2018 ఆర్థిక విశేషాలు

గ‌తేడాదిలో జ‌రిగిన ముఖ్యమైన ఆర్థిక విశేషాలు ఈ విధంగా ఉన్నాయి

2018 ఆర్థిక విశేషాలు

జ‌న‌వ‌రి:

 • జ‌న‌వ‌రిలో సెబీ ఒక క‌న్సెల్‌టేష‌న్ పేప‌ర్ విడుద‌ల చేసింది. సెబీ న‌మోదిత ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజ‌ర్ (ఆర్ఐఏ) మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను విక్ర‌యించ‌కూడ‌దు. అదేవిధంగా డిస్ర్టిబ్యూట‌ర్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు సంబంధించి సూచ‌న‌లు చేయ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

 • బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏఐ వాహ‌న డీల‌ర్ల‌కు వాహ‌న బీమా ప్రొవైడ‌ర్లుగా మారిన వారు బీమా పాల‌సీల పంపిణీ కోసం త‌యారీదారుల‌తో ఒప్పందం కుద‌రుర్చుకునేందుకు వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది.

 • ఎన్‌పీఎస్‌ లో పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ నిబంధ‌న‌ల‌ను పీఎఫ్ఆర్‌డీఏ సుల‌భ‌త‌రం చేసింది. క‌నీసం మూడేళ్లు డిపాజిట్ చేసిన‌వారు 25 శాతం విత్‌డ్రా చేసుకునేలా ఏర్పాటు చేసింది. గ‌తంలో ప‌దేళ్ల వ‌ర‌కు ఈ అవ‌కాశం ఉండేది కాదు.

 • బీమా క్లెయిమ్‌ల‌ను 30 రోజుల్లోగా ప‌రిష్క‌రించాల‌ని బీమా సంస్థ‌ల‌కు ఐఆర్‌డీఏఐ క‌చ్చితంగా చెప్పింది. క్లెయిమ్‌లో ఆల‌స్యం చేయకుండా పరిష్క‌రించ‌డ‌మో తిర‌స్క‌రించ‌డ‌మో చేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

 • ఎల్ఐసీ గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో వ‌చ్చిన క్లెయిమ్‌ల‌లో 98.31 శాతం ప‌రిష్క‌రించిన‌ట్లు తెలిపింది. ఐఆర్‌డీఏఐ వివ‌రాల ప్ర‌కారం ప్రైవేటు బీమా సంస్థ‌ల క్లెయిమ్‌ల ప‌రిష్కారం 93.72 శాతంగా ఉంది.

ఫిబ్ర‌వ‌రి:

 • ఫిబ్ర‌వ‌రి 1, 2018 న బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఇందులో సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌డ్డీ ఆదాయంపై పన్ను మిన‌హాయింపును మ‌రో రూ.50 వేల‌పై ప‌రిమితి పెంచింది.

 • మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో వ‌చ్చిన రాబ‌డిని ఆరు నెల‌ల లోపు ప్ర‌త్యేక ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేస్తే సెక్ష‌న్ 54ఈసీ కింద ఎల్‌టీసీజీ నుంచి మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అదేవిధంగా 2018 బ‌డ్జెట్‌లో బాండ్ల హోల్డింగ్ పీరియ‌డ్‌ను మూడేళ్ల నుంచి ఐదేళ్ల‌కు పెంచేందుకు ప్ర‌తిపాదించింది.

 • నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ‌ల‌కు కూడా అంబుడ్స్‌మ‌న్‌ను నియ‌మించేంద‌కు ఆర్‌బీఐ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో వినియోగ‌దారుల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం అందించనుంది.

 • ఈపీఎఫ్ వ‌డ్డీ రేటును 2017-18 సంవ‌త్స‌రానికిగాను 8.55 శాతానికి త‌గ్గించింది. ఇది 2016-17 లో 8.65 శాతంగా ఉంది.

 • ఈపీఎఫ్ చందాదారుల‌కు క‌నీస జీవిత బీమాను ఫిబ్ర‌వ‌రి 15, 2018 న పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో క‌నీస బీమా హామీ రూ.2.5 ల‌క్ష‌ల నుంచి రూ.6 ల‌క్ష‌ల‌కు పెరిగింది.

మార్చి:

 • పార్లమెంటు ఇటీవలే గ్రాట్యుటీ (సవరణ) బిల్లు 2018 కు ఆమోదం పొందింది. ఇందులో చెప్పుకోవ‌ద‌గిన అంశం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా, అవసరమైనప్పుడు ప్రభుత్వం పన్ను-రహిత గ్రాట్యుటీని పరిమితం చేయటానికి ఇది అనుమతిస్తుంది. 7 వ వేత‌న సంఘంలో, ప్రభుత్వ ఉద్యోగుల గ‌రిష్ఠ ప‌రిమితి రూ. 20 లక్ష‌ల‌కు పెరిగింది. బిల్లులో మార్పుతో, ప్రభుత్వం రూ .10 లక్షల పరిమితిని తొలగించింది, దీంతో ప్ర‌వేటు రంగ‌ ఉద్యోగులకు లాభం చేకూరుతుంది.

ఏప్రిల్‌:

 • ఆర్‌బీఐ కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా కొన‌సాగించింది. రెపో రేటు 6 శాతం, రివ‌ర్స రెపో రేటు 5.75 శాతం, మార్జిన‌ల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటు 6.25 శాతంగా యాధావిధిగా ప్ర‌క‌టించింది.

 • 25-44 మ‌ద్య వ‌య‌సువారు ఆరోగ్య బీమా పాల‌సీల‌ను ఎక్కువ శాతం తీసుకుంటున్న‌ట్లు ఆన్‌లైన్ ప‌ద్ద‌తిని పాటిస్తున్న‌ట్లు చెప్పారు. సాధార‌ణంగా ఈ పాల‌సీల‌ను ఆఫ్‌లైన్‌లోనే ఎక్కువ‌గా కొనుగోలు చేస్తుంటారు.

 • పేటీఎం మ్యూచువ‌ల్ ఫండ్ బిజినెస్‌ను ప్రారంభించింది. పేటీఎం మ‌నీ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టే అవ‌కాశం క‌ల్పించింది.

 • మ్యూచువ‌ల్ ఫండ్ల ఆస్తుల 2017-18 సంవ‌త్స‌రంలో రూ.23 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగాయి.

 • 2017-18 సంవ‌త్స‌రంలో ఎల్ఐసీ ఈక్విటీ ట్రేడింగ్‌లో రూ.25 వేల కోట్లు లాభం పొందింది. గ‌తేడాది ఇది రూ.19 వేల కోట్లుగానే న‌మోదైంది.

 • బీమా సంస్థ‌లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో థ‌ర్డ్ పార్టీ బీమాను విక్ర‌యించ‌వ‌చ్చు. ఈ మేర‌కు అన్ని సాధార‌ణ బీమా సంస్థ‌ల‌కు ఆదేశాలు జారీ చేసింది.

 • పీఎఫ్ఆర్‌డీఏ బ్యాంకు ఖాతా వివ‌రాలు, మొబైల్ నంబ‌ర్ ఎన్‌పీఎస్ ఖాతాదారుల‌కు త‌ప్ప‌నిస‌రి చేసింది. మ‌నీ లాండ‌రింగ్ వంటివి జ‌ర‌గ‌కుండా ఈ నిర్ణ‌యం
  తీసుకంది.

 • రిటైల్ పెట్టుబ‌డుదారులు ప్ర‌భుత్వ సెక్యూరిటీల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎన్ఎస్ఈ ఆమోదం తెలిపింది.

 • క్రిప్టోక‌రెన్సీని ఈ-వాలెట్లు లేదా బ్యాంకుల ద్వారా కొనుగోలు లేదా అమ్మ‌కాల‌కు వీల్లేకుండా ఆర్‌బీఐ నిలిపివేసింది.

 • 2017-18 సంవ‌త్స‌రంలో చిన్న ప‌ట్ట‌ణాల నుంచి మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు 38 శాతం పెరగ‌డంతో ఆస్తుల మొత్తం రూ.4.27 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. యాంఫీ చేసిన ప్ర‌చారంతో అవ‌గాహ‌న పెర‌గ‌డం దీనికి దోహ‌దం చేసింది.

మే:

 • ఈపీఎఫ్ పెన్షనుదారులు ఉమాంగ్ యాప్ ను ఉపయోగించి వారి పెన్షన్ పాస్బుక్ ను వీక్షించవచ్చ‌ని కార్మిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

 • అసోసియేషన్ అఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా డేటా ప్రకారం, దేశంలోని 15 ప్రధాన నగరాల్లో కాకుండా మిగిలిన ప్రాంతాలలోని ఆస్తులు రూ. 3. 09 లక్షల కోట్ల నుంచి రూ. 4. 27 లక్షల కోట్లకు (మార్చి 2017 - మర్చి 2018) పెరిగాయి. అదే 15 ప్రధాన నగరాల్లోని ఆస్తుల విషయానికి వస్తే, అదే ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ. 15. 48 లక్షల కోట్ల నుంచి రూ. 18. 44 లక్షల కోట్లకు పెరిగాయి.

 • పీఎంవీవీవై కింద, 8 శాతం హామీ ఇచ్చిన రాబడులతో పెట్టుబడుల పరిమితిని రూ. 7.5 లక్షల నుంచి రూ. 15 లక్షల రెట్టింపుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 • పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రైవేట్ సెక్టార్ ఎన్పీఎస్ కి ఈక్విటీ కేటాయింపును 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతూ ఆమోదించింది.

 • లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ డేటా ప్రకారం, జీవిత బీమా పరిశ్రమ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు రూ. 28 లక్షల కోట్ల నుంచి రూ. 33 లక్షల కోట్లకు పెరిగాయి.

జూన్:

 • అక్రమంగా నిధుల‌ మళ్లింపు చేసినందుకు గాను విజయ్ మాల్యాపై మార్కెట్లో పాల్గొన‌కుండా సెబీ మూడు సంవత్సరాల నిషేధం విధించింది.
  లిస్టెడ్ కంపెనీల్లో ఏవిధ‌మైన కీల‌క ప‌ద‌వులు చేప‌ట్ట‌కుండా 5 ఏళ్లు నిషేధం విధించింది.

 • ప్రతి పథకానికి సంబంధించిన రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్ మొత్తం వ్యయం నిష్పత్తి(టీఈఆర్)ని రోజువారీ వెల్ల‌డించాల‌ని సెబీ ఫండ్ సంస్థ‌ల‌ను ఆదేశించింది.

 • మార్కెట్ అస్థిరత గురించి అవగాహన పెరగడం, అలాగే మ్యూచువల్ ఫండ్స్ పై పరిశ్రమ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో, ఏప్రిల్ - మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో రూ. 24,479 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.

 • దేశంలోని సుమారు 3.30 లక్షల మంది భారతీయులు, మొత్తం దేశ సంపదలో సగభాగాన్ని కలిగి ఉన్నారని ది ఇండియా 2018 వెల్త్ రిపోర్ట్ వెల్లడించింది.

జులై:

 • పాన్ తో ఆధార్ నెంబర్ లింక్ చేసుకోడానికి 2019 మార్చి వరకు గడువును పొడిగిస్తూ సెంట్రల్ బోర్డ్ అఫ్ డైరెక్ట్ టాక్స్ నిర్ణయం తీసుకుంది.

 • మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తులలో 96 శాతాన్ని టాప్ 20 ఫండ్ హౌసెస్ నిర్వహిస్తున్నాయి. 2018 జూన్ నాటికి పరిశ్రమకు చెందిన మొత్తం రూ. 23.40 లక్షల కోట్ల ఆస్తులలో రూ. 22 లక్షల కోట్లను ఈ ఫండ్ హౌసెస్ నిర్వహిస్తున్నాయని అస్సోసియేషన్ అఫ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ ఇండియా డేటా తెలిపింది.

 • మ్యూచువల్ ఫండ్ల మార్కెట్ క్యాప్ ఆధారంగా స్టాక్స్ జాబితాను అసోసియేషన్ అఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా నవీకరించింది. స్కీం వర్గీకరణపై కొత్త నిబంధనలకు అనుగుణంగా ఈ జాబితాను ఫండ్ హౌసెస్ అనుసరించాలని భావిస్తున్నారు.

 • సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, పీయూసీ సర్టిఫికేట్ లేకుండా మోటార్ బీమా పాలసీలను పునరుద్ధరించకూడదని బీమా సంస్థలను ఐఆర్డిఏఐ ఆదేశించింది.

 • ఈ ఆర్ధిక సంవత్సరం జూలై - సెప్టెంబరు త్రైమాసికంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), జాతీయ పొదుపు సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్రా (కేవీపీ), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) వంటి చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 • 2018-19 ఆర్ధిక సంవత్సరం మొదటి మూడు నెలలలో (ఏప్రిల్ - జూన్) మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ దాదాపు 30 లక్షల కొత్త ఎస్ఐపీ లను జత చేసిందని తాజా ఏఎంఎఫ్ఐ డేటా వెల్లడించింది.

 • ఐఆర్డీఏఐ డేటా ప్రకారం, ఎలాంటి క్లైములకు నోచుకోని పాలసీదారులకు చెందిన రూ. 15,167 కోట్లు 23 జీవిత బీమాసంస్థలలో ఉన్నాయి. దీనికి సంబంధించిన పాలసీదారులను లేదా లబ్ధిదారులను గుర్తించి వెంటనే క్లెయిమ్ సెటిల్ చేయాలని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది.

ఆగష్టు:

 • కోటాక్ వెల్త్ మేనేజ్మెంట్ అండ్ హురున్ రిపోర్ట్ ఇండియా ప్రచురించిన నివేదిక ప్రకారం, భారతీయ ధనిక మహిళలు రూ. 4000 కోట్లను కలిగి ఉన్నారు. జూన్ 30, 2018 నాటికి దేశంలోని 404 మహిళల నికర విలువను ఈ నివేదికలో తెలిపారు. ఈ నివేదికలో మరో కీలకమైన విషయం ఏమిటంటే, అత్యధిక సంపన్న మహిళలు ఔషధ పరిశ్రమకు సంబంధించినవారు.

 • ప్రస్తుత ఆరోగ్య బీమా పాలసీల్లో మానసిక అనారోగ్యాలను కూడా చేర్చడానికి ఐఆర్డీఏఐ బీమా కంపెనీలను కోరింది. దీంతో ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు మానసిక అనారోగ్యాలకు కూడా కవరేజ్ ను అందిస్తాయి.

 • ఆగష్టు 16, 2018 నుంచి డీఎస్పీ బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ గా మారిందని కంపెనీ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఫండ్ హౌస్ దాని కొత్త లోగోను ఆవిష్కరించింది.

 • నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపట్టడానికి యువతను ప్రోత్సహించేందుకు ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద స్కిల్ ఇండియా ను ప్రేవేశ‌పెట్టారు. ఈ అభ్యర్థుల కోసం రెండు కొత్త ప్రయోజనాలను ప్ర‌భుత్వం ప్రవేశపెట్టింది. వాటిలో ఒకటి ప్రమాద బీమా కవర్, మరొకటి డిజీలాకర్ సదుపాయం.
  సెప్టెంబరు:

 • ప్ర‌ధాన మంత్రి జ‌న్ ఆరోగ్య‌యోజ‌నా ప‌థ‌కాన్ని ప్రారంభించారు. దీని ద్వారా 10 కోట్ల కుటుంబాల‌కు బీమా హామీ మొత్తం రూ. 5ల‌క్ష‌లు క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు.

 • మ్యూచువ‌ల్ ఫండ్ల నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తుల విలువ రూ.25 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది.

 • బీమా లేని వాహ‌నాలను వేలం ద్వారా విక్ర‌యించి బాధిత కుటుంబాల‌కు చెల్లించాల‌ని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది.

 • వివిధ చిన్నపొదుపు పథకాలలో వ‌డ్డీ రేటును 0.3% -0.4% వ‌ర‌కూ ప్ర‌భ‌త్వం పెంచింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసిక వడ్డీ రేట్ల నివేదిక‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్ఎస్‌సీఎస్), జాతీయ సేవింగ్స్ సర్టిఫికేట్లు (ఎన్ఎస్‌సీ), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కం స్కీమ్ ఖాతా (ఎంఐఎస్) , సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా (ఆర్‌డీ), కిసాన్ వికాస్ పత్ర (కేవీసీ) ప‌థ‌కాల‌పై 0.4 శాతం రేటు పెంచింది. దీంతో పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ వ‌డ్డీని 8%, ఎమ్ఐఎస్ వడ్డీ 7.7%, ఎస్ఎస్వై వడ్డీ 8.5% ఎస్‌సీఎస్ఎస్‌ వ‌డ్డీ 8.7% కు చేరింది.

 • బీమా నియంత్ర‌ణ ప్రాధికారిక సంస్థ‌(ఐఆర్‌డీఏఐ) ప్ర‌తీ వాహ‌న‌దారుడు త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సిన వాహ‌న‌ప్ర మాద బీమా క‌వ‌రేజీ ని రూ.15 ల‌క్ష‌ల‌కు చేయాల‌ని ఆదేశాలు జారీచేసింది. అప్ప‌టికీ ద్విచ‌క్ర వాహ‌నాల‌కు రూ.1ల‌క్ష‌, ప్ర‌వైట్, వాణిజ్య వాహ‌నాల‌కు రూ.2 ల‌క్ష‌లు ప్ర‌మాద బీమా ఉండేది. రూ.15 ల‌క్ష‌ల బీమా ప‌రిహ‌రం ల‌భించేలా తీసుకునే పాల‌సీ కి ప్రీమియం సంవ‌త్స‌రానికి రూ.750 గా నిర్ణ‌యించారు. గ‌తంలో ద్విచ‌క్ర‌వాహ‌నాల‌కు ప్రీమియం రూ.50, కార్ల‌కు 100 ఉండేంది.

 • ప్ర‌భుత్వ బ్యాంకు ఉద్యోగులు క్రాస్ సెల్లింగ్ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్లు, బీమా ప‌థ‌కాలు విక్ర‌యించినందుకు క‌మీష‌న్ ఇవ్వ‌కూడ‌ద‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. థ‌ర్డ్ పార్టీ ప్రొడ‌క్టుల ద్వారా వ‌చ్చే ఆదాయం బ్యాంకుల ఆదాయంగా ప‌రిగ‌ణించాల‌ని వెల్ల‌డించింది.

అక్టోబ‌రు:

 • రిజ‌ర్వు బ్యాంకు ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మీక్ష‌లో రెపో రేటు రివ‌ర్స్ రెపో రేటుల‌లో మార్పులు చేయ‌లేదు. 6.5,6.25 శాతాల వ‌ద్ద‌ కొన‌సాగించిది.

 • వాహ‌న బీమాకు సంబంధించి ఐఆర్‌డీఏఐ కొత్త నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను థ‌ర్డ్ పార్టీ బీమా 5 సంవ‌త్స‌రాలు, కార్ల‌కు 3 సంవ‌త్స‌రాలుగా చేసింది.

 • క్రెడిట్ స్యూస్ నివేదిక ప్ర‌కారం ప్ర‌పంంచంలో అల్ట్రా- అధిక నిక‌ర‌విలువ క‌లిగిన వ్య‌క్తుల ప‌రంగా భార‌త్ 6 వ‌స్థానంలో నిలిచింది.
 • ఆధార్‌తో కేవైసీ ప్ర‌క్రియ‌ను పూర్తిచేసే మ్యూచువ‌ల్ ఫండ్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు అవ‌రోధం ఏర్పడింది. యూఐడీఏఐ కేవైసీ నిబంధ‌న‌లు పూర్తిచేసేందుకు ఆధార్ వినియోగించ‌వ‌ద్ద‌ని డిస్ట్రిబ్యూట‌ర్లు ఆదేశించిది.
 • రిలయన్స్ కాపిటల్ త్వరలోనే ఆరోగ్య బీమా వ్యాపారంలోకి ప్రవేశించనుంది. ఐఆర్‌డీఏఐ రిలయన్స్ క్యాపిట‌ల్ కు హెల్త్ ఇన్సూరెన్స్ ను ప్రారంభించేందుకు అనుమ‌తిలిచ్చింది. దేశంలో ఆరోగ్య బీమా రంగం ఏటా 20 శాతం పెరుగుదలతో పెరుగుతోంద‌ని సంస్థ వెల్లడించిది. 2021 నాటికి ఈ మార్కెట్ రూ .1 లక్ష కోట్ల కు చేరుతుంద‌ని అంచ‌నా వేసింది.

 • మ్యూచువ‌ల్ ఫండ్ల వ్యాపారంలోకి ముత్తూట్ ఫైనాన్స్ రానుంది. ఈ మేర‌కు సెబీ అనుమ‌తులు జారీచేసింది.

 • జీరోదా రిటైల్ మ‌దుప‌ర్ల‌కు ప్ర‌భుత్వ బాండ్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. రిజ‌ర్వు బ్యాంకు స‌హ‌కారంతో వివిధ‌ర‌కాల‌ ప్ర‌భుత్వ పెట్టుబ‌డి సాధ‌నాల‌ను ఆ సంస్థ ఫ్లాట్ ఫామ్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది.

న‌వంబ‌రు:

 • సిప్ ల ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్లలోకి వ‌చ్చే నిధులు గ‌త నెల‌తో పోలిస్తే నెల‌తో పోలిస్తే అక్టోబ‌రు నెల‌లో 42 శాతం త‌గ్గాయి.

 • 17 ర‌కాల వ్యాధుల‌ను ఆరోగ్య‌బీమా ప్రీ-ఎక్సిస్టింగ్ వ్యాధుల ప‌రిధి నుంచి మిన‌హాయించాల‌ని ఐఆర్‌డీఏఐ ప్యానెల్ స‌ల‌హానిచ్చింది.

డిసెంబ‌రు:

 • రిజ‌ర్వు బ్యాంకు 3-5 తేదీల్లో జ‌రిపిన ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మీక్ష‌లో రెపో రేటు రివ‌ర్స్ రెపో రేటుల‌లో మార్పులు చేయ‌లేదు. 6.5,6.25 శాతాల వ‌ద్ద‌ కొన‌సాగించిది.
 • డిసెంబ‌రు 10న ఉర్జిత్ ప‌టేల్ రాజీనామా.
 • డిసెంబరు 12 న భార‌త‌రిజ‌ర్వుబ్యాంకు 25 వ గ‌వ‌ర్న‌ర్ గా శ‌క్తికాంత‌దాస్ నియామ‌కం. దాస్ గ‌తంలో ఆర్థిక వ్య‌వ‌హ‌రాల సెక్ర‌ట‌రీగా ప‌నిచేశారు.
 • ఎన్‌పీఎస్ ప‌థ‌కానికి సంబంధించి 60 శాతం నిధుల ఉప‌సంహ‌ర‌ణ‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. మిగిలిన 40 శాతం నిధుల‌ను యాన్యూటీ గా తీసుకోవ‌చ్చు.
 • 28 శాతం జీఎస్‌టీలో ఉన్న వ‌స్తువ‌ల‌ను కొన్నింటిని 18 శాతానికి మారుస్తూ ఎస్‌టీ కౌన్సిల్ నిర్ణ‌యం తీసుకుంది.
 • స‌రుకుల ర‌వాణా చేసే వాహ‌న బీమా ప‌థ‌కాల‌పై జీఎస్‌టీని 5 శాతానికి త‌గ్గించింది.
 • సెబీ మ్యూచువ‌ల్ ఫండ్ డిస్ట్రిబ్యూట‌ర్లు వ‌సూలు చేసే ముంద‌స్తు క‌మీష‌న్ పై నిషేధం విధించింది.
 • టోట‌ల్ ఎక్స్‌పెన్స్ రేషియో (టీఈర్) ను ఏప్రిల్ 1, 2019నుంచి అమ‌ల్లోకి తీసుకురానుంది
 • ప్ర‌భుత్వం డెట్ ఈటీఎఫ్‌ల‌ను నిర్వ‌హించేందుకు అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల‌ను ఆహ్వ‌నించింది.

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లునెల వారీగా గ‌రిష్ట ఎంత ? క‌నిష్టం ఎంత‌?
బంగారం, వెండి ధ‌ర‌లు నెల‌వారీగా అత్య‌ధికం ఎంత ? అత్య‌ల్పం ఎంత‌?
సెన్సెక్స్, నిఫ్టీలు నెల‌వారీగా అత్య‌ధికం ఎంత? అత్య‌ల్పం ఎంత ?
డాల‌ర్-రూపాయి మార‌కం విలువ ఏ నెల‌లో అత్య‌ధికం? ఏ నెల‌లో అత్యల్పం?
త‌దిత‌ర వివ‌రాలను ప‌ట్టిక‌ల్లో చూద్దాం:

2018 అక్టోబ‌రులో బంగారం (10 గ్రాములు) ధ‌ర అత్య‌ధికంగా రూ. 30,620 ను తాకింది. అత్య‌ల్పంగా ఆగ‌స్టులో రూ. 28,000 ను తాకింది. వెండి (1 కేజీ) గ‌రిష్ట‌ధ‌ర రూ. 45,200 జూన్ లో న‌మోదు చేస్తే, క‌నిష్ట ధ‌ర రూ. 38,200 ఆగ‌స్టులో న‌మోదు చేసింది.

GOLD.jpg

సెన్సెక్స్ గ‌రిష్టంగా ఆగ‌స్టు లో 38,897 పాయింట్ల‌ను చేరింది. అత్య‌ల్పంగా మార్చిలో 32597 పాయింట్ల‌కు చేరింది. నిఫ్టీ గ‌రిష్టం ఆగ‌స్టులో 11,739 మార్చి లో క‌నిష్టం 9,998 పాయింట్ల‌ను న‌మోదు చేసింది

SENSEX.jpg

అక్టోబ‌రులో డాల‌ర్ మార‌కం విలువ అత్య‌ధికంగా రూ. 74.34, అత్య‌ల్పంగా జ‌న‌వ‌రిలో రూ. 63.34 న‌మోదు అయింది.

DOL Vs Rs.jpg

హైద‌రాబాద్ లో పెట్రోల్ ధ‌ర ఒక లీట‌రు అత్య‌ధికంగా అక్టోబ‌రులో రూ. 89.06 గా న‌మోదైంది. అత్య‌ల్పంగా డిసెంబ‌రు లో రూ. 73.01 గా న‌మోదైంది. లీట‌రు డీజిల్ ధ‌ర అక్టోబ‌రులో అత్య‌ధికంగా రూ.82.33 గా న‌మోదైంది. జ‌న‌వ‌రిలో అత్య‌ల్పంగా రూ. 64.86 గా న‌మోదైంది.

PETROL.jpg

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly