ఇకపై అటల్ పెన్షన్ యోజనలో చేరడం మరింత సులభం..

భవిష్యత్తులో 1,00,000 బ్యాంకింగ్ పాయింట్లకు ఈ సేవలను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది

ఇకపై అటల్ పెన్షన్ యోజనలో చేరడం మరింత సులభం..

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తమ పొదుపు ఖాతా వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఇక పై ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా అటల్ పెన్షన్ యోజన సభ్యత్వాన్ని పొందవచ్చునని బ్యాంకు తెలిపింది. దేశంలో ఈ పథకాన్ని అందించే మొట్టమొదటి పేమెంట్స్ బ్యాంకు ఇదే కావడం విశేషం.

ఎయిర్‌టెల్ చెల్లింపులు బ్యాంక్ ఖాతాదారులు దేశవ్యాప్తంగా ఉన్న 50,000 బ్యాంకింగ్ పాయింట్ల వద్ద పేపర్‌ లెస్ ప్రక్రియ ద్వారా ఈ పథకంలో సభ్యత్వాన్ని పొందగలరు. భవిష్యత్తులో 1,00,000 బ్యాంకింగ్ పాయింట్లకు ఈ సేవలను విస్తరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

అటల్ పెన్షన్ యోజన ప్రధానంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు పెన్షన్ ప్రయోజనాలు, సామాజిక భద్రతను అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పథకం. ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల ఖాతాదారులకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఇది కనీస నెలవారీ పింఛను రూ. 1000 నుంచి రూ. 5000 మధ్య అందిస్తుంది.

"పీఎఫ్‌ఆర్‌డీఏ భాగస్వామ్యంతో మా బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ అనుబ్రాతా బిస్వాస్ తెలిపారు.

అలాగే కేంద్ర ప్రభుత్వ మద్దతుగల జీవిత బీమా పథకం అయిన ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనా పథకాన్ని అందించడం కోసం భారతీ యాక్సాతో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly