రుణం తీసుకోవటానికి ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి..

గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు తిరిగి చెల్లించగలిగే దాని కంటే ఎక్కువ రుణం తీసుకోకండి

రుణం తీసుకోవటానికి ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి..

ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుండడంతో ప్రజలకు ఆన్ లైన్ లో వివిధ బ్యాంకులు, రుణదాతలు అందించే వడ్డీ రేట్లను పోల్చుకోని, వారి అవసరాలకు సరిపోయే ఉత్తమ ఆప్షన్ ను ఎంచుకోవడం సులభం అయ్యింది. ఏదేమైనా, ఇటీవల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రుణాలు తీసుకోవడం ఖరీదైన ప్రతిపాదనగా మారింది. బ్యాంకులు అందించే రుణాలు అధిక వడ్డీ రేట్లను ఆకర్షిస్తుండగా, క్రెడిట్ కార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు రుణం తీసుకోవాలనుకుంటున్న మొత్తం ఆధారంగా ఆప్షన్స్ మారుతూ ఉంటాయి.

ఒకవేళ మీరు రుణాలు తీసుకోవాలనుకుంటే, మీరు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలను కింద తెలియచేస్తున్నాము :

ఎక్కువ రుణాలు తీసుకోకండి : మొదటగా మీ అవసరాలను తీర్చుకోవడానికి ఇతర వనరులు ఏమైనా ఉన్నాయేమో చూడండి, ఒకవేళ ఉన్నట్లయితే, మీరు అప్పు తీసుకోవలసిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు రుణం తీసుకున్నట్లైతే, మీ ఈఎంఐ అవుట్-గో, మీ మొత్తం నెలవారీ ఆదాయంలో 40 శాతానికి మించకుండా చూసుకోండి. ఒకవేళ మీ ఆదాయంలో ఈఎంఐ 50 నుంచి 70 శాతంగా ఉంటే, మీ భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు ఆదా చేయడం చాలా కష్టంగా మారుతుందని తెలుసుకోండి. మీరు రుణం తీసుకునే ముందు ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ నెలవారీ ఈఎంఐ అవుట్‌ గోను తెలుసుకోండి.

గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు తిరిగి చెల్లించగలిగే దాని కంటే ఎక్కువ రుణం తీసుకోకండి.

అనవసరమైన వాటి కోసం రుణాలు తీసుకోకండి : విచక్షణ లేకుండా అనవసరమైన ఖర్చులు చేయడానికి రుణాలు తీసుకోవడం ఆహ్వానించదగిన విషయం కాదు. ఏ రకమైన వినోద ఖర్చులు లేదా గాడ్జెట్ల కోసం అప్పు తీసుకోవడం మిమ్మల్ని రుణ ట్రాప్లోకి నెట్టివేసే అవకాశం ఉంటుంది. అలాగే, పెట్టుబడి పెట్టడానికి ఎప్పుడూ రుణాలు తీసుకోకండి.

రుణ కాలపరిమితి : రుణ కాలపరిమితి తక్కువగా ఉండేలా చూసుకోండి. బ్యాంకులు ఎక్కువ రుణ కాలపరిమితులను అందిస్తూ, రుణ గ్రహీతలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంటాయి. సాధారణంగా, గృహ రుణాల విషయంలో బ్యాంకులు ఎక్కువ కాలపరిమితిని అందిస్తుంటాయి. ఇది 30 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సుదీర్ఘ కాలపరిమితి గల రుణాలకు అధిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. దీని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈఎంఐ కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.

తక్కువ వడ్డీ రేట్ల కోసం చూడండి : బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ ఆప్షన్ తో, మీరు మీ రుణాన్ని తక్కువ వడ్డీ రేట్లకు బదిలీ చేయవచ్చు. అందువలన మీరు బకాయిలను బదిలీ చేయగలిగినప్పుడు అధిక వడ్డీ రేట్లను ఎందుకు చెల్లించాలి? కావున బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు వివిధ ఆఫర్లతో ముందుకు వస్తూ ఉంటాయి, అలాంటి ఆఫర్‌ల కోసం ఎదురుచూడండి.

గతంలో మీరు మీ బ్యాలెన్స్‌ను తక్కువ వడ్డీ రేటు అందించే రుణదాతకు బదిలీ చేస్తే, అది మీకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు మీ రుణాన్ని ముందస్తుగా చెల్లించాలనుకుంటే, ఏ బ్యాంకులు ఎంత ఫోర్ క్లోజింగ్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయో సరిపోల్చండి. ఫోర్ క్లోజింగ్ ఛార్జీలను మీరు ఆదా చేసే మొత్తంతో పోల్చి, పొదుపులు అధికంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఫోర్ క్లోజ్ చేయండి.

పన్ను ప్రయోజనాలను పొందటానికి వేచి ఉండకండి : ప్రభుత్వం కొన్ని రుణాలపై పన్ను ప్రయోజనాలను అందిస్తున్నందున, పన్ను ప్రయోజనాలను పొందటానికి రుణాలను కొనసాగించే రుణగ్రహీతలు ఉన్నారు. ఉదాహరణకు ఆదాయపు పన్ను చట్టం u/S 24, 80EE గృహ రుణాలపై పన్ను మినహాయింపును అందిస్తుంది. అలాగే విద్యా రుణాలపై చెల్లించే వడ్డీని కూడా పూర్తిగా తగ్గించవచ్చు. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రయోజనాలు రుణం మొత్తం వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి, అయితే కేవలం పన్ను ప్రయోజనాల కోసం రుణాలను కొనసాగించడం మంచిది కాదు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly