యూఏఎన్ లో పేరు, పుట్టిన తేదీని మార్చడం ఎలా?

మీ ఆధార్ నెంబర్ యూఏఎన్ తో అనుసంధానించని సందర్భంలో మాత్రమే ఈ ప్రక్రియ పని చేస్తుంది

యూఏఎన్ లో పేరు, పుట్టిన తేదీని మార్చడం ఎలా?

యూఏఎన్ పోర్టల్ లో మీరు మీ పేరు, పుట్టిన తేదీ, ఆడ/మగ వంటి వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ఈపీఎఫ్ యూఏఎన్ కరెక్షన్ అని పిలుస్తారు. యూఏఎన్ డేటాలోని పేరు, పుట్టిన తేదీ, ఆడ/మగ అసమతుల్యత కారణంగా మీ ఆధార్ నెంబర్ ను యూఏఎన్ తో అనుసంధానించలేకపోతే, మీరు ఈ వివరాలను అప్ డేట్ చేయడానికి యూఏఎన్ పోర్టల్ ను ఉపయోగించవచ్చు. ఆధార్ ప్రకారం యూఏఎన్ పోర్టల్ లో పేరు, పుట్టిన తేదీ, ఆడ/మగ వివరాలను అప్ డేట్ చేయడానికి అనుసరించాల్సిన ప్రక్రియను కింద చూద్దాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ ఆధార్ నెంబర్ యూఏఎన్ తో అనుసంధానించని సందర్భంలో మాత్రమే ఈ ప్రక్రియ పని చేస్తుంది. ఒకవేళ మీ ఆధార్ నెంబర్ యూఏఎన్ తో అనుసంధానించినట్లైతే, మీరు ఈ వివరాలను ఆన్ లైన్ లో అప్ డేట్ చేయలేరు.

ఈపీఎఫ్ యూఏఎన్ డేటాను సవరించే ప్రక్రియ :

ఈపీఎఫ్ యూఏఎన్ డేటాను సవరించడానికి ఉద్యోగి యూఏఎన్ పోర్టల్ లో లాగిన్ అయ్యి, ఆన్ లైన్ ద్వారా అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. మీరు సమర్పించిన అభ్యర్థన మీ యజమానికి బదిలీ అవుతుంది. అప్పుడు మీ యజమాని దానిని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఒకవేళ మీ యజమాని ఈ అభ్యర్ధనను ఆమోదించినట్లయితే, అది ఈపీఎఫ్ఓ ​​కార్యాలయానికి బదిలీ అవుతుంది. అక్కడ అధికారి మీ అభ్యర్థనను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

ఆన్ లైన్ ద్వారా మీరు సమర్పించిన అభ్యర్థన ఆమోదం పొందడానికి లేదా తిరస్కరణకు గురవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. ఒకవేళ మీ ఆధార్ నెంబర్ యూఏఎన్ తో అనుసంధానించినట్లైతే, మీరు ఆన్ లైన్ ద్వారా మార్పులు చేయలేరు. ఇలాంటి సందర్భంలో మీరు ఈపీఎఫ్ఓ ​​కార్యాలయాన్ని సందర్శించి, మాన్యువల్ ఫారంను సమర్పించాల్సి ఉంటుంది.

యూఏఎన్ లో పేరు, పుట్టిన తేదీ, ఆడ/మగ వివరాలను అప్ డేట్ చేయడం ఎలా?

యూఏఎన్ లో పేరు, పుట్టిన తేదీ, ఆడ/మగ వివరాలను అప్ డేట్ చేయడానికి అనుసరించాల్సిన ప్రక్రియను కింద చూద్దాం. ఈ ప్రక్రియను ఖచ్చితంగా ఉద్యోగి మాత్రమే చేయవలసిన ఉంటుంది.

పోర్టల్ లో యూఏఎన్ కరెక్షన్ కోసం ఉద్యోగి తన అభ్యర్ధనను నమోదు చేయడం :

 • మొదటగా మీ యుఎన్ఎన్, పాస్ వర్డ్ ను ఉపయోగించి యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ లో లాగిన్ అవ్వాలి. దీని కోసం మీరు మీ యజమాని నుంచి యూఏఎన్ నంబర్ ను పొందవచ్చు.

 • లాగిన్ అయిన తరువాత మీకు నావిగేషన్ బార్ కనిపిస్తుంది. అక్కడ మేనేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, మీకు బేసిక్ డిటైల్స్ అనే మరొక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై కూడా క్లిక్ చేయండి.

 • అక్కడ మీ ప్రాథమిక వివరాలను అప్ డేట్ చేయండి.

 • మీ ఆధార్ కార్డులోని వివరాలను అందించాలి. మీరు అందించే డేటా యూఐడీఏఐ డేటా బేస్ తో పోల్చడం జరుగుతుంది.

 • అప్ డేట్ డిటైల్స్ పై క్లిక్ చేసినప్పుడు, మీ అభ్యర్థన ఆమోదం కోసం మీ యజమానికి బదిలీ అవుతుంది.

 • మీ ప్రాథమిక వివరాలను అప్ డేట్ చేయడానికి మీకున్న మరొక ప్రత్యామ్నాయ మార్గం ఏమిటంటే, మీ ప్రొఫైల్ ని సందర్శించడం. ప్రొఫైల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ ప్రొఫైల్ ను వీక్షించవచ్చు.

 • ఇక్కడ మీ పేరు, పుట్టిన తేదీ, ఆడ/ మగ, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, విద్యార్హతలు, వైవాహిక స్థితి వంటి వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు.

 • మీ పేరు, పుట్టిన తేదీ, ఆడ/ మగ మార్పు కోసం అభ్యర్థన చేసినట్లయితే, మీ యజమాని ఈ అభ్యర్థనను ఆమోదిస్తారు.

 • ఒకవేళ మీరు ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, వైవాహిక స్థితి లేదా విద్యార్హతను అప్ డేట్ చేసుకోవాలనుకుంటే, సులభంగా చేసుకోవచ్చు. ఈ మార్పులకు యజమాని ఆమోదం అవసరం లేదు. అయితే, దీనికి ఓటీపీ ఆధారిత ప్రామాణీకరణ అవసరం అవుతుంది.

 • మీ వైవాహిక స్థితి, విద్యార్హతలను మార్చడానికి రిక్వెస్ట్ పై క్లిక్ చేసినప్పుడు, అవసరమైన ఇన్ ఫుట్ లను అందించాల్సి ఉంటుంది. ఒకసారి మీ వివరాలను మార్చిన తరువాత ‘ఆథరైజేషన్ పిన్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

 • ‘గెట్ ఆథరైజేషన్ పిన్’ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఒక పాప్ అప్ బాక్స్ ను పొందుతారు. అందులో మీరు చేసిన మార్పులను నిర్ధారించాలా అని అడుగుతుంది. అప్పుడు మీరు ‘ఎస్’ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. అనంతరం మీరు ఓటీపీ ని నమోదు చేసి, ‘సేవ్ చేంజెస్’ పై క్లిక్ చేయండి.

 • ఇలా చేయడం ద్వారా మీరు చేసిన మార్పులు విజయవంతంగా సేవ్ అవుతాయి.

ఉద్యోగుల అభ్యర్థనను యజమాని ఆమోదించడం లేదా తిరస్కరించడం :

ఒకసారి మీరు ఆన్ లైన్ లో అభ్యర్థనను సమర్పించినప్పుడు, మీ యజమాని ఆ అభ్యర్థనను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేస్తారు. ఒకవేళ అభ్యర్థనను యజమాని ఆమోదించినట్లైతే, అది తుది ఆమోదం కోసం ఈపీఎఫ్ఓ ​​కార్యాలయానికి బదిలీ అవుతుంది. దీనిలో భాగంగా యజమాని అనుసరించే ప్రక్రియను కింద చూద్దాం.

 • యజమాని తన యునిఫైడ్ పోర్టల్ ఇంటర్ఫేస్ కు లాగ్ ఇన్ అవుతారు.

 • మెంబర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా ఉద్యోగులు సమర్పించిన అభ్యర్థనలను యజమాని చూడవచ్చు

 • యజమాని ఉద్యోగుల అభ్యర్థనను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

 • ఒకవేళ యజమాని ఉద్యోగుల అభ్యర్థనను ఆమోదించినట్లయితే, అది ఈపీఎఫ్ఓ కార్యాలయానికి బదిలీ అవుతుంది.

అభ్యర్థనను ఈపీఎఫ్ఓ ఆమోదించడం లేదా తిరస్కరించడం :

 • ఈపీఎఫ్ఓ ​​కార్యాలయంలో, ఈ విభాగానికి సంబంధించిన ఉద్యోగి తన సిఫార్సులను సమర్పించి, ఆమోదం లేదా తిరస్కరణ కోసం తన పైన ఉన్న అధికారులకు బదిలీ చేస్తారు.

 • అనంతరం ఈ అభ్యర్థనను సెక్షన్ సూపర్వైజర్ ద్రువీకరిస్తారు.

 • చివరగా, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (ఏపీఎఫ్సీ) / ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (ఆర్పీఎఫ్సీ) కేసుని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

గమనిక :

పైన తెలిపిన ప్రక్రియ ఆధార్ నెంబర్ ను యూఏఎన్ తో అనుసంధానం చేయని సందర్భంలో మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ఇప్పటికే యూఏఎన్ ను ఆధార్ తో అనుసంధానించి ఉన్నట్లయితే, మీ పేరు, పుట్టిన తేదీ, ఆడ/ మగ వంటి ప్రాథమిక వివరాలను అప్ డేట్ చేయలేరు. ఒకవేళ ఈ వివరాలను మీరు అప్ డేట్ చేసుకోవాల్సి వస్తే, ఈపీఎఫ్ఓ ​​కార్యాలయాన్ని సంప్రదించి అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం కోసం మీరు కింద తెలిపిన నెంబర్ ను, మెయిల్ ఐడీని సంప్రదించవచ్చు :

హెల్ప్ డెస్క్ నెంబర్ : 1800 118 005
హెల్ప్ డెస్క్ ఈ-మెయిల్ ఐడీ : uanepf@epfindia.gov.in

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly