పాత వాహనాలను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం...

15 సంవత్సరాల కంటే పాత మోటారు వాహనాలను పరీక్షించి వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ను పునరుద్ధరించనున్నారు

పాత వాహనాలను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం...

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో, ప్రభుత్వం 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి అనుమతించే మోటారు వాహన నిబంధనలకు సవరణలను ప్రతిపాదించింది. ముసాయిదా నోటిఫికేషన్‌లో, ప్రస్తుత కాలపరిమితికి బదులుగా ప్రతి ఆరునెలలకు 15 సంవత్సరాల లోపు వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి, బస్సులలో దివ్యంగులకు స్నేహపూరితమైన ఫీచర్స్ ను అందించడానికి, అలాగే 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి కావలసిన యంత్రాంగాన్ని అందించడానికి చేయాల్సిన సవరణల కోసం సీఎంవీఆర్ (సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్) కు మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ ను విడుదల చేసిందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

15 సంవత్సరాల కంటే పాత మోటారు వాహనాలను పరీక్షించి, అవి సరైన కండిషన్ లో ఉన్నట్లు రుజువైన తరువాత మాత్రమే వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ను పునరుద్ధరించనున్నారు, అలాగే పునరుద్ధరణ ఫీజులను కూడా పెంచారు. మీడియం లేదా భారీ మోటారు వాహనాల విభాగంలో మాన్యువల్ వాహనాలకు రూ. 1200, అలాగే ఆటోమేటెడ్ వాహనాలకు రూ. 2000 ల సర్టిఫికేట్ పునరుద్ధరణ ఛార్జీలను వసూలు చేయాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రతిపాదిస్తుంది.

రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేయడం లేదా పునరుద్ధరించడం, కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ కేటాయించడం కోసం బ్యాటరీతో నడిచే వాహనాలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆథరైజ్డ్ స్క్రాపింగ్ సెంటర్ లేదా ఏజెన్సీ జారీ చేసిన అదే కేటగిరీకి చెందిన మునుపటి వాహనానికి సంబంధించిన స్క్రాపింగ్ సర్టిఫికెట్‌ను కొనుగోలుదారుడు జారీ చేస్తే, కొత్తగా కొనుగోలు చేసిన మోటారు వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ కేటాయింపు కోసం చెల్లించాల్సిన ఫీజుపై మినహాయింపు లభిస్తుందని నోటిఫికేషన్ లో తెలియచేయడం జరిగింది.

రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రాల జారీ, పునరుద్ధరణ, కొత్త రిజిస్ట్రేషన్ మార్క్ కేటాయించడం కోసం వసూలు చేసే ఫీజులను సవరించారు. మీడియం, భారీ వస్తువులు / ప్రయాణీకుల వాహనాలకు, కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను రూ. 20,000 గా, అలాగే రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ ఛార్జీలను రూ. 40,000 గా నిర్ణయించారు. అలాగే దిగుమతి చేసుకున్న మోటారు వాహనాలకు (నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు) కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను రూ. 20,000 గా, అలాగే రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ ఛార్జీలను రూ. 40,000 గా నిర్ణయించారు.

ప్రజల నుంచి సలహాలు, సూచనలను పొందేందుకు ముసాయిదా నోటిఫికేషన్ కాపీని జారీ చేసింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly