వడ్డీ రేట్లను తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు..

ప్రస్తుతం ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.35 కాగా, ఈ నిర్ణయంతో అది 8.30 కు చేరింది

వడ్డీ రేట్లను తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు..

దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం అయిన హెచ్డీఎఫ్సీ తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లను 5 నుంచి 10 బేస్‌ పాయింట్ల మధ్య తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు ఏప్రిల్ 8, 2019 నుంచి అమల్లోకి రానున్నట్లు బ్యాంకు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఎంసీఎల్‌ఆర్‌ రేటు 8.35 కాగా, ఈ నిర్ణయంతో అది 8.30 కు చేరింది.

హెచ్డీఎఫ్సీ బ్యాంకు వడ్డీ రేట్లు ఎంతమేర తగ్గాయో ఒకసారి పరిశీలిస్తే…

  • ఒక నెల కాలానికి వడ్డీ రేటు 8.40 శాతం నుంచి 8.30
  • మూడు నెలల కాలానికి వడ్డీ రేటు 8.45 శాతం నుంచి 8.40
  • ఆరు నెలల కాలానికి వడ్డీ రేటు 8.55 శాతం నుంచి 8.50
  • ఒక సంవత్సరాల కాలానికి వడ్డీ రేటు 8.75 శాతం నుంచి 8.70
  • రెండు సంవత్సరాల కాలానికి వడ్డీ రేటు 8.85 శాతం నుంచి 8.80
  • మూడు సంవత్సరాల కాలానికి వడ్డీ రేటు 9 శాతం నుంచి 8.95

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly