ఆన్ లైన్ ద్వారా యూఏఎన్ ను పొందండిలా..

ఒకవేళ ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరోక సంస్థకు మారితే, అతడు మునుపటి సంస్థ నుంచి ప్రస్తుత సంస్థకు పీఎఫ్ డబ్బును బదిలీ చేసుకోవచ్చు

ఆన్ లైన్ ద్వారా యూఏఎన్ ను పొందండిలా..

ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్)కి ఒక ఉద్యోగి మునుపటి, ప్రస్తుత వాటాలను ఒకే ఒక ఆన్ లైన్ ప్లాట్ ఫారంకు తీసుకురావడం ద్వారా ప్రక్రియను ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) సులభతరం చేసింది, సభ్యుడు యూనివర్సల్ ఖాతా సంఖ్య (యూఏఎన్) ద్వారా ఈపీఎఫ్ఓ ను యాక్సిస్ చేయవచ్చు. ఈపీఎఫ్ఓ అనేది ప్రైవేటు రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులకు అందించే ఒక పదవీ విరమణ ప్రయోజన పధకం. ఉద్యోగి ప్రాథ‌మిక వేత‌నం+ డీఏ నుంచి 12 శాతం పీఎఫ్ ఖాతాలోకి చేరుతుంది. సంస్థ కూడా అంతే మొత్తం వాటాను ఈ ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అర్హతగల ప్రాథమిక వేతనాల్లో 1.16 శాతం వాటాను అందిస్తుంది. ఉద్యోగులకు సంబంధించిన భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాలను నిర్వహించడానికి ఈపీఎఫ్ఓ అధికారిక ట్రస్టులకు పీఎఫ్ వాటాలను జమ చేస్తారు. ఒకవేళ ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరోక సంస్థకు మారితే, అతడు మునుపటి సంస్థ నుంచి ప్రస్తుత సంస్థకు పీఎఫ్ డబ్బును బదిలీ చేసుకోవచ్చు లేదా పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో ఉద్యోగులు పీఎఫ్ డబ్బును బదిలీ చేయడానికి లేదా ఉపసంహరించుకోడానికి, వారు గతంలో పనిచేసిన సంస్థను సందర్శించి, దరఖాస్తు ఫారమ్లను నింపి, వివిధ డాక్యుమెంట్లతో పాటు దానిని సమర్పించాల్సి వచ్చేది.

అయితే, ఈపీఎఫ్ఓ ​​యూఏఎన్ ను ప్రవేశపెట్టిన తరువాత ఈ ప్రక్రియ చాలా సులభం అయ్యింది, ఒకవేళ మీకు ఇప్పటికే యూఏఎన్ ను కలిగి ఉండి, ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో ఉద్యోగం మానేసి, కొత్త సంస్థలో చేరే సమయంలో వారికి మీ యూఏఎన్ ను సమర్పిస్తే సరిపోతుంది. అప్పుడు వారు కొత్తగా కేటాయించిన మెంబర్ ఐడీని మీ యూఏఎన్ తో లింక్ చేస్తారు. మీ యూఏఎన్ కింద వివిధ సంస్థలు ఇచ్చే ఐడీ లను లింక్ చేయడం ద్వారా ప్రస్తుత, మునుపటి సంస్థల పీఎఫ్ సంబంధిత వివరాలను ఒకే ప్రదేశంలో వీక్షించడానికి ఈపీఎఫ్ఓ సభ్యుడు సహాయపడుతుంది.

కేవలం వివరాలను వీక్షించడమే కాకుండా, పీఎఫ్ డబ్బుని ఉపసంహరించుకోడానికి లేదా బదిలీ చేయడానికి మీ మునుపటి సంస్థను సందర్శించాల్సిన అవసరం లేదు.

ఒకవేళ మీరు యూఏఎన్ ను కలిగి ఉండకపోతే, దానిని పొందడానికి మునుపటి సంస్థ యజమానిని కలవలేకపోతే, మీరు ఆన్ లైన్ లో ఈపీఎఫ్ఓ ​వెబ్ సైటును https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ను సందర్శించి, ‘యాక్టీవేట్ యూఏఎన్’ ఆప్షన్ పై క్లిక్ చేసి యూఏఎన్ ను పొందవచ్చు.

ఈ కింది సంఖ్యలలో దేనినైనా ఒకదానిని నమోదు చేసి యూఏఎన్ ను యాక్టీవేట్ చేసుకోవచ్చు :

  • యూఏఎన్
  • మెంబర్ ఐడీ
  • ఆధార్ నెంబర్ లేదా పాన్

యూఏఎన్ లేకపోతే, మీరు మెంబర్ ఐడీ లేదా ఆధార్ లేదా పాన్ ను ఉపయోగించవచ్చు.

పైన పేర్కొన్న వాటితో పాటు, మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, క్యాప్త్సా లను నమోదు చేయాలి. మీరు నమోదు చేసిన డేటా మ్యాచ్ అయిన తర్వాత, మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత, మీ మొబైల్ నెంబరుకు యూఏఎన్, పాస్ వర్డ్ తో కూడిన మరొక ఎస్ఎంఎస్ వస్తుంది. దీంతో మీరు మునుపటి సంస్థను సంప్రదించకుండానే, ఆన్ లైన్ ద్వారా యూఏఎన్ ను పొందవచ్చు.

ఒకవేళ మీరు యూఏఎన్ ని యాక్టీవేట్ చేసి, దాన్ని మర్చిపోయి ఉన్నట్లయితే, ‘యాక్టీవేట్ యూఏఎన్’ ఆప్షన్ కి బదులుగా ‘నో యువర్ యూఏఎన్ స్టేటస్’ బటన్ ని ఉపయోగించుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly