వడ్డీ రేట్లను తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు..

తగ్గించిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 1 నుంచి అమలులో రానున్నాయి

వడ్డీ రేట్లను తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు..

దేశీయ ప్రైవేట్ బ్యాంకు దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తమ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గించిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 1 నుంచి అమలులో రానున్నాయి. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం, రూ. 30 లక్షల వరకు తీసుకునే గృహ రుణాలపై వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంటుంది. ఇది కేవలం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అదే ఇతరులకు అయితే ఈ రేటు 8.6 శాతంగా ఉంటుంది. అదే రూ.30 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు ఉన్న గృహ రుణాలపై వడ్డీ రేటు 8.85 శాతంగా ఉంటుంది. మహిళలకు అయితే ఈ రేటు 8.8 శాతంగా ఉంటుంది. అదే విధంగా రూ. 75 లక్షలకు పైన తీసుకునే రుణాలపై వడ్డీ రేటు 8.90 శాతంగా ఉంటుంది. అదే మహిళలకు ఈ రేటు 8.85 శాతంగా ఉంటుంది.

ఇటీవలే ఎస్‌బీఐ కూడా గృహ రుణ వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో వడ్డీ రేట్లు 8.45 శాతం నుంచి 8.4 శాతానికి తగ్గాయి. ఆర్‌బీఐ రెపో రేటు తగ్గించడం వలన బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly