తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు...

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలు...

కొత్త ఎలక్ట్రిక్ కారు లేదా బైకు కొనాలనుకుంటున్న వారికి శుభవార్త. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జూలై 27న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్‌టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, అలాగే ఈవీ చార్జర్లపై జీఎస్‌టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. సవరించిన జీఎస్‌టీ రేట్లు ఆగస్ట్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీనితో పాటు 12 మంది కంటే ఎక్కువ ప్రయాణికుల సామర్ధ్యం కలిగిన ఎలక్ట్రిక్ బస్సులను జీఎస్‌టీ పరిధి నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై పన్ను రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీ రేటులో రూ.1.5 లక్షల వరకు తగ్గింపును కూడా పొందవచ్చునని ప్రభుత్వం తెలిపింది. బడ్జెట్‌ ప్రవేపెట్టిన తరవాత జీఎస్టీ కౌన్సిల్‌ మొదటిసారి భేటీ అయ్యింది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly