా వివిధ రకాల సంస్థలకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లను, డిస్కౌంట్లను అందించనుంది. అలాగే దాదాపు అన్ని సంస్థలకు చెందిన స్మార్ట్ ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తుంది. బజాజ్ ఫైనాన్స్ తో పాటు అన్ని ప్రముఖ బ్యాంకులు క్రెడిట్ కార్డుల ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నాయి. దీనితో పాటు యాక్సిస్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులను ఉపయోగించి ఈఎంఐ ద్వారా మొబైల్ ను కొనుగోలు చేసినట్లయితే, అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభించనుంది. దీనితో పాటు బై బ్యాక్ గ్యారంటీని అందించడంతో పాటు రూ. 99 ల నుంచి కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా ఫ్లిప్‌కార్ట్ తమ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. సాధారణ రోజుల్లో ఎక్స్చేంజ్ ఆఫర్ పై ఇచ్చే డిస్కౌంట్ కంటే రూ. 500 అదనపు డిస్కౌంట్ ను అందించనుంది.

ఈ సేల్ లో ఏ మొబైల్స్ పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో కింద చూద్దాం.

 • రియల్ మీ 2 ప్రో (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 12,990 నుంచి రూ. 11,990
 • రెడ్మీ నోట్ 6 ప్రో (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 11,999 నుంచి రూ. 10,999
 • రెడ్మీ 6 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 7,999 నుంచి రూ. 7,499
 • వివో వై 81 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 10,990 నుంచి రూ. 8,490
 • హానర్‌ 9 లైట్ (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 8,499 నుంచి రూ. 7,999
 • ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మాక్స్ ప్రో ఎం1 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 8,499 నుంచి రూ. 7,999
 • హానర్‌ 9ఎన్ (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 8,999 నుంచి రూ. 8,499
 • పోకో ఎఫ్ 1 (6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్) : రూ. 22,999 నుంచి రూ. 20,999
 • ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మాక్స్ ఎం2 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 9,999 నుంచి రూ. 8,999
 • రెడ్మీ వై 2 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 8,999 నుంచి రూ. 7,999
 • రియల్ మీ సీ1 (2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్) : రూ. 7,999 నుంచి రూ. 7,499
 • రెడ్మీ నోట్ 5 ప్రో (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 13,999 నుంచి రూ. 10,999
 • ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మాక్స్ ఎం1 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 7,499 నుంచి రూ. 6,499
 • హానర్‌ 10 లైట్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 13,999 నుంచి రూ. 11,999
 • రియల్ మీ 2 (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 9,990 నుంచి రూ. 9,499
 • సామ్సంగ్ గెలాక్సీ నోట్ 8 (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 39,990 నుంచి రూ. 36,990
 • సామ్సంగ్ గెలాక్సీ ఎస్8 (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 30,990 నుంచి రూ. 29,990
 • నోకియా 5.1 ప్లస్ (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 9,999 నుంచి రూ. 8,999
 • నోకియా 6.1 ప్లస్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 14,999 నుంచి రూ. 13,999
 • హానర్‌ 7ఎస్ (2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్) : రూ. 5,999 నుంచి రూ. 5,499
 • హానర్‌ 7ఏ (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 7,999 నుంచి రూ. 7,499
 • ఆసుస్‌ జెన్‌ఫోన్‌ లైట్ ఎల్1 (2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్) : రూ. 5,999 నుంచి రూ. 4,999
 • మోటో ఎక్స్4 (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 14,999 నుంచి రూ. 11,999
 • సామ్సంగ్ గెలాక్సీ ఆన్8 (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 16,990 నుంచి రూ. 12,990
 • ఒప్పో కే1 (6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 16,990 నుంచి రూ. 15,990
 • వివో వీ9 ప్రో (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 14,990 నుంచి రూ. 13,990
 • మోటో ఈ5 ప్లస్ (3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్) : రూ. 9,999 నుంచి రూ. 7,999
 • మోటోరోలా వన్ పవర్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 14,999 నుంచి రూ. 13,999
 • గూగుల్ పిక్సెల్ 3 (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 59,999 నుంచి రూ. 57,999
 • ఎల్జీ జీ7 తిన్ క్యూ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 29,999 నుంచి రూ. 27,999
 • ఎల్జీ వీ30 ప్లస్ (4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్) : రూ. 27,999 నుంచి రూ. 23,999

పైన తెలిపిన స్మార్ట్ ఫోన్స్ తో పాటు బ్లాక్ బెర్రీ, ఐఫోన్ లపై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులను ఫ్లిప్ కార్ట్ అందించనుంది. అలాగే ఇటీవల విడుదలైన రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లు సేల్ జరిగే అన్ని రోజులు అందుబాటులో ఉండనున్నాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly