రేపటి నుంచే ఫ్లిప్ కార్ట్ "నేషనల్ షాపింగ్ డేస్" సేల్..

ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ ఒకరోజు ముందుగానే అనగా ఆగష్టు 7, రాత్రి 8 గంటల నుంచే సేల్ లో పాల్గొనవచ్చు

రేపటి నుంచే ఫ్లిప్ కార్ట్ "నేషనల్ షాపింగ్ డేస్" సేల్..

దేశీయ ఆన్ లైన్ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరోసారి సేల్ తో వినియోగదారుల ముందుకు రానుంది. ఫ్లిప్ కార్ట్ “నేషనల్ షాపింగ్ డేస్” పేరుతో సేల్ ను ప్రారంభించనుంది. ఈ సేల్ ను ఆగష్టు 8 నుంచి 10 వరకు అనగా మూడు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించనుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ ఒకరోజు ముందుగానే అనగా ఆగష్టు 7, రాత్రి 8 గంటల నుంచే సేల్ లో పాల్గొనవచ్చు. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువు, హోమ్ ఫర్నిచర్, గ్రోసరీ, బ్యూటీ, స్పోర్ట్స్, బేబీ కేర్ ఉత్పత్తులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందించనుంది. దీనితో పాటు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులను ఉపయోగించి ఏవైనా ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లయితే, అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఈఎంఐ ద్వారా చేసే కొనుగోళ్లపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే డెబిట్ కార్డు వినియోగదారులకు ఈఎంఐ సదుపాయాన్ని అందించనుంది. వీటితో పాటు బజాజ్ ఫిన్సర్వ్ అందించే నో కాస్ట్ ఈఎంఐ, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ లాంటి సర్వీసులు కూడా అందుబాటులో ఉండనున్నాయి. వీటితో పాటు ప్రతి కొనుగోలుపై కచ్చితమైన రివార్డ్ లను గెలుచుకునే అవకాశాన్ని కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలపై 80 శాతం వరకు, టీవీస్ & అప్లయన్సెస్ పై 75 శాతం వరకు, ఫ్యాషన్ పై 50 నుంచి 80 శాతం వరకు, హోమ్ & ఫర్నిచర్ పై 40 నుంచి 80 శాతం వరకు, బ్యూటీ, స్పోర్ట్స్, బేబీ కేర్ ఉత్పత్తులపై 80 శాతం వరకు, ఫ్లిప్ కార్ట్ బ్రాండ్స్ పై 70 శాతం వరకు, గ్రోసరీ పై 90 శాతం వరకు, దేశీయ విమాన టికెట్లపై రూ. 2500 వరకు, అంతర్జాతీయ విమాన టికెట్లపై రూ. 25000 వరకు, రిఫర్బిషడ్ ప్రొడక్ట్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ ను అందించనుంది. వీటితో పాటు ఫ్రీడమ్ కౌంట్ డౌన్, బ్లాక్ బస్టర్ డీల్స్, ప్రైస్ క్రాష్, రష్ హావర్స్ వంటి ఆఫర్స్ ను అందించనుంది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly