పెద్ద మొత్తంలో రివార్డ్ పాయింట్లను పొందడం ఎలా?

ఒకవేళ మీరు ఒక నెలలో రూ. 15,000 లావాదేవీ చేసినట్లయితే, మీరు 200 రివార్డ్ పాయింట్లను పొందుతారు

పెద్ద మొత్తంలో రివార్డ్ పాయింట్లను పొందడం ఎలా?

క్రెడిట్ కార్డ్ పాయింట్లను పెంచుకోవడం ఎలా? కేవలం క్రెడిట్ కార్డును కలిగి ఉన్నంత మాత్రాన వాటిని పెంచుకోవడం కుదరదు. ప్రస్తుతం ఏదైనా వస్తువును నగదు చెల్లించకుండా కొనుగోలు చేసి, వచ్చే నెలలో దాని బిల్లును చెల్లించడానికి సాధారణంగా క్రెడిట్ కార్డును వినియోగిస్తుంటారు. మీరు క్రెడిట్ కార్డును ఉపయోగించడం ద్వారా పొందగలిగే ఇతర ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ప్రతి క్రెడిట్ కార్డు వినియోగదారుడు తమ క్రెడిట్ కార్డు ద్వారా విలువైన వస్తువులను కొనడం, దాని తాలూకా బిల్లును వచ్చే నెలలో చెల్లించడం వంటి ప్రయోజాలను మాత్రమే కాకుండా మరిన్ని ప్రయోజనాలను బ్యాంకు అందిస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలి. అలాంటి వాటిలో రివార్డ్ పాయింట్లు ఒకటి.

గడువు తీరేలోగా క్లెయిమ్ చేసుకోండి :

సాధారణంగా ఒక వీసా క్రెడిట్ కార్డు మీరు చేసే ఖర్చులపై ప్రతి పాయింట్ కు 25 పైసలను అందిస్తుంది. మీ క్రెడిట్ కార్డు ద్వారా చేసే ప్రతి రూ. 150 వ్యయంపై 2 రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. ఒకవేళ మీరు ఒక నెలలో రూ. 15,000 లావాదేవీ చేసినట్లయితే, మీరు 200 రివార్డ్ పాయింట్లను పొందుతారు. అంటే దాని అర్ధం మీరు రూ. 40 బోనస్ ను పొందుతారు. కానీ ఆ బోనస్ మొత్తాన్ని ఒక సంవత్సరం లోగా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే దాని గడువు ముగిసిపోతుంది.

క్రెడిట్ కార్డు చెల్లింపులను పెంచండి :

మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్, డీటీహెచ్ సేవలు, ఇతర యుటిలిటీ బిల్లులను క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించండి. డిజిటలైజెషన్ సమయంలో, పెద్ద మొత్తంలో బిల్లులు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాలి. ఉదాహరణకు, మీరు తరచుగా స్నేహితులతో కలిసి భోజనం చేయడానికి రెస్టారెంట్ కి వెళ్తూ ఉంటారని అనుకుందాం. అయితే, ఒక్కొక్కరు వ్యక్తిగతంగా నగదును చెల్లించడానికి బదులుగా, ఒకేసారి మొత్తం బిల్లు చెల్లించడానికి మీరు క్రెడిట్ కార్డును ఇవ్వవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మీ స్నేహితుల నుంచి నగదును పొందడంతో పాటు, మీ క్రెడిట్ కార్డును వినియోగించినందుకు గాను మరిన్ని రివార్డ్ పాయింట్లను కూడా పొందవచ్చు.

మీరు స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి ఏదైనా వెబ్సైటు(స్విగ్జీ, ఫుడ్ పాండా, ఉబెర్ ఈట్స్ ఇలా) నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉండవచ్చు. మీ వద్ద తగినంత డబ్బు ఉన్నప్పటికీ, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయడం మంచిది. దీని ద్వారా వెబ్సైటు లో డిస్కౌంట్ తో పాటు కొన్ని రివార్డ్ పాయింట్లను కూడా పొందవచ్చు.

ఆన్ లైన్ షాపింగ్ చెయ్యండి :

ఆన్ లైన్ షాపింగ్ చేయడం ద్వారా, ఈ-కామర్స్ పోర్టల్స్ అందించే అనేక రకాల ఆఫర్లను మనం గుర్తించగలుగుతాం.ఒకోసారి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి వెబ్సైట్లు సేల్ పేరుతో కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డుల మీద ప్రత్యేక ఆఫర్లు అందిస్తుంటాయి. ఆన్ లైన్ పోర్టల్ లో షాపింగ్ చేయడం ద్వారా కొన్ని కార్డుల్లో 5-10 రెట్లు రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. ఒకవేళ అలాంటి ఆఫర్లు ఒక ప్రత్యేకమైన షాపింగ్ పోర్టల్లో అందుబాటులో ఉన్నట్లయితే, అలాంటి షాపింగ్ పోర్టల్స్ ద్వారా షాపింగ్ చేయడం మంచిది. ఇది నగదు రహిత లావాదేవీని అందించడంతో పాటు, అధిక రివార్డ్ పాయింట్లను పొందే అవకాశాన్ని పెంచుతుంది. ఆన్ లైన్ చెల్లింపు అందుబాటులో లేని ప్రత్యక్ష అవుట్ లెట్లలో షాపింగ్ చేయడం నివారించాలి. మీ నెలవారీ గ్రోసరీస్ కోసం కూడా ఆన్ లైన్ లో చెల్లించడం మంచిది.

ఎవరైనా ఒకే ఉత్పత్తి పై ప్రత్యక్ష అవుట్ లెట్, ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ మధ్య పెద్ద మొత్తంలో ధరల వ్యత్యాసాన్ని గుర్తించినట్లయితే, వారు నేరుగా ఆన్ లైన్ చెల్లింపు అందుబాటులో ఉన్న ప్రత్యక్ష అవుట్ లెట్ కు వెళ్లి, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేసి, అదనంగా రివార్డ్ పాయింట్లను పొందవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly