ఎడల్విజ్ ఆరోగ్య బీమా కొత్త ఫీచర్లు
ఎడల్విజ్ తమ పాలసీదారులకు ఆరోగ్య బీమా పాలసీతో మరిన్ని అదనపు ప్రయోజనాలను అందించనుంది
ఎడల్విజ్ సాధారణ బీమా సంస్థ, జీరో డిశ్ఛార్జ్ టైమ్, జీరో డిపాజిట్, గ్యారంటీ బెడ్ సదుపాయంతో కూడిన సమగ్ర ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించింది. జీరో డిశ్ఛార్జ్ టైమ్ అనేది కంటి చికిత్స, మెటర్నిటీ వంటి 14 రకాల చికిత్సలకు ఉపయోగపడుతుంది. ఈ సదుపాయాలు మొదట దేశవ్యాప్తంగా 23 ఆస్పత్రులలో మొదలుపెట్టనున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ నుంచి డిశ్ఛార్జ్ అయ్యేందుకు 2 నుంచి 5 గంటలుగా పడుతుంది. ఈ ఇబ్బందిని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకున్నట్లు ఎడల్విజ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ అనుప్ రావ్ తెలిపారు.
గ్యారెంటీ బెడ్ ఫీచర్ ద్వారా పాలసీదారుడు తమ జాబితాలో ఉన్న ఆస్పత్రిలో చేరితే బెడ్ సదుపాయం కల్పిస్తుంది. అదేవిధంగా జీరో డిపాజిట్ ఫీచర్‌తో రూమ్ లేదా బెడ్‌కి ఎలాంటి డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు. ఈ ఫీచర్లతో వినియోగదారులకు మంచి సౌకర్యాలను అందించడమే తమ లక్ష్యంగా ఎడల్విజ్ సీఈఓ చెప్పారు.
ఇందులో మొత్తం మూడు ఆఫర్లు ఉంటాయి. అవి సిల్వర్, గోల్డ్, ప్లాటినం. రూ. కోటి వరకు కవరేజ్ ఉంటుంది. ఇది 8 మంది కుటుంబ సభ్యులకు అంటే (తల్లిదండ్రులు, అత్త-మామలు, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు) వర్తిస్తుంది. ప్రత్యామ్నాయ చికిత్స ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్) వంటి వాటికి కూడా బీమా హామీనందిస్తుంది.
- ఎడల్విజ్ పాలసీతో 24 గంటలు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేకుండానే చాలా వరకు ఖర్చుని భరిస్తుంది.
- బరువు తగ్గించుకునేందుకు చేసుకునే శస్ర్త చికిత్సకు సంబంధించిన ఖర్చును కూడా హామీ అందిస్తుంది.
- అవయవ మార్పిడి చికిత్సలో డోనర్‌కి రూ.2 లక్షల వరకు ఇస్తుంది.
- తీవ్రమైన వ్యాదులకు చికిత్స పొందినప్పుడు హామీ మొత్తం 50 శాతం పెరుగుతుంది.
- మెటర్నిటీకి సంబంధించి రెండు డెలివరీలకు కవరేజ్ ఇవ్వడంతో పాటు రీఛార్జ్ , రీస్టోర్ ప్రయోజనాలను కూడా కల్పిస్తుంది.
- ప్రతి క్లెయిమ్ -ఫ్రీ ఏడాదిలో నో క్లెయిమ్ బోనస్‌తో బీమా హామీ పెరుగుతుంది.
- పాలసీలో వీటితో పాటు ఎమర్జెన్సీ చికిత్సకు తరలింపు, మెడికల్ రిఫరల్, వైద్యం కోసం స్వదేశానికి తరలించడం, సెకండ్ మెడికల్ ఒపినీయన్ వంటి చాలా రకాల సేవలు అందిస్తుంది.
ఎడల్విజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, తమ వినియోగదారులకు వైద్య సంబంధిత సేవలను అందించేందుకు కృషి చేస్తుంది. ఈ మూడు ఆఫర్లతో ఎలాంటి భయం లేకుండా జీవనం కొనసాగించవచ్చు. ఈ ఫీచర్లతో వినియోగదారులకు మంచి సౌకర్యాలను అందించడమే తమ లక్ష్యంగా చెప్పారు.
Comments
0