వ‌డ్డీ రేట్లు పెరిగాయి - మీకేంటి?

రెపో రేటు పెరిగింది.. ఎమ్‌సీఎల్ఆర్ పెరుగుతుంది

వ‌డ్డీ రేట్లు పెరిగాయి - మీకేంటి?

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో- ద్వైమాసిక‌ ద్ర‌వ్య‌ప‌రప‌తి స‌మావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంపు నిర్ణ‌యం తీసుకుంది. ఈ పెంపుతో ప్ర‌ధాన బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు రుణాలపై వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతాయి.

వ‌డ్డీ రేట్లు పెంచితే ఏంటి అని అనుకుంటున్నారా. సామాన్య ప్ర‌జ‌ల‌పై దీని ప్ర‌భావం వివిధ రూపాల్లో ఉంటుంది.

రుణం తీసుకునేవారికి రేటు పెంపు ద్వారా రుణంపై వ‌డ్డీ రేటు పెరుగుతుంది. గృహ రుణాలు, ఆటో రుణాలు, వ్యక్తిగత రుణాలపై చెల్లించాల్సిన‌ వ‌డ్డీ రేటు పెరుగుతుంది. ఫ్లోటింగ్ రేటు ఆప్ష‌న్ తో రుణాలు తీసుకున్న వారికి వ‌డ్డీ భారం పెరుగుతుంది.

బ్యాంకుల్లో పొదుపు చేసే వారికి దీని ద్వారా వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం పెరుగుతుంది. ఈ ప్ర‌భావం ఎక్కువ‌గా గృహ‌రుణాల‌పై ఉంటుంది. డిపాజిట్లు చేయాలనుకునే వారికి ఇది శుభవార్తనే చెప్పాలి.

ఎమ్‌సీఎల్ఆర్ పెంపు

ప్ర‌స్తుతం బ్యాంకులు ఎమ్‌సీఎల్ఆర్ ను ప్రామాణికంగా తీసుకుని వ‌డ్డీ రేట్ల‌ను నిర్ణ‌యిస్తున్నారు. ఆర్‌బీఐ రేటు పెంపుతో అన్ని బ్యాంకులు ఎమ్‌సీఎల్ఆర్ ను పెంచుతారు. కాబ‌ట్టి రుణం తీసుకునే వారు ఎమ్‌సీఎల్ఆర్ తక్కువ‌గా ఉండే బ్యాంకులో రుణాలు తీసుకోవాలి.

(సంబంధిత క‌థ‌నం: ఎమ్‌సీఎల్ఆర్ అంటే)

రిజ‌ర్వుబ్యాంకు 25 బేసిస్ పాయింట్లు వ‌డ్డీరేటు ను పెంచింది కాబ‌ట్టి ప్ర‌స్తుతం రుణాలు తీసుకున్న‌వారికి నెల‌వారి వాయిదాలు (ఈఎమ్ఐ) మ‌రింత పెర‌గ‌నున్నాయి. గృహ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు పెరుగుతాయి. అయితే ప్ర‌స్తుత రుణం తీసుకున్న‌వారు కొత్త వ‌డ్డీ రేట్ల ప్ర‌భావం ప‌డ‌కుండా ఉండాలంటే రుణాన్ని ఆ బ్యాంకు నుంచి మ‌రో బ్యాంకుకి బ‌దిలీ చేసుకోవచ్చు

స్థిరాదాయ ప‌థ‌కాలపై వ‌చ్చే రాబ‌డి అవి ఇచ్చే వ‌డ్డీ రేట్ల‌ పై ఆధార‌ప‌డి ఉంటాయి. ఎంత ఎక్కువ వ‌డ్డీ రేటు ఉంటే అంత ఎక్కువ రాబ‌డి ఉంటుంది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అయితే వ‌డ్డీ రేట్లు పెర‌గ‌డం మూలంగా బాండ్ల ధ‌రలు త‌గ్గుతాయ‌ని, వ‌డ్డీ రేట్లు త‌గ్గిన సంద‌ర్భంలో బాండ్ల ధ‌రలు పెరుగుతాయ‌ని గ‌మ‌నించారా.

బ్యాంకుల‌కు సంబంధించిన వ‌ర‌కూ ఇది మంచి ప‌రిణామేన‌ని చెప్ప‌వ‌చ్చు. వాటి ఆదాయం దీనితో ముడిప‌డి ఉంటుంది కాబ‌ట్టి ఇది బ్యాంకులు కుదుట‌ప‌డేందుకు కొంత వ‌ర‌కూ స‌హ‌క‌రిస్తుంద‌ని చెప్పాలి.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly