మీ క్రెడిట్ స్కోర్ ను ఉచితంగా పొందండిలా..

మీరు సంవత్సరానికి కనీసం నాలుగు సార్లు ఉచితంగా క్రెడిట్ స్కోర్ ను పొందవచ్చు

మీ క్రెడిట్ స్కోర్ ను ఉచితంగా పొందండిలా..

రుణం పొందడానికి అవసరమయ్యే ముఖ్య పత్రాలలో క్రెడిట్ స్కోర్ ను తెలిపే నివేదికలు ఒకటి. ఒకవేళ మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉన్నట్లయితే, తక్కువ వడ్డీ రేటుతో పాటు, ఇతర చార్జీలను తగ్గించాల్సిందిగా మీరు రుణదాతలను కోరవచ్చు. మీకు మంచి స్కోరు ఉన్నట్లయితే, బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు మరికొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకే రుణాలను మంజూరు చేయడానికి ముందుకు వస్తున్నాయి. మీరు సంవత్సరానికి కనీసం నాలుగు సార్లు ఉచితంగా క్రెడిట్ స్కోర్ ను పొందవచ్చుననే విషయం మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే, మీ కోసం కింద తెలియచేస్తున్నాము.

ఉచిత క్రెడిట్ స్కోరు:

క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలు సంవత్సరానికి ఒకసారి ఉచితంగా క్రెడిట్ నివేదికను మీకు ఇవ్వాలి. జనవరి 1, 2017 సంవత్సరం నుంచి అన్ని క్రెడిట్ బ్యూరోలు ఒకసారి క్రెడిట్ రిపోర్ట్ ను ఉచితంగా ప్రజలకు అందించడాన్ని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తప్పనిసరి చేసింది.

మన దేశంలో మొత్తం నాలుగు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థలు ఉన్నాయి. వాటిలో:

  1. ట్రాన్స్యూనియన్ సిబిల్ లిమిటెడ్
  2. ఈక్విఫాక్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
  3. సీఆర్ఐఎఫ్ హై మార్క్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
  4. ఎక్స్పీరియన్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.

ఒక్కో సంస్థ నుంచి ఒకసారి చొప్పున మొత్తం నాలుగు సార్లు మీరు ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ ను పొందవచ్చు.

బ్యూరోలతో పాటు, ఫిన్ టెక్ సంస్థలు కూడా ఉచితంగా క్రెడిట్ స్కోర్లను అందిస్తాయి.

యాక్సెస్:

ఒకవేళ మీరు క్రెడిట్ రిపోర్ట్ ను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థల నుంచి పొందాలని అనుకుంటే, అప్పుడు మీరు సంస్థకు సంబంధించిన వ్యక్తిగత వెబ్ సైట్ ను సందర్శించాలి.

ఉదాహరణకు, మీరు సిబిల్ సంస్థకు చెందిన వెబ్ సైట్ ను సందర్శించినట్లైతే, హోమ్ పేజీ పై ఉన్న లింక్ ద్వారా మీ ఉచిత క్రెడిట్ రిపోర్ట్ ను పొందవచ్చు. దాని కోసం మీరు ముందుగా యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

అనంతరం మీ పేరు, పుట్టిన తేదీ, ప్రభుత్వ గుర్తింపు పత్రం, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ వంటి వివరాలను పూరించాలి. ఒకసారి మీరు వీటిని నమోదు చేసిన తర్వాత, డాష్ బోర్డుపై మీ క్రెడిట్ స్కోర్ ను పొందుతారు.

సాధారణంగా ఒక వ్యక్తి సిబిల్ స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఒక వ్యక్తికి రుణం మంజూరు చేయడానికి రుణ దాతలు అతని క్రెడిట్ స్కోర్ ను ప్రామాణికంగా తీసుకుంటారు. అలాగే కొన్ని సంస్థలు ప్రభుత్వ గుర్తింపు పత్రాలను యాప్ ద్వారా లేదా ఈ-మెయిల్ ద్వారా సమర్పించమని కూడా అడుగుతాయి.

అలాగే థర్డ్ పార్టీ వెబ్ సైట్లు అయిన విష్ ఫిన్, పైసాబజార్ లు కూడా వారి ప్లాట్ ఫారంల ద్వారా ఉచితంగా క్రెడిట్ నివేదికలను అందిస్తున్నాయి. వాస్తవానికి, పైసాబజార్. కామ్ క్రెడిట్ స్కోర్లను ఎక్స్పీరియన్, సీఆర్ఐఎఫ్ హైమార్క్, సిబిల్ సంస్థల నుంచి పొందుతుంది. స్కోరుతో పాటు చెల్లింపు చరిత్ర, క్రెడిట్ కార్డు వినియోగం, క్రెడిట్ చరిత్ర, ఖాతాల సంఖ్య వంటి సమాచారాన్ని కూడా అందిస్తుంది.

క్రెడిట్ స్కోరు ప్రాముఖ్యత:

మొదటగా క్రెడిట్ స్కోరు, క్రెడిట్ నివేదిక అనేవి మీ క్రెడిట్ పనితీరును పరిశీలించటానికి సహాయపడతాయి. ఒకవేళ మీరు దానిని సరిచేసుకోవాలని అనుకుంటే, మీరు సరైన సమయానికి క్రెడిట్ కార్డు బిల్లులను, రుణ ఈఎంఐలను చెల్లించి మీ క్రెడిట్ స్కోర్ ను పెంపొందించుకోవచ్చు.

అయితే మీ క్రెడిట్ రిపోర్ట్, క్రెడిట్ స్కోర్ లపై ప్రత్యేక ద్రుష్టి పెట్టడం మంచిది. లేదంటే తక్కువ క్రెడిట్ స్కోర్ కారణంగా భవిష్యత్తులో మీరు దరఖాస్తు చేసుకునే రుణాలు తిరస్కరణను గురయ్యే అవకాశం ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly