ప‌న్ను ఆదా చేసే పెట్టుబ‌డుల‌కు గ‌డువు పొడ‌గింపు

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తుంది

ప‌న్ను ఆదా చేసే పెట్టుబ‌డుల‌కు గ‌డువు పొడ‌గింపు

పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం లభించింది. సెక్షన్ 80 సీ, 80 డీ, 80 జీ కింద తగ్గింపులను క్లెయిమ్ చేయడానికి వివిధ పెట్టుబడులు పెట్టే గడువును ప్రభుత్వం జూన్ 30, 2020 వరకు పొడిగించింది. గతంలో దీని గడువు మార్చి 31, 2020 గా ఉండేది. ఈ ప్రకటనను కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకుని చేసినట్లు తెలుస్తుంది.

సెక్షన్ 80 సీ (ఎల్ఐసీ, పీపీఎఫ్, ఎన్ఎస్సీ మొదలైనవి), 80 డీ (మెడిక్లైమ్), 80 జీ (విరాళాలు) మొదలైన ఐటీ చట్టం చాప్టర్-వీఐఏ-బీ కింద మినహాయింపు క్లెయిమ్ చేయడానికి వివిధ పెట్టుబడులు పెట్టే తేదీని జూన్ 30, 2020 కి పొడిగించారు. అందువలన 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ విభాగాల కింద తగ్గింపును క్లెయిమ్ చేయడానికి 30-06-2020 వరకు పెట్టుబడి / చెల్లింపు చేయవచ్చునని అధికారిక ప్రకటన తెలిపింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, పన్నులు ఆదా చేసుకోవడానికి పెట్టుబడిదారులు సెక్షన్ 80 సీ, సెక్షన్ 80 డీ వంటి పెట్టుబడి సాధనాలను పరిగణించవచ్చు. ELSS, PPF, NSC, SCSS వంటి పెట్టుబడి సాధనాలు సెక్షన్ 80సీ పరిధిలోకి వస్తాయి. వైద్య బీమా, క్రిటికల్ ఇల్నెస్, జీవిత బీమా పాలసీ, ఆరోగ్య సంరక్షణ సంబంధిత ఖర్చులు సెక్షన్ 80 డీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly