లైఫ్ స‌ర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో స‌బ్మిట్ చేయడం ఎలా?

పింఛ‌నుదారులు లైఫ్ స‌ర్టిఫికెట్‌ను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా పొంద‌వ‌చ్చు.

లైఫ్ స‌ర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో స‌బ్మిట్ చేయడం ఎలా?

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత ఫించ‌ను పొందేందుకు ప్ర‌భుత్వ పింఛ‌నుదారులు న‌వంబ‌రు 30 లోపు జీవ‌న ప్ర‌మాణ ప‌త్రం(లైఫ్ స‌ర్టిఫికేట్‌)ను ఇవ్వాల్సి ఉంటుంది. 80 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు వారు న‌వంబ‌రు 1 నుంచి లైఫ్ స‌ర్టిఫికేట్‌ను ఇవ్వ‌డం ప్రారంభించ‌వ‌చ్చు.

ఫించను దారులు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ద్వారా లైఫ్ స‌ర్టిఫికేట్‌ను ఇవ్వ‌వ‌చ్చు. ఆఫ్‌లైన్ ద్వారా అయితే, ఫించ‌ను దారులు వారు ప‌నిచేసిన సంస్థ వ‌ద్ద లైఫ్ స‌ర్టిఫికేట్‌ను తీసుకుని బ్యాంకులు, పోస్టాఫీసుల‌కు నేరుగా వెళ్ళి ఇవ్వ‌వ‌చ్చు. సంప్ర‌దాయ ప‌ద్ద‌తి ద్వారా లైఫ్ స‌ర్టిఫికేట్‌ను ఇవ్వ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంది. అంతేకాకుండా ఇత‌ర ప్రాంతాల్లో లేదా దూరంగా ఉన్న పింఛ‌నుదారులు ప్ర‌తి ఏడాది పెన్ష‌న్ ఏజెన్సీకి వ‌చ్చి ఈ స‌ర్టిఫికెట్ పొంద‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. ముఖ్యంగా వృద్ధుల‌కు ఇది వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో కూడుకున్న ప‌ని. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకే ప్ర‌భుత్వం జీవ‌న్ ప్ర‌మాణ్ పేరుతో స‌ర్టిఫికెట్ జారీ చేసేందుకు డిజిట‌ల్‌ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. దీంతో వారు హోమ్ బ్రాంచ్‌కి వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా బ‌యోమెట్రిక్ ద్వారా స‌ర్టిఫికెట్ పొంద‌వ‌చ్చు. అథెంటికేష‌న్ పూర్తైన‌ త‌ర్వాత‌ డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్ జ‌న‌రేట్ అవుతుంది. దీన్ని పెన్ష‌న్ ఏజెన్సీలు నిల్వ చేసుకుంటాయి.

ఆన్‌లైన్ ద్వారా డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికేట్‌(డీఎల్‌సీ)ను సుల‌భంగా అంద‌జేయ‌వ‌చ్చు. ఇది ఆధార్ స‌హాయంతో సుల‌భంగా జారీ అవుతుంది. ఇందుకోసం పెన్ష‌న్ పంపిణీ అధికారిని గానీ, బ్యాంకులు, పోస్టాఫీసుల‌ను గానీ నేరుగా సంప్ర‌దించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

ఫించ‌నుదారులు జీవ‌న ప్ర‌మాణ ప‌త్రాన్ని ఆన్‌లైన్‌లో స‌బ్మిట్ చేయు విధానం:
ఆధార్ బేస్‌డ్ డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికేట్‌ను ప్ర‌భుత్వం 2014లో ప్రారంభించింది. ఆధార్ నెంబ‌రు, బ‌యోమెట్రిక్ డేటాను ఉప‌యోగించి స‌ర్టిఫికేట్‌ను జారీ చేస్తారు.

జీవ‌న్ ప్ర‌మాణ్ ఆన్‌లైన్ జ‌న‌రేట్ చేసుకునేందుకు కంప్యూటర్ లేదా ఓఎస్ ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా పూర్తిచేయ‌వ‌చ్చు . అయితే బ‌యోమెట్రిక్ ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన‌ర్ అవ‌స‌రం. jeevanpramaan.gov.in/app/download ఈ లింక్ ద్వారా అప్లికేష‌న్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి. త‌ర్వ‌త ఆధార్ వివ‌రాలు , పెన్ష‌న్ పే ఆర్డ‌ర్ (పీపీఓ), బ్యాంకు ఖాతా సంఖ్య‌, బ్యాంకు పేరు, మొబైల్ నంబ‌ర్ వంటి వివ‌రాల‌తో న‌మోదు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ పూర్తి చేసేందుకు ఫింగ‌ర్‌ప్రింట్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అయితే మీ వ‌ద్ద స్కాన‌ర్‌, కంప్యూట‌ర్ లేదా మొబైల్ వంటి అవ‌స‌నమైన ప‌రిక‌రాలు లేకుంటే సిటిజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ (సీఎస్‌సీ) లేదా పోస్టాఫీస్‌, బ్యాంకు శాఖ‌ల‌కు వెళ్లి అస‌వ‌ర‌మైన వివ‌రాల‌ను అందించి డిజిటల్ లైఫ్ స‌ర్టిఫికెట్ పొంద‌వ‌చ్చు. మీకు ద‌గ్గ‌ర‌లోఉన్న సీఎస్‌సీ ఆఫీస్ వివ‌రాలను JPL <PIN Code?తో 7738299899 నంబ‌ర్‌కి ఎస్ఎంఎస్ చేసి తెలుసుకోవ‌చ్చు.

ఆధార్ ద్వారా ధ్రువీక‌ర‌ణ విజ‌య‌వంత‌మైతే డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్ రూపొందుతుంది. ఇది రిపాజిట‌రీలోని రికార్డుల్లో భ‌ద్రంగా నిక్షిప్త‌మై ఉంటుంది. ఆధార్ అనుసంధానిత బ‌యోమిట్రిక్ ధ్రువీక‌ర‌ణ విజ‌య‌వంత‌మ‌య్యాక ఒక విశిష్ట కోడ్ జ‌న‌రేట్ అవుతుంది. దీన్నే ప్ర‌మాణ్ ఐడీగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ విధానం పూర్త‌యిన త‌ర్వాత మీకు జీవ‌న్ ప్ర‌మాణ్ ఐడీ తో కూడిన అక్నాలెడ్జ్‌మెంట్ వ‌స్తుంది. స‌ర్టిఫికెట్ పీడీఎఫ్ కూడా జీవ‌న్ ప్ర‌మాణ్ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

పెన్ష‌న్ పంపీణీ ఏజెన్సీ వ‌ద్ద డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికేట్ అందుబాటులో ఉంటుంది. 2014 నుంచి 2.6 కోట్ల ఫించ‌ను దారులు డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికేట్‌ను ఉప‌యోగించారు.

లైఫ్ స‌ర్టిపికేట్‌ను స‌బ్మిట్ చేసేందుకు చివ‌రి తేదీ:

80 ఏళ్ళ వ‌య‌సు లోపు ఫించ‌ను దారులు న‌వంబ‌రు 1 నుంచి మొద‌లుకుని న‌వంబ‌రు 30 వ‌ర‌కు జీవ‌న ప్ర‌మాణ ప‌త్రాన్ని ఇవ్వ‌వ‌చ్చు. 80 ఏళ్ళు అంత‌కంటే ఎక్కువ వ‌య‌సున్న సీనియ‌ర్ ఫెన్ష‌న‌ర్లు అక్టోబ‌రు 1 నుంచే లైఫ్ స‌ర్టిపికేట్‌ల‌ను ఇచ్చేందుకు అనుమ‌తిస్తున్నారు. అయితే చివ‌రి తేదీ మాత్రం న‌వంబ‌రు 30. ఫించ‌ను దారులు గ‌డువు తేదీ లోపుగా లైఫ్ స‌ర్టిఫికేట్‌ను స‌బ్మిట్ చేయ‌క‌పోతే త‌దుప‌రి నెల నుంచి పెన్ష‌న్ పొంద‌లేరు. లైఫ్ స‌ర్టిఫికేట్ స‌మ‌ర్పించిన నాటి నుంచి తిరిగి పెన్ష‌న్ రావ‌డం ప్రారంభ‌మ‌వుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly