మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన హానర్..

ఈ స్మార్ట్‌ఫోన్లను జూన్‌ 25 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది

మూడు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన హానర్..

ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ హువావే సబ్‌ బ్రాండ్‌ అయిన హానర్‌ ఒకేసారి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. హానర్‌ 20 సిరీస్‌లో భాగంగా హానర్‌ 20 ప్రో, హానర్‌ 20, హానర్‌ 20ఐ లను సంస్థ విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ల ధర విషయానికి వస్తే… హానర్‌ 20 ప్రో ధర రూ. 39,999 కాగా, హానర్‌ 20 ధర రూ. 32,999, అలాగే హానర్‌ 20ఐ ధర రూ. 14,999 లుగా సంస్థ నిర్ణయించింది. ఇందులో హానర్‌ 20 ప్రో, హానర్‌ 20 ప్రీమియం స్మార్ట్ ఫోన్లు కాగా, హానర్‌ 20ఐ మాత్రం బడ్జెట్ స్మార్ట్ ఫోన్. హానర్‌ 20 ప్రో, హానర్‌ 20 స్మార్ట్‌ఫోన్లను జూన్‌ 25 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది. అయితే, హానర్‌ 20ఐ మాత్రం జూన్‌ 18 నుంచే ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానుంది.

హానర్‌ 20 ప్రో స్పెసిఫికేషన్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

 • 6.26 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
 • ఆండ్రాయిడ్‌ 9.0 పై
 • కిరిన్‌ 980 చిప్‌సెట్‌
 • 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
 • వాల్యూమ్ బటన్ కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్
 • వెనుకవైపు 48+16+8+2 మెగా పిక్సెల్స్‌ ఫోర్ కెమెరా సెట్ అప్
 • ముందువైపు 32 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా విత్‌ 3డీ పోట్రెయిట్‌ లైటనింగ్‌
 • పంచ్‌ హోల్‌ కెమెరా డిస్‌ప్లే
 • 22.5W హానర్‌ సూపర్‌ ఛార్జింగ్‌
 • 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

హానర్‌ 20 స్పెసిఫికేషన్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

 • 6.26 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
 • ఆండ్రాయిడ్‌ 9.0 పై
 • కిరిన్‌ 980 చిప్‌సెట్‌
 • 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
 • వాల్యూమ్ బటన్ కింద ఫింగర్ ప్రింట్ సెన్సార్
 • వెనుకవైపు 48+16+8+2 మెగా పిక్సెల్స్‌ ఫోర్ కెమెరా సెట్ అప్
 • ముందువైపు 32 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా విత్‌ 3డీ పోట్రెయిట్‌ లైటనింగ్‌
 • పంచ్‌ హోల్‌ కెమెరా డిస్‌ప్లే
 • 22.5W హానర్‌ సూపర్‌ ఛార్జింగ్‌
 • 3750 ఎంఏహెచ్‌ బ్యాటరీ

హానర్‌ 20ఐ స్పెసిఫికేషన్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

 • 6.21 ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
 • ఆండ్రాయిడ్‌ 9.0 పై
 • కిరిన్‌ 710ఎఫ్‌ ప్రాసెసర్‌
 • 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
 • వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్
 • వెనుక వైపు 24+8+2 మెగా పిక్సెల్‌ ట్రిపుల్ కెమెరా సెట్ అప్
 • ముందువైపు 32 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
 • వాటర్‌ నాచ్‌ డిస్‌ప్లే
 • జీపీయూ టర్బో 2.0
 • 3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly