రేపటి నుంచే "ఫ్లిప్ స్టార్ట్ డేస్" సేల్..

అయితే, ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లను సంస్థ అందించడం లేదు

రేపటి నుంచే "ఫ్లిప్ స్టార్ట్ డేస్" సేల్..

దేశంలోనే అతిపెద్ద ఆన్ లైన్ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్ కార్ట్ మరోసారి సేల్ తో వినియోగదారుల ముందుకు రానుంది. ఫ్లిప్ కార్ట్ “ఫ్లిప్ స్టార్ట్ డేస్” పేరుతో సేల్ ను ప్రారంభించనుంది. ఈ సేల్ ను ఆగష్టు 1 నుంచి 3 వరకు అనగా మూడు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్‌ నిర్వహించనుంది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువు, హోమ్ ఫర్నిచర్, గ్రోసరీ, బ్యూటీ, స్పోర్ట్స్, బేబీ కేర్ ఉత్పత్తులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లను అందించనుంది. అయితే, ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లను సంస్థ అందించడం లేదు. డెబిట్ కార్డు వినియోగదారులకు ఈఎంఐ సదుపాయాన్ని అందించనుంది. వీటితో పాటు బజాజ్ ఫిన్సర్వ్ అందించే నో కాస్ట్ ఈఎంఐ, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ లాంటి సర్వీసులు కూడా అందుబాటులో ఉండనున్నాయి. వీటితో పాటు ప్రతి కొనుగోలుపై కచ్చితమైన రివార్డ్ లను గెలుచుకునే అవకాశాన్ని కూడా ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలపై 80 శాతం వరకు, టీవీస్ & అప్లయన్సెస్ పై 75 శాతం వరకు, ఫ్యాషన్ పై 40 నుంచి 80 శాతం వరకు, హోమ్ & ఫర్నిచర్ పై 30 నుంచి 75 శాతం వరకు, బ్యూటీ, స్పోర్ట్స్, బేబీ కేర్ ఉత్పత్తులపై 80 శాతం వరకు, ఫ్లిప్ కార్ట్ బ్రాండ్స్ పై 70 శాతం వరకు, గ్రోసరీ పై 90 శాతం వరకు, దేశీయ విమాన టికెట్లపై రూ. 2500 వరకు, అంతర్జాతీయ విమాన టికెట్లపై రూ. 2500 వరకు, బస్సు బుకింగ్స్ పై 10 శాతం, హోటల్ బుకింగ్స్ పై 25 శాతం తగ్గింపు, రిఫర్బిషడ్ ప్రొడక్ట్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ ను పొందవచ్చు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly